Vijaya Lakshmi
Published on Jan 02 2026
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ. మార్గాళి మాసంలో పౌర్ణమి నాడు వచ్చే "ఆరుద్ర" నక్షత్రం రోజున ఈ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. శివభక్తులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఆరుద్రోత్సవం ఒకటి. ఈ ఉత్సవం శివుని నాట్యరూపమైన నటరాజ స్వామికి అంకితం చేయబడింది. తమిళ మార్గాళి మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున జరుపుకునే ఈ పండుగ, శివతత్వాన్ని, సృష్టి–స్థితి–లయ రహస్యాన్ని ప్రతిబింబిస్తుంది.
హిందూ సంప్రదాయం ప్రకారం, మార్గాళి పూర్ణిమ రోజున శివుడు నటరాజ స్వామిగా ఆనంద తాండవం చేస్తూ భక్తులకు దర్శనమిస్తాడు. "ఆరుద్ర" నక్షత్రం శివునికి జన్మ నక్షత్రంగా భావిస్తారు. ఈ రోజున చేసే శివ దర్శనాన్ని 'ఆరుద్ర దర్శనం' అంటారు. ప్రధానంగా తమిళనాడులోని చిదంబరం నటరాజ స్వామి ఆలయంలో ఈ వేడుకలు అత్యంత వేడుకగా జరుగుతాయి.
ఈ ఉత్సవం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది:
పరమశివుని ఆనంద తాండవాన్ని చూడాలని పతంజలి మహర్షి, వ్యాఘ్రపాదుడు ఘోర తపస్సు చేస్తారు. వారి భక్తికి మెచ్చిన శివుడు మార్గశిర పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున చిదంబరం (కనకసభ) లో తన దివ్యమైన ఆనంద తాండవాన్ని ప్రదర్శిస్తాడు. ఆ అద్భుత దృశ్యాన్ని స్మరిస్తూ ప్రతి ఏటా ఆరుద్రోత్సవం నిర్వహిస్తారు.
· ఈ రోజున శివునికి 'ఆరుద్ర కధంబం' లేదా 'తిరువాదిరై కళి' అనే ప్రత్యేక ప్రసాదాన్ని నివేదిస్తారు. బియ్యం, బెల్లం, నెయ్యితో చేసే ఈ తీపి పదార్థం ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ. దీని వెనుక 'సేందనార్' అనే భక్తుడి కథ ప్రాచుర్యంలో ఉంది.
అభిషేకాలు - అర్చనలు
· ఈ రోజు తెల్లవారుజామునే (బ్రాహ్మీ ముహూర్తంలో) శివాలయాల్లో రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. నటరాజ విగ్రహాలకు ప్రత్యేకంగా పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలతో అభిషేకం చేస్తారు.
ప్రకృతితో సంబంధం
· ఖగోళ శాస్త్రం ప్రకారం, ఆరుద్ర నక్షత్రం ఆకాశంలో ఎర్రగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇది శివుని కోపానికి (రుద్ర రూపం) మాత్రమే కాకుండా, సృష్టిలోని అనంతమైన శక్తికి ప్రతీకగా భావిస్తారు.
· సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించడం.
· శివాలయానికి వెళ్లి నటరాజ స్వామిని దర్శించుకోవడం.
· 'శివాష్టకం' లేదా 'లింగాష్టకం' పఠించడం.
· వీలైతే పేదలకు అన్నదానం చేయడం.
ఆరుద్రోత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు…
అది శివుడి తాండవ లీలను స్మరించుకునే ఆధ్యాత్మిక మహోత్సవం.
ఆరుద్రోత్సవం అంటే ఏమిటి?
“ఆరుద్ర” అనేది ఒక నక్షత్రం పేరు. తమిళ మార్గాళి మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున శివుడు నటరాజ రూపంలో తాండవం చేశాడని పురాణ వచనం. అందుకే ఈ రోజును ఆరుద్రోత్సవంగా జరుపుకుంటారు.
శివుడి తాండవం అనేది కేవలం నృత్యం కాదు.
అది సృష్టి, రక్షణ, లయ, మాయ, అనుగ్రహం అనే పంచకృత్యాలకు ప్రతీక.
