Vijaya Lakshmi
Published on Aug 23 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?అక్కడ వినాయకుడు చాలా స్పెషల్. వినాయకుని వాహనం నెమలి... వినాయకుని ముందు కొలువుతీరినవాడు నంది. ఒళ్ళంతా ఆంజనేయుడి మాదిరిగా సిందూరం పూతతో ఉంటాడు... అంటేనే ఇంకా చాలా విశిష్టతలే ఉన్నాయి. వినాయకుని వాహనం ఏంటి అంటే ఎలుక అని చిన్నపిల్లవాడైనా టక్కున చెప్తాడు. గణేశుడిని తలచుకోగానే ఎలుకనెక్కి తిరిగే స్వామి కనబడతాడు. కాని ఒక ఆలయంలో మాత్రం మయూరం అంటే నెమలి వాహనంగా కనబడతాడు. అదేంటి మయూరం కుమారస్వామి వాహనం కదా అనుకుంటున్నారా... ఇక్కడ మాత్రం గణపతి వాహనం నెమలే. తమ్ముడి వాహనాన్ని గణపతి ఎందుకెక్కాడు? ఆ కథేంటి? చూద్దాం...
సాధారణంగా ఏ ఆలయంలోనైనా ఆలయంలో స్వామివారి ఎదురుగా వారి వాహనంగాని, బంటు గాని కొలువుతీరి ఉంటారు. అంటే శివాలయంలో అయితే నంది, విష్ణ్వాలయంలో అయితే గరుత్మంతుడు, అమ్మవారి ఆలయంలో అయితే సింహం ఇలా.... కాని ఆ వినాయక ఆలయంలో మాత్రం వినాయకుని వాహనమైన మూషికం కాకుండా నంది కొలువుతీరి ఉంటుంది. ఎందుకని...? అసలీ ఆలయంలో వినాయకుడు ఏ ఆలయంలోను లేనివిధంగా దర్శనమిస్తాడు. తలమీద నాగ పడగతో, మూడు తొండాలతో, ఒళ్లంతా సిందూరం పూతతో, నెమలి వాహనంతో విలక్షణంగా వినూత్నంగా దర్శనమిస్తాడు.
వినాయకుడు ఇంత విభిన్నంగా, విలక్షణంగా దర్శనమిచ్చే ఆ ఆలయం ఎక్కడుంది దాని విశేషాలేంటి తెలుసుకుందాం....
మూషిక వాహనుడైన వినాయకుడు నెమలి వాహనంపై కనిపించే అరుదైన ఆలయం ఈ మయూరేశ్వర్ ఆలయం. అందుకే ఇక్కడ వెలసిన వినాయకుడు కూడా మయూరేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. స్థానికులు ఈ స్వామిని ‘మోరేశ్వర్’ అని పిలుచుకుంటారు.
మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఉన్న ఈ గ్రామంలో వినాయకుడు మయూరేశ్వరుడు వెలసినందున ఈ క్షేత్రానికి ‘మోర్గాంవ్’ అనే పేరు వచ్చింది. ఈ గ్రామ పేరుకు సంబంధించి కూడా విభిన్న కథనాలున్నాయి. యీ వూరు చుట్టుపక్కల చాలా నెమళ్లు వుండేవట అందుకని యీ వూరికి మొర్గావ్ అనిపెరొచ్చిందని కొందరు అంటారు , యీ వూరు మొత్తం నెమలి ఆకారం లో వుంటుంది కాబట్టి యీ వూరు మొర్గావ్ గా పిలువబడుతోందనేది కొందరి వాదన , యిక్కడ గణపతి వాహనం మయురం కాబట్టి , యీ గణపతికి మయూరగణపతి లేక మయురేశ్వర గణపతి అని పిలువబడుతున్నాడు , ముయూర గణపతి వెలసిన వూరు కాబట్టి యీ వూరు మొర్గావ్ అయింది అనేది కొందరి అభిప్రాయం .
ఒకప్పుడ గాణపత్య మతం చాల ప్రచారంలో ఉండేది. ఆ కాలంలో మోర్గాంవ్ గాణపత్య మతానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. పుణె జిల్లా బారామతి తాలూకాలోని మోర్‌గావ్ గ్రామంలో వెలసిన ఈ వినాయకుడు మూషికవాహనంపై కాకుండా మయూరాన్ని ఆసనంగా చేసుకోనివుండటం ఈ క్షేత్ర ప్రత్యేకత. తన సోదరుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడి వాహనమైన మయూరాన్ని అధిష్ఠించి ఉంటాడు ఇక్కడ వినాయకుడు. ఆ కథేంటంటే.. ఒకప్పుడు సింధురాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంత ప్రజలను తీవ్రంగా హింసించేవాడ. దీంతో మునులు ప్రజలు దేవతలను వేడుకోగా వినాయకుడు తన తమ్ముడి వాహనాన్ని అధిరోహించి భూమ్మీదకి వచ్చి ఆ రాక్షసుణ్ని మట్టుబెట్టాడట. అందుకే ఈ గణేశుణ్ని మయూరేశ్వరుడు, మోరేష్, మోరేశ్వర్ అని పిలుస్తారు. అనురసంహారం గావించిన స్వామి కాబట్టి.. ఈ క్షేత్రంలో వినాయక చవితితోపాటు విజయదశమి వేడుకలను కూడా అత్యంత వైభవంగా జరిపిస్తారు.
మహారాష్ట్రలోని పుణే పట్టణానికి అతి సమీపంలో ఉన్న ఈ ఆలయం చిన్నదే అయినా ఎంతో చారిత్రక నేపథ్యంతో పాటు అతి ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఆలయం. త్రిశుండ్ మయూరేశ్వర గణపతి మందిరంగా ప్రసిద్ధి చెందినా ఈ ఆలయంలో వినాయకుడు ఎక్కడా లేని విధంగా మూడు తొండాలతో దర్శనమిస్తాడు. అందుకే ఈ స్వామిని త్రిశుండ్ గణపతిగా పిలుస్తారు.
ఈ మందిరం. రాజస్థానీ, మాల్వా, దక్షిణ భారతీయ శైలులకు చెందిన శిల్పకళతో ఉంటుంది ఈ ఆలయంలో మరో విశేషం గర్భగుడికి ఎదురుగా ఉండే నంది విగ్రహం. గర్భ గుడికి ఎదురుగా పరమశివుని వాహన మైన పెద్ద నంది విగ్రహం వుంటుంది . నిజానికి వినాయకుని ఆలయం కాబట్టి ఆలయంలో గర్భగుడికి ఎదురుగా ఆ స్వామి వాహనమైన మూషికం ఉండాలి. కాని అలా కాకుండా నంది వుండడం ఏంటి. దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది.
మయూరేశ్వరుని మందిరం పునరుద్ధరించక ముందు ఒక నంది విగ్రహాన్ని పక్క గ్రామం నుంచి మరో గ్రామానికి తరలిస్తూ వుండగా సరిగ్గా యీ ప్రదేశం చేరగానే నందిని తరలిస్తున్న బండి విరిగి పోవడం తో మరో బండీ లోకి మార్చే క్రమం లో నంది విగ్రహాన్ని క్రింద పెట్టేరుట , తరవాత మరి ఆ విగ్రహాన్ని కదిలించ లేకపోయేరుట . ఎన్నిమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఆ నంది విగ్రహాన్ని అక్కడే విడిచి పెట్టేరట.
ఈ ఆలయాన్ని మొదట ఎవరు ఎప్పుడు నిర్మించారో అన్నదానికి కచ్చితమైన ఆధారాలేవీ లేవు. కాని అత్యంత ఆకర్షణీయంగా కనిపించే ప్రస్తుత దేవాలయాన్ని మాత్రం 1754లో భీమ్‌జిగిరి గోసవి అనే స్థానికుడు కట్టించాడని ప్రతీతి. నల్లటి పెద్ద పెద్ద రాళ్లను ఈ నిర్మాణానికి ఉపయోగించారు. ఎక్కడా మట్టిగానీ, కాంక్రీట్ కానీ కనిపించని ఈ ఆలయాన్ని పూర్తి రాతిమయంగానే రూపొందించారు. మోరయ గోసావి అనే గాణపత్య సాధువు కారణంగా ఈ ఆలయం ప్రసిద్ధిలోకి వచ్చింది. ఆయన శిష్యులైన పీష్వా ప్రభువుల హయాంలో ఈ ఆలయం వైభవాన్ని సంతరించుకుంది.
మహారాష్ట్రలో ప్రాచీన వినాయక క్షేత్రాలుగా ప్రసిద్ధి చెంటిన అష్ట వినాయక క్షేత్రాలకు తీర్థయాత్రగా వెళ్లేవారు మోర్గాంవ్‌లోని ఈ మయూరేశ్వరుడి దర్శనంతో యాత్రను ప్రారంభించడం ఆనవాయితీ. మయూరేశ్వరుడిని దర్శించుకోకపొతే , అష్టవినాయక యాత్ర పూర్తి కానట్లేనని అంటారు.
‘సింధు’ అనే రాక్షసుడిని చంపడానికి త్రేతాయుగంలో వినాయకుడు ఇక్కడ మయూరవాహనుడిగా షడ్భుజాలతో అవతరించాడని ‘గణేశ పురాణం’ చెబుతోంది. పీష్వాల కాలంలో ఈ ఆలయాన్ని దర్శించుకున్న సమర్థ రామదాసు ఆశువుగా ‘సుఖకర్తా దుఃఖహర్తా’ అనే కీర్తనను ఆలపించాడు. మయూరేశ్వరుడికి హారతి ఇచ్చేటప్పుడు ఈ గీతాన్ని ఆలపించడం అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తోంది.
ఇప్పుడు భక్తుల సందర్శనార్ధం వున్న విగ్రహం వెనుక అసలు విగ్రహం వుందని పాండవులు , యిసుక , యినుము , వజ్రాలతో చేసిన అసలు విగ్రహానికి రాగిరేకుతో కప్పి యిప్పటి విగ్రహం వెనుకున్న గోడలో దాచిపెట్టేరని ఒక కథ ప్రచారంలో ఉంది.
ఉదయం 5 గం.. నుంచి రాత్రి 10 గం .. ల వరకు ఆలయం తెరిచే వుంటుంది ఇక ఇక్కడ జరిగే ఉత్సవాల విషయానికి వస్తే ప్రతి చవితికి అంటే పదిహేను రోజులకి వొకసారి యిక్కడ విశేష పూజలు జరుగుతాయి . మాఘ శుక్ల చవితని గణేష జయంతిగా , భాద్రపద శుక్ల చవితి వినాయక చవితిగా విశేష పూజలు జరుపుతారు .
వినాయక చవితినుంచి ఆశ్వీజ శుక్ల దశమి వరకు ' పాలకి ' ( పల్లకి ) యాత్ర జరుపుతారు . పల్లకీ యాత్ర పూణే కి జంట నగరం గా చెప్పబడే ' చించ్ వాడ్ ' లోని మంగళ మూర్తి గణపతి కోవెల నుంచి ( మౌర్య గోసాయి జన్మ స్థానం ) మయూరేశ్వర గణపతి మందిరం వరకు సాగుతుంది . పల్లకీ వెనకాల వందల సంఖ్యలో భక్తులు కాలి నడకన చించ్ వాడ్ నుంచి మోర్ గావ్ వరకు వస్తారు.