Vijaya Lakshmi
Published on Aug 24 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?అదొక అందమైన... అందానికే పర్యాయపదంగా చెప్పుకునేంత అందమైన ప్రదేశం. ప్రపంచ ప్రజలలో చాలా మంది అక్కడికి వెళ్లాలని, ఆ ప్రదేశాలు చూడాలని కోరుకుంటారు. అందానికి పర్యాయపదంగా చెప్పుకునే అంత అందమైన ప్రదేశంలో భయంకరమైన అగ్నిపర్వతాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటాయి. విచిత్రమేంటంటే ఆ అగ్నిపర్వతాలనుంచి ప్రజలను రక్షిస్తున్నది ఆదిపూజితుడు, విఘ్ననాశకుడు వినాయకుడు. తొలి పూజలందుకునే ఇలవేలుపు గణనాధుడు వినాయకుడు. ఇంకా వింత విషయమేంటంటే అదొక ముస్లిం దేశం. ఆ ముస్లిం దేశంలో గణనాథుడు తరతరాలుగా కొలవబడుతున్నాడు. అదే ఇండోనేషియా దేశం. ఇండోనేషియాలోని తూర్పు జావాలో 7,641 అడుగుల ఎత్తులో ఉంది గణనాధుడి విగ్రహం. అది కూడా అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతంపై కొలువుతీరి ఉన్నాడు సంకటనాశ గణనాథుడు. అక్కడి ప్రజలు ‘బ్రోమో అని పిలుచుకునే ఈ విఘ్వేశ్వరుడు ఇక్కడ కొలువుతీరడం... వెనకున్న కథనమేంటి?
అదొక అందమైన... అందానికే పర్యాయపదంగా చెప్పుకునేంత అందమైన ప్రదేశం. ప్రపంచ ప్రజలలో చాలా మంది అక్కడికి వెళ్లాలని, ఆ ప్రదేశాలు చూడాలని కోరుకుంటారు. అందానికి పర్యాయపదంగా చెప్పుకునే అంత అందమైన ప్రదేశంలో భయంకరమైన అగ్నిపర్వతాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటాయి. విచిత్రమేంటంటే ఆ అగ్నిపర్వతాలనుంచి ప్రజలను రక్షిస్తున్నది ఆదిపూజితుడు, విఘ్ననాశకుడు వినాయకుడు. తొలి పూజలందుకునే ఇలవేలుపు గణనాధుడు వినాయకుడు. ఇంకా వింత విషయమేంటంటే అదొక ముస్లిం దేశం. ఆ ముస్లిం దేశంలో గణనాథుడు తరతరాలుగా కొలవబడుతున్నాడు. అదే ఇండోనేషియా దేశం. ఇండోనేషియాలోని తూర్పు జావాలో 7,641 అడుగుల ఎత్తులో ఉంది గణనాధుడి విగ్రహం. అది కూడా అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతంపై కొలువుతీరి ఉన్నాడు సంకటనాశ గణనాథుడు. అక్కడి ప్రజలు ‘బ్రోమో అని పిలుచుకునే ఈ విఘ్వేశ్వరుడు ఇక్కడ కొలువుతీరడం... వెనకున్న కథనమేంటి?
ఇండ్లల్లో జరిగే సాధారణ పూజలు,నోముల నుంచి వైదిక యాగాల వరకు అగ్ర పూజ, మొదటి పూజ వినాయకుడిదే. ఆదిపూజితుడుగా ