యమునా పుష్కరాలు 2026 తేదీలు | స్నాన ఘాట్ లు | పూర్తి వివరాలు | Yamuna Pushkaralu 2026 full details

Vijaya Lakshmi

Published on Mar 18 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

యమునా పుష్కరాలు 2026 తేదీలు | స్నాన ఘాట్ లు | పూర్తి వివరాలు

మరి కొన్ని నెలల్లో యమునా నది పుష్కరాలు జరగబోతున్నాయి. పుష్కరాలు అనగానే అసలు పుష్కరాలు అంటే ఏంటి? ఎందుకు జరుగుతాయి? 2026లో అంటే ఈ సంవత్సరం జరగబోయే యమునా పుష్కరాలు ఎందుకు అంత ప్రత్యేకం? ఎప్పుడు ప్రారంభమవుతాయి? యమునా నది పుష్కరాలలో ఎక్కడ స్నానం చేయాలి? ఏ పుణ్యక్షేత్రాలు సందర్శించాలి? యమునా నది పుష్కర ఘాట్ లు ఎక్కడెక్కడ ఉంటాయి? ఇలా యమునా నది పుష్కరాల పూర్తీ వివరాలు ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం.

“గంగకు సమానంగా పూజించబడే పవిత్ర నది… శ్రీకృష్ణుని బాల్యస్మృతులు దాచుకున్న ఆధ్యాత్మిక ప్రవాహం… లక్షలాది మంది  భక్తుల పాపాలను పవిత్రం చేసే మహామహిమ కలిగిన నది… అదే యమునా నది! ఈ బ్లాగ్ లో యమునా పుష్కరాల పూర్తి చరిత్ర,  ముఖ్యమైన స్నాన ఘాట్లు, యమునా పుష్కరాల ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఇవన్నీ తెలుసుకుందాం.

యమునా నది పుష్కరాలు

భారతీయ సంస్కృతిలో నదీ పుష్కరాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా పర్వదినాల కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపధ్యంలో 2026వ సంవత్సరంలో అంటే ఈ ఏడాది జరగబోతున్న యమునా నది పుష్కరాల' గురించి ఈరోజు మనం పూర్తి వివరాలు, తెలుసుకుందాం.  ఈ ఏడాది జూన్ నెలలో రాబోతున్న ఈ యమునానది పుష్కరాల తేదీలు, ముఖ్యమైన ఘాట్లు అలాగే యమునా నది ప్రాముఖ్యత గురించి ఈ బ్లాగ్ లో

భారతీయ సనాతన సంప్రదాయంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా పుణ్యస్నాన మహోత్సవమే పుష్కరాలు. పుష్కరాలు. హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. ధార్మికులు, భక్తులు, సంప్రదాయవాదులు అందరూ ఆత్రంగా ఎదురుచూసే పర్వదినాలు పుష్కరాలు

బృహస్పతి ఒక రాశి నుండి మరో రాశికి మారినప్పుడు ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు వస్తాయి. దీని ప్రకారం 2026లో అంటే ఈ ఏడాది  గురుగ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించడంతో యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి.

యమునా నది పుష్కరాలు డేట్స్

2026లో జూన్ నెలలో జూన్ 2 న ప్రారంభం కాబోతున్నాయి యమునా పుష్కరాలు. జూన్ 2 నుంచి జూన్  13 వరకు, కొనసాగుతాయి. ఈ  మొదటి 12 రోజులను ఆది పుష్కరాలని, ఇక్కడి నుంచి సంవత్సరం చివరి 12 రోజులను అంత్య పుష్కరాలని అంటారు. ఈ సమయంలో పుష్కరుడు నదిలో కొలువై ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి."

యమునా పుష్కరాలు ఎందుకంత ప్రత్యేకం?

జ్యోతిష్య శాస్త్ర ప్రకారము, దేవగురు బృహస్పతి అంటే  (గురు గ్రహ), కర్కాటక రాశిలో ప్రవేశించిన శుభ ఘంటికలో యమునా పుష్కరాలు ప్రారంభమవుతాయి.

యమబాధలు తొలగించే పుష్కరాలు

గురు గ్రహం తన ఉచ్చ స్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ పుష్కరాలు జరగడం వల్ల, ఈ సమయంలో చేసేది దాన-ధర్మాలు 10 రెట్లు ఎక్కువ ఫలాలు అందిస్తాయని,

ఇక ప్రత్యేకంగా యమునా పుష్కరాలకు ఎందుకంత ప్రాధాన్యత అంటే, యమునా నదిలో పుష్కర స్నానం చేయడం వల్ల యమ భయం, అకాల మరణ దోషాలు తొలగిపోతాయని బలమైన నమ్మకం ఉంది.

శ్రీకృష్ణ లీలలకు సాక్షిగా నిలచిన బృందావన, మథురా మొదలయిన ప్రదేశాలలో యమునా నదిలో ఈ పుష్కర స్నానం ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది.

యమునా నది హిమాలయాలలోని యమునోత్రి వద్ద జన్మిస్తుంది.

ఇది ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి చివరకు ప్రయాగరాజ్ వద్ద గంగానదిలో కలుస్తుంది. అందువలన ఈ మధ్య ప్రదేశాలలో ఎక్కడైనా యమునా నదిలో పుష్కరస్నానం చెయ్యవచ్చు. పుష్కర స్నానం ఏయే ప్రదేశాలలో చెయ్యాలి, యమునా పుష్కరాల సమయంలో ఏయే పుణ్యకార్యాలు, ధార్మిక కార్యక్రమాలు చెయ్యాలి అన్న విషయాలు వివరంగా చెప్పుకునేముందు అసలు యమునా నది విశిష్టత గురించి కొంచెం తెలుసుకుందాం.

యమునా నది విశిష్టత

యమునా నది కేవలం ఒక నది మాత్రమే కాదు, పురాణాల ప్రకారం ఆమె సూర్య భగవానుడి పుత్రిక, యమధర్మరాజు సోదరి. అందుకే యమునా నదిలో స్నానం చేస్తే యమ బాధలు తప్పుతాయని భక్తుల నమ్మకం. శ్రీకృష్ణ పరమాత్ముడు తన బాల్యమంతా ఈ నది తీరానే గడిపారు. శ్రీకృష్ణ లీలలలో ప్రతి ఘట్టానికి యమునా నది ప్రత్యక్ష సాక్షి.  కాళీయ మర్దనం నుంచి శ్రీకృష్ణ రాసలీలల వరకు ప్రతి ఘట్టం ఈ నదితో ముడిపడి ఉంది. శ్రీకృష్ణుడు బాల్యంలో ఎక్కువ సమయం గడిపింది యమునా తీరంలోనే. శ్రీకృష్ణుడు లీలలకు సాక్షిగా నిలిచిన పవిత్ర జలమే యమునా నది.

పుష్కరాలు ఎందుకంత ప్రత్యేకత

సమస్త ప్రాణకోటి మనుగడకు ఆధారం జలం... నీరు. జలం పుట్టిన తర్వాతే జీవకోటి ఉద్భవించింది. జలధారల వెంటే నాగరికత విస్తరించింది. అలాంటి జలాన్ని దేవతలుగా పూజించడం, ఆరాధించడం హిందూ సంప్రదాయం. నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మంగళ స్నానాలు ఇలా ప్రతి హిందూ సంప్రదాయం నీటితోనే ముడిపడి ఉంటాయి. దేవతారాధనలు, శుభకార్యాలే కాదు శ్రాద్ధకర్మలు, పిండప్రదానాలు, తర్పణాలు లాంటి పెద్దల కార్యక్రమాలు కూడా నీటితోనే ముడిపడి ఉంటాయి.

ముఖ్యంగా ఈ సంప్రదాయాల్లో నదీస్నానానికి అత్యంత ప్రముఖమైన స్థానం ఉంది. ఆ నదీ స్నానాల్లో కూడా పుష్కర స్నానం పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం. తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారం బ్రహ్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి జలం, జలం నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నం, అన్నం నుంచి జీవుడు పుట్టాయని వివరిస్తుంది .ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు. ఈ సంవత్సరం జూన్ నెలలో యమునా నది పుష్కరాలు.

