సింహాచలం చందనోత్సవానికి టిక్కెట్లు ఇలా బుక్ చేసుకోండి | Chandanotsavam date, darshan timings full details

Vijaya Lakshmi

Published on Apr 12 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

తెలుగువారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా, ఆత్రంగా ఎదురుచూసే పండుగ చందనోత్సవం రోజుల్లోకోచ్చేసింది. ఈ ఏడాది సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి చందనోత్సవం నిజరూప దర్శనం ఏప్రిల్ 20, (సోమవారం) న జరగనుంది. ఈ పవిత్ర దినాన నిరంతరం చందనం పూతల మధ్య దర్శనమిచ్చే శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారిని చందనం లేకుండా, నిజరూపంలో దర్శించుకోవచ్చు.

దీనికి సంబంధించి ఆన్లైన్ టిక్కెట్లు ఎలా బుక్ చేసుకోవాలి, దర్శన సమయాలేంటి? రవాణా సౌకర్యాలు, మొదలైన వివరాలు ఈ బ్లాగ్ లో ...  

చందనోత్సవ ప్రణాళిక

సింహాచలం వరాహలక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేశామని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి వెల్లడించారు.

చందనోత్సవం ఎప్పుడు

ఈ ఏడాది చందనోత్సవం రోజున అంటే ఏప్రిల్ 20వ తేదీన తెల్లవారుజామున ఒంటి గంటకు స్వామివారి మేలుకొలుపు, సుప్రభాతంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. భక్తులకు తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనానికి అవకాశం కల్పిస్తారు. ఉదయం 3 గంటల నుంచి స్వామివారి నిజరూప దర్శనం కల్పించనున్నారు. ఉదయం 3 గంటలకు మొట్టమొదట  ఆలయ ధర్మకర్తల తొలి దర్శనంతో దర్శనాలు ప్రారంభమవుతాయి. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం, అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తరఫున పట్టు వస్త్రాలను సమర్పితారు. ఆ తరువాత ఉదయం 4.15 గంటలకు వీఐపీ దర్శనాలు మొదలవుతాయి. ఇక భక్తుల దర్శనాల విషయానికి వస్తే 1000 టికెట్ల భక్తుల దర్శనాలు 4.00 గంటల నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఏడాది సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, క్యూ లైన్లను ఐదు విభాగాలుగా ఏర్పాటు చేసి, ఒక్కో క్యూ లైన్‌లో సుమారు 21 వేల మంది వరకు భక్తులు దర్శనం చేసుకునేలా ప్రణాళిక రూపొందించామని, హోల్డింగ్ ఏరియాల ద్వారా రద్దీ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు

సామాన్య దర్శనాలు నిలిపివేత

1500 టికెట్ల  పొందిన భక్తులు అంటే విఐపిలు భోగ మండపం నుంచి స్వామి వారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించనుంది. ఇక ఈ రోజు ఎవ్వరికీ అంతరాలయ దర్శనం ఉండదు. భక్తులు గమనించవలసిన మరో ముఖ్యమైన విషయం చందనోత్సవం ముందురోజైన ఏప్రిల్ 19 సాయంత్రం 6 గంటల నుండే ఆలయంలో సాధారణ దర్శనాలను నిలిపివేసి స్వామివారి చందనోత్సవ ఏర్పాట్లను చేయనున్నారు.

టిక్కెట్లు ఎక్కడ తీసుకోవాలి

ఇక టిక్కెట్ల బుకింగ్ విషయానికి వస్తే,  ప్రొటోకాల్, వీఐపీ టికెట్లు అంటే 1500 రూపాయిల టిక్కెట్లుగా  చెప్పే పాస్ లు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జారీ చేయనున్న‌ట్లు ప్రకటించారు. ఆన్లైన్ టికెటింగ్‌కు ప్రాధాన్యం పెంచుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 80 శాతం టికెట్లు ఆన్లైన్‌లోనే జారీ చేయనున్నట్లు మంత్రి వివరించారు.

