Vijaya Lakshmi
Published on Sep 21 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?మన భారతీయ సంస్కృతి పండుగలతో, ఆచారాలతో నిండివుంది. ప్రతి మాసానికి ప్రత్యేకత ఉంటే, ఆశ్వయుజ మాసం అయితే ఆధ్యాత్మిక శక్తితో, సాంప్రదాయ వైభవంతో, సాంస్కృతిక సందడితో అద్భుతంగా వెలుగొందుతుంది. ఈ మాసం దేవి ఆరాధన, నవరాత్రులు, బతుకమ్మ పండుగ, అలాగే ధన్వంతరి అవతారం మరియు ధనత్రయోదశి పూజలు వంటి విశిష్ట సందర్భాలతో ప్రసిద్ధి చెందింది.
భారతీయ పంచాంగంలో ప్రతి మాసం ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. వాటిలో ఆశ్వయుజ మాసం విశేషమైనది. ఈ నెలలో జరిగే పండుగలు శక్తి ఆరాధన, సాంప్రదాయ వైభవం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కలగలిపినవిగా ఉంటాయి. సాధారణంగా ఆశ్వయుజ మాసం సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో వస్తుంది. ఈ నెలలో భక్తి, భజనలు, వ్రతాలు, కుటుంబ సంతోషం పుష్కలంగా కనిపిస్తాయి.
దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన ఘట్టం నవరాత్రుల మూలకథ. మహిషాసురుడు రాక్షసరాజు. బ్రహ్మదేవుని వరప్రభావంతో అతడు ఎవ్వరూ జయించలేనివాడయ్యాడు. దేవతలు కలిసి తమ శక్తిని సమకూర్చి అద్వితీయ శక్తి రూపిణి దుర్గాదేవిని సృష్టించారు. తొమ్మిది రాత్రులపాటు మహిషాసురుడితో యుద్ధం చేసి చివరగా సంహరించిన రోజు విజయదశమిగా ప్రసిద్ధి చెందింది.
ఆశ్వయుజ మాసంలో జరిగే శారద నవరాత్రులు మహా శక్తి ఆరాధనకు ప్రతీకలు. తొమ్మిది రోజుల పాటు భక్తులు దుర్గాదేవిని, లక్ష్మీదేవిని, సరస్వతీదేవిని ఆరాధిస్తారు.
దసరా రోజున శ్రీచాముండేశ్వరి విజయోత్సవం జరుపుకుంటారు. ఇది అధర్మంపై ధర్మం విజయం అని తెలియజేస్తుంది.
పార్వతీదేవిను స్మరించుకునే పండుగ బతుకమ్మ. ఒకసారి భూదేవి శక్తులన్నింటినీ శివుడికి ఇచ్చి, శూన్యమైపోయింది. ఆ భూమిని తిరిగి సంతాన సంపదలతో నింపమని పార్వతీదేవి ప్రార్థించి, బతుకమ్మ రూపంలో ఆశీర్వదించింది.
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ కూడా ఆశ్వయుజ మాసంలోనే వస్తుంది.
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ కూడా ఆశ్వయుజ మాసంలోనే వస్తుంది.
· చివరగా బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు.
ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా నిలుస్తుంది.
ధన్వంతరి అవతారం - ధన్వంతరి జయంతి – ఆయుర్వేద మూలం
పురాణకథ
సముద్రమథనంలో అమృతకలశంతో పాటు ధన్వంతరి భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేతిలో అమృతం, ఆయుర్వేద జ్ఞానం ఉండేవి. అందుకే ఆయనను ఆరోగ్యదేవుడుగా పూజిస్తారు.
· ఆశ్వయుజ మాస శుక్ల పక్షం ధన్వంతరి జయంతిగా జరుపుకుంటారు. సముద్ర మథనంలో ఆవిర్భవించిన ఆయుర్వేద దేవుడు ధన్వంతరి ఈ రోజున జన్మించారు. ఆయనే ఆరోగ్యానికి అధిదేవత.
ధనత్రయోదశి (Dhanteras) – ఐశ్వర్యం, ఆరోగ్యం
ఒకసారి యముడు ఒక రాజకుమారుని మరణం వ్రాసాడు. కానీ అతని భార్య దీపాలు వెలిగించి, బంగారం, వెండి పాత్రలు పెట్టి యముణ్ణి దూరం ఉంచింది. దాంతో రాజకుమారుడు ప్రాణాలు దక్కించుకున్నాడు. అప్పటి నుండి ధనత్రయోదశి రోజున దీపాలు వెలిగించడం, కొత్త వస్తువులు కొనడం శుభప్రదమని నమ్మకం.
పూజా విధానం
· సాయంత్రం దీపాలు వెలిగించడం.
· లక్ష్మీదేవి, ధన్వంతరి పూజ.
· బంగారం, వెండి లేదా కనీసం ఒక కొత్త వస్తువు కొనడం.
· దీపాలు వెలిగించడం ద్వారా అమంగళ శక్తులు దూరమవుతాయి.
· ధనత్రయోదశి రోజున ధన్వంతరిని పూజిస్తారు.
· ఆరోగ్యము, ఆయురారోగ్యం కోసం దీపాలు వెలిగిస్తారు.
· సంపద కోసం ధన లక్ష్మీ పూజ చేస్తారు.
· ఈ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు శుభప్రదంగా భావిస్తారు.
అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే మాసం కాబట్టి ఇది ఆశ్వయుజ మాసం అయింది. త్రిముర్తులైన బ్రహ్మ , విష్ణు, మహేశ్వరులు, త్రిమాతలైన సరస్వతి,మహాలక్ష్మీ ,పార్వతిదేవిలకు అత్యంత ప్రీతికరమైన..... మాసం, వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ఆశ్వయుజం ! అమ్మవారు రాక్షసులమీద విజయం సాధించిన మాసం ఆశ్వయుజం. పాండవులు జమ్మిచెట్టు మీదున్న ఆస్త్రశస్తాల్ని కిందికి దించి కౌరవసేనల్ని ఓడించింది కూడా కూడా ఆశ్వయుజమాసంలోనే అని చెప్తారు. విక్రమార్క చక్రవర్తి పేరు మీద విక్రమశకం మొదలైందీ కూడా ఈ మాసంలోనే. అనేక ప్రత్యేకతల మాసం ఆశ్వయుజం.
జగన్మాత అయిన పార్వతిదేవి దుష్ట శిక్షణ , శిష్ట రక్షణార్ధం , తొమ్మిది అవతారలను ధరించిన మాసం...ఆయుర్వేద దేవుడు ధన్వంతరీ, త్రిమతాచార్యులలో ద్వైత సిద్ధాంత ప్రవక్త అయిన శ్రీ మధ్వాచార్యులు జన్మించిన మాసం. ఎంతోమంది భక్తులను, పురాణ పురుషులను బాధలకు గురిచేసిన నరకాసురుడు అంతమొందింపబడి ప్రజలందరికి ఆనందాల వెలుగులను పంచిన దివ్య మాసము ఆశ్వయుజం. ఈ మాసం లో చేసే పూజల వల్ల అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి. ఈ మాసంలో వచ్చే ద్వాదశి నాడే ధన్వంతరి జయంతి . ధన్వంతరి కూడా విష్ణమూర్తి అవతారమేనంటారు. అందుకే ధన్వంతరిలో విష్ణుమూర్తి పోలికలు కనిపిస్తాయి. క్షీరసాగర మధనంలో కల్పవృక్షం, కామధేనువు, లక్ష్మీదేవి ధన్వంతరి అవతరించారు. ఓ చేతిలో అమృతభాండం, ఓ చేతిలో వనమూలికలతో ఆవిర్భవించిన ధన్వంతరి ఆయుర్వేదానికి మూలపురుషుదుగా చెప్తారు. తరువాత వచ్చే కృష్ణపక్ష చతుర్ధశే నరక చతుర్ధశి, సత్యాభామ కృష్ణుడితో కలసి నరకుడిని సంహరించిన రోజు. దీపావళి అమావాస్యనాడు సాక్షాతూ లక్ష్మీదేవే ఇంటింటికీ వస్తుందని అంటారు. ఈ ఆశ్వయుజ మాసంలోనే తెలంగాణా ప్రాంతంలో బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.