జూన్ 2 నుంచి 13 వరకు జరిగే  ఆది పుష్కరాలు అలాగే సంవత్సరం చివరిలో జరిగే 12 రోజుల అంత్య పుష్కరాలలో ఎక్కడెక్కడ పుష్కర స్నానం చెయ్యాలో చూద్దాం.

యమునా నది పుష్కర ఘాట్ లు  

యమునా నది హిమాలయాలలోని యమునోత్రి వద్ద జన్మిస్తుంది. ఇది ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి చివరకు ప్రయాగరాజ్ వద్ద గంగానదిలో కలుస్తుంది. కాబట్టి యమునా నది పుట్టిన చోటు యమునోత్రి . ఇక్కడ స్నానం అత్యంత పవిత్రం అని పండితులు చెబుతున్నారు.

ఇక శ్రీ కృష్ణుని బాల్య క్రీడలకు, లీలలకు సాక్షంగా నిలిచినా మధుర & బృందావన్ లలో కూడా పుష్కర స్నానం అత్యంత శ్రేష్టం. శ్రీకృష్ణుని లీలలు జరిగిన చోటుగా చెప్పబడే  విశ్రాం ఘాట్ చాలా ప్రసిద్ధి చెందినది. అలాగే ప్రయాగ్రాజ్ అలహాబాద్ లోని  (త్రివేణి సంగమం). ఇది  గంగ, యమున, సరస్వతి నదులు కలిసే చోటు. ఇక్కడ పుష్కర స్నానం కోటి రెట్ల పుణ్యాన్ని ఇస్తుందని చెబుతారు. అలాగే ఢిల్లీ & హర్యానా  ప్రాంతాల్లో కూడా యమునా నది ప్రవాహం ఉన్న చోట  ప్రభుత్వం ప్రత్యేక ఘాట్లను ఏర్పాటు చేస్తుంది.

పుష్కరాలలో చేయవలసిన ధార్మిక కార్యక్రమాలు

ఇక పుష్కరాలలో చేయవలసిన ధార్మిక కార్యక్రమాలకు చాలా ప్రాధాన్యత ఉంది. పుష్కర స్నానం చేసేటప్పుడు నదీమతల్లికి నమస్కరించి సంకల్పం చెప్పుకోని నదిలో మూడు మునకలు వెయ్యాలి. ముఖ్యంగా పితృ దేవతలకు పిండ ప్రదానం చేయడం, తర్పణాలు వదలడం ఈ సమయంలో చాలా ముఖ్యం. అలాగే అన్నదానం, వస్త్రదానం వంటివి శక్తి కొలది చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. యమునా పుష్కరాల రోజుల్లో అన్నదానం లేదా అన్నప్రసాదం అందించడం వల్ల దేవుని అపారమైన ఆశీస్సులు లభిస్తాయి మరియు వారి సమస్యలు పవిత్ర యమునా నది ద్వారా తొలగిపోతాయి.

"పుష్కరాలు అనేవి మన పాపాలను కడిగే పవిత్ర సమయాలు మాత్రమే కాదు, మన సంస్కృతిని కాపాడుకునే పండుగలు.

Recent Posts
హంపి వెళితే ఈ ప్రదేశాలు చూడడం మిస్సవకండి  |  హంపిలో చూడవలసిన 10 ప్రదేశాలు  | Hampi visiting places & temples
హంపి వెళితే ఈ ప్రదేశాలు చూడడం మిస్సవకండి...
పైడితల్లి అమ్మవారు ఎవరు? సిరిమాను వెనుక ఉన్న అసలు కథ! | Vijayanagaram pydimamba temple history  |   sirimanu festival
పైడితల్లి అమ్మవారు ఎవరు? సిరిమాను వెనుక ఉన్న...
2026 విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు | 2026 Vijayanagaram pydimamba sirimanu dates
2026 విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు...
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర  | Complete History & Divine Miracles, how to reach, AP shaktipeethas
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర |...
పంచ మాధవ క్షేత్రాల రహస్యం  |  విష్ణువు కొలువైన 5 మహాక్షేత్రాలు  | Hidden Secrets of Pancha Madhava Temples  |  how to reach panchamadhava 5 Vishnu temples
పంచ మాధవ క్షేత్రాల రహస్యం |...