అప్పన్న నిజరూప దర్శన టికెట్లను ఈనెల 12 నుంచి ఆన్‌లైన్‌లో విక్రయిస్తామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లెపల్లి వెంకటరావు ప్రకటించారు. ఈ మేరకు ఈనెల 12 అంటే ఈరోజు నుంచి 17 తేదీమధ్య దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌లో రూ.300, రూ.1000 టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. 70 శాతం టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించగా, మిగిలిన వాటిని ఆఫ్‌లైన్‌లో యూనియన్‌ బ్యాం కు సింహాచలం, అక్కయ్యపాలెం, బ్రాంచ్ లలోను, అలాగే  స్టేట్‌ బ్యాంకు సింహాచలం, బిర్లా జంక్షన్‌ శాఖల్లో ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విక్రయిస్తారు.

ఇక చందనోత్సవం తర్వాత స్వామివారికి మూడు విడుదలగా చందనం సమర్పిస్తారు. చందనోత్సవమైన వెంటనే ఈ చందనం పనులు ప్రారంభిస్తారు. స్వామివారికి సమర్పించవలసిన చందనం సిద్ధం చెయ్యడం కోసం  ఈ నెల 13న అంటే రేపు  చందనం అరగదీత ప్రారంభిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

చందన సానకు ఏర్పాట్లు

ఇప్పటికే ఈ నెల20 అక్షయ తృతీయ పర్వదినం రోజు జరగనున్న చందనోత్సవం కోసం శ్రీ స్వామివారికి సమర్పించే పవిత్ర చందనంకు కావాల్సిన చందనం దుంగలు శాస్త్రోక్తంగా సేకరణ ప్రక్రియ ప్రారంభించారు. ఇక ఈ నెల 13న సోమవారం నాడు  చైత్ర బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉదయం 6 గంటల 30 నిమిషాలకు 'చందనం సాన' అంటే చందనం అరగాతీత కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

RTC ఏర్పాట్లు

చందనోత్సవానికి వచ్చే భక్తుల కోసం కొండ దిగువన 50 ఆర్టీసీ బస్సుల్ని అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ ప్రకటించారు. చందనోత్సవం కోసం అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటామని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని, గత సంవత్సరం మాదిరిగానే చందనోత్సవానికి వచ్చే చిన్నారులకు ట్యాగ్‌లు అమలు చేస్తామని విశాఖపట్నం పోలీస్ కమీషనర్ శంఖబ్రతబాగ్చీ వివరించారు.

తీవ్రమైన ఎండల మధ్య జరుగుతున్నా ఈ పవిత్ర ఉత్సవంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు తాగునీరు, మజ్జిగ, పాలు, బిస్కెట్లు వంటి సౌకర్యాలను ఆలయ యంత్రాంగంతో పాటు వాలంటరీ సంస్థల సహకారంతో అందించనున్నట్లు, “స్వామి వారి సేవకులు” అన్న  పేరుతో శిక్షణ పొందిన వాలంటీర్లను ఈ కార్యక్రమానికి వినియోగించనున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది.

ఇక పర్యావరణ పరిరక్షణ రీత్యా ప్రసాదాల పంపిణీలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ వస్తువులను వాడరాదని కేవలం పర్యావరణహితమైన వస్తువులను మాత్రమే వినియోగించాలని ప్రకటించారు.






Recent Posts
ఊర్మిళాదేవి నిద్ర : రామాయణంలో ఎవరికీ తెలియని మహా త్యాగం: ఊర్మిళా దేవి గాథ  | The Untold Sacrifice of Urmila in Ramayana
ఊర్మిళాదేవి నిద్ర : రామాయణంలో ఎవరికీ తెలియని...
900 ఏళ్ల చరిత్ర! కరకచెట్టు పోలమాంబ దేవి అద్భుత గాథ | Vizag Powerful Goddess Polamamba Story
900 ఏళ్ల చరిత్ర! కరకచెట్టు పోలమాంబ దేవి...
త్రిశంకు స్వర్గం నిజంగా ఉందా? విశ్వామిత్రుడు సృష్టించిన మరో స్వర్గం కథ  | Shocking Truth! Trishanku Swargam
త్రిశంకు స్వర్గం నిజంగా ఉందా? విశ్వామిత్రుడు సృష్టించిన...
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి - చందనోత్సవంపై ఆసక్తికర కోణాలు - రహస్యాలు  | Simhachalam Temple History in Telugu
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి - చందనోత్సవంపై ఆసక్తికర కోణాలు...
అక్షయ తృతీయ ఎందుకు జరుపుకోవాలి? | Importance & significance of Akshaya tritiya
అక్షయ తృతీయ ఎందుకు జరుపుకోవాలి? | Importance...