తమిళనాడులోని చిదంబరం నటరాజ ఆలయం ఆరుద్రోత్సవానికి కేంద్రబిందువుగా నిలుస్తుంది. ఇక్కడ ఈ ఉత్సవం 10 రోజుల పాటు ఘనంగా జరుగుతుంది.
ప్రత్యేక ఆకర్షణ👇
👉 ఆకాష చిదంబర రహస్యం
👉 చిదంబర రహస్య దర్శనం
👉 మహా అభిషేకం
చిదంబరం ఆలయంలో శివుడు ఆకాశ తత్త్వంగా పూజింపబడతాడు. ఇది పంచభూత క్షేత్రాలలో అత్యంత విశిష్టమైనది.
మార్గాళి మాసంలో వచ్చే 'ఆరుద్ర నక్షత్రం' రోజున శివునికి జరిపే ప్రత్యేక ఉత్సవమే 'ఆరుద్రోత్సవం' గా చెప్పబడుతోంది.ఈ రోజున శివాలయాలన్నీ భక్తులతో సందడిగా కనిపిస్తుంటాయి. ఆరుద్ర నక్షత్రం పరమశివుడి జన్మనక్షత్రంగా, ప్రీతికరమైన నక్షత్రంగా శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ పర్వదినాన శివాలయాలో ప్రత్యేక పూజలు, విశేష ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అదేరోజు సాయంత్రం ప్రదోష వేళలో జరిపే పూజాభిషేకాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. అందువలన భక్తులు ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, ప్రదోష వేళలో ఆయనకి బిల్వపత్రాలతో పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు.
ఈ సమయంలో పూజా మందిరంలోగానీ, శివాలయంలోగాని దీపం వెలిగించడం మంచిది. ఇలా ఈ మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున పరమశివుడిని పూజించడం వలన సమస్త దోషాలు తొలగిపోయి సకలశుభాలు కలుగుతాయని పండితులు అంటున్నారు.
ఈ రోజున శివునికి 'ఆరుద్ర కధంబం' లేదా 'తిరువాదిరై కళి' అనే ప్రత్యేక ప్రసాదాన్ని నివేదిస్తారు. బియ్యం, బెల్లం, నెయ్యితో చేసే ఈ తీపి పదార్థం ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ. దీని వెనుక 'సేంథనార్' అనే భక్తుడి కథ ప్రాచుర్యంలో ఉంది.
చిదంబరం సమీపంలో ఉండేవాడు కట్టెలు కొట్టుకొని జీవించే సేంథనార్. అతడు పరమ శివభక్తుడు. శివభక్తుడు సాక్షాత్తూ శివుడే అన్న భావనతో ఉండేవాడు. ప్రతిరోజూ తాను కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఒక శివభాక్తునికి ఆహారం పెట్టి తాను భుజించేవాడు. ఒకరోజు విపరీతమైన కుంభవృష్టి కారణంగా కట్టెలన్నీ తడిసిపోయి ఎంత ప్రయత్నించినా అమ్ముడుపోలేదు. దాంతో సంపాదన లేకుండా పోయింది. తన నియమం ప్రకారం శివభాక్తునికి ఆహారం పెట్టడానికి తన దగ్గర ఏమీ లేని పరిస్తితి. దాంతో బాగా ఆలోచించి ఇంట్లో ఉన్న కొద్ది పిండిని తీసుకొని దానికి బెల్లం, ఇంట్లో ఉన్న కొబ్బరి కలిపి ఒక రకమైన పదార్ధం తయారు చేసాడు.
ఇంతలో శివుడు సేంథన్ భక్తికి మెచ్చి ఒక సాధువు వేషంలో వచ్చి తనకు ఆహారం పెట్టమని అడిగాడు. అయ్యో... సాధువుకు పెట్టడానికి తన దగ్గర సరైన ఆహారం లేదే అని బాధపడ్డాడు సేంథన్. అతని సంకోచాన్ని గమనించిన శివుడు నీ దగ్గర ఉన్నదే పెట్టమని అడిగాడు. దాంతో సంకోచిస్తూనే తాను తయారుచేసిన పదార్ధాన్ని పెట్టాడు. దానిని ఎంతో ఇష్టంగా తిన్నాడు సాధువుగా ఉన్న శివుడు. ఆ రోజు మార్గాలి మాసం ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు.
ఆ మరునాడు ఆలయం తలుపులు తెరిచిన పూజారులు ఆలయంలో ఉన్న ఈ పదార్ధం చూసి, ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అలాంటి నైవేద్యం స్వామికి ఎప్పుడో నివేదించరు. పైగా స్వామి పెదవులకు కూడా ఆ పదార్ధం అంటుకొని ఉంది. దాంతో ఎవరో ఇలాంటి అపచారం చేసారని రాజు గారికి ఫిర్యాదు చేసారు.
ఆ ప్రాంతపు రాజు పరమ శివభక్తుడు. ఎంతటి భక్తుడంటే... తన ఆరాధన సమయంలో మందిరంలో ప్రతిరోజూ శివుడు అక్కడ నడయాడుతున్నట్టు పాద ధ్వని వినేవాడు. కాని ఆ రోజు ఆ పద ధ్వనులు వినబడలేదు. దాంతో వ్యాకులపడ్డాడు రాజు. ఆ రాత్రి శివయ్య కలలో కనబడి ఆ సమయంలో నేను సేంథనార్ పెట్టిన తీపి పదార్ధం తినడానికి వెళ్లానని చెప్పాడట. ఎవరీ సేంథనార్ అని రాజు ఎంత వెతికినా ఫలితం లేకపోయింది.
ఆ తరువాత నటరాజ స్వామి వారి ఉత్సవ ఊరేగింపు సందర్భంగా స్వయంగా రాజుగారు ఆ రథం లాగడం ఆనవాయితీ కానీ ఎంత ప్రయత్నించినా, ఎంతమంది ప్రయత్నించినా రథం కదలనేలేదట. అందరూ ఖిన్నులై ఉండగా అకస్మాత్తుగా, సేంథన్ ఒక గీతం వినిపించు అని పెద్ద ధ్వనితో మాటలు వినిపించాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ మాటలు సేంథనార్ కూడా విన్నాడు. కాని నిరక్షరాసుడైన తాను పాడడం ఏంటి అని, తాను కాదు ఇంకెవరో సేంథనార్ ఉన్నారు అని మిన్నకుండిపోయాడు. మళ్ళీ అదే మాటలు వినబడ్డాయి. నువ్వే... సేంథన్... పాడు... అని దాంతో ఆశ్చర్యంగా నిరక్షరాస్యుడైన సేంథనార్ నటరాజస్వామిని స్తుతిస్తూ పాడాడు. ఆ పాటలే తమిళంలో పల్లందు స్తుతిగీతాలుగా ప్రసిద్ధి చెందాయి.
సేంథనార్ భక్తి విశేషాలను గుర్తింఛి అప్పటినుండి అతడు నివేదించిన పదార్ధాన్నే కళి అన్న పేరుతొ స్వామికి నైవేద్యంగా సమర్పించడం ఆచారంగా మారింది. అతడు స్వామిని స్తుతించిన గీతాలను అప్పటి తమిళ భక్తి సాహితీకారులు కూడా గుర్తించడం జరిగిందని తమిళ గ్రంధాలు చెబుతున్నాయి.
2026 సంవత్సరంలో ఆరుద్రోత్సవం జనవరి 3 తేదీన వస్తుంది.
ఆరుద్ర నక్షత్రం త, రువత్తిరై / Ardra Nakshatra రోజునే ఆరుద్రోత్సవం జరుపుతారు.
తమిళనాడులోని చిదంబరం నటరాజ స్వామి ఆలయంలో ఆరుద్రోత్సవం అత్యంత వైభవంగా జరుపుకుంటారు. Hyderabad, Chennai సహా అన్ని శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి.
ఆరుద్ర దర్శనం చేయడం వల్ల పాప విమోచనం, మనశ్శాంతి, శివ అనుగ్రహం లభిస్తాయని శైవ సంప్రదాయ విశ్వాసం.