ఈ విధముగ ఎన్నో విశిష్టతలను సొ౦తం చేసుకున్న మాసం -- ఆశ్వయుజ మాసం
ఇక ఆశ్వయుజ మాసంలో ప్రధానంగా చెప్పుకోవలసిన పండుగలు నవరాత్రులు. అమ్మవారికి చేసే పూజలు కాబట్టి దేవీ నవరాత్రులని, శరత్కాలంలో వచ్చిన రాత్రులు కాబట్టి శరన్నవరాత్రులని, కూడా పిలుస్తారు. ఈ శరత్కాలం సంధికాలం. ప్రజలకు అనారోగ్యాన్ని కలిగించి, వారి ప్రాణాలను కూడా హరించే శక్తి ఈ కాలానికి ఉంటుందని, ఆ బాధలకు లోనుకాకుండా జగన్మాతను వేడుకుంటూ చేసే ఉత్సవమే నవరాత్రి ఉత్సవంగా కూడా చెప్తారు. ఆశ్వీజ పాడ్యమి నుంచి మహర్నవమి వరకు నవరాత్రులు నిర్వహించి దశమినాడు పూర్తి చేస్తారు. ఈ నవరాత్రులు పది జన్మల పాపాలను పోగొట్టే ఉత్సవాలుగా పురాణాలు చెప్తున్నాయి. దీనిలో మొదటి మూడు రాత్రులు పార్వతి, మధ్య మూడు రోజులు లక్ష్మీదేవి, చివరి మూడు రోజులు సరస్వతిని ఆరాధిస్తారు. ఈ తొమ్మిదిరోజులూ తొమ్మిది రూపాల్లో దుర్గాదేవిని కొలుస్తారు. తొమ్మిది రోజుల పాటు నియమాల ప్రకారం అర్చనలు చేయలేని వారు చివరి మూడు రోజులు అంటే అష్టమి, నవమి, దశమి రోజుల్లో అయినా దుర్గాదేవిని అర్చిస్తే, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం. ఈ నవరాత్రులలో మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. ఈ రోజున పుస్తకదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
ఈ నవరాత్రుల సమయంలోనే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి.
ఆశ్వయుజ మాసం కృష్ణ పక్ష త్రయోదశిని ‘ధన త్రయోదశి’ అంటారు. ఈ రోజు సంపదను, ఆరోగ్యాన్ని ప్రసాదించే దినంగా పురాణాలు చెబుతున్నాయి. క్షీర సాగర మథనంలో లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు ఇదేనని చెబుతారు. అందుకే ఈ రోజున లక్ష్మీ దేవినీ, ధనానికి అధిపతి అయిన కుబేరుడినీ పూజిస్తే ఐశ్వర్యం వస్తుందని చెప్తారు. అందుకే ఈ రోజును ‘కుబేర త్రయోదశి’, ‘ఐశ్వర్య త్రయోదశి’ అని కూడా పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో ఈరోజును ‘ధన్ తేరస్’ అన్న పేరుతొ జరుపుకుంటారు.
అంతేకాదు, పితృదేవతలు ఈ రోజున తమ వారసుల ఇళ్ళకు వస్తారనే నమ్మిక ఉంది. ఈ రోజుకు ‘యమ త్రయోదశి’ అని మరో పేరు ఉంది. ఈ రోజున సూర్యాస్తమయ సమయంలో ఇంటి ద్వారానికి ఇరువైపులా దీపాలు వెలిగిస్తారు. వాటిని ‘యమదీపాలు’ అంటారు. ఆ ఇలా దీపాలు వెలిగిస్తే యముడు ప్రసన్నుడవుతాడనీ, అకాల మృత్యువును నివారిస్తాడనీ పెద్దలు చెబుతారు. ఇలా ఎన్నో విశిష్టతల సమాహారం ఆశ్వయుజ మాసం.
ఆశ్వయుజ మాసం అనేది కేవలం పూజల సమాహారం మాత్రమే కాదు, భక్తి, శక్తి, సాంప్రదాయం, ఆనందం కలిసిన ఒక మహోత్సవ కాలం. ఈ మాసంలో జరుపుకునే నవరాత్రులు, బతుకమ్మ, ధన్వంతరి జయంతి, ధనత్రయోదశి మన జీవన విధానాన్ని సక్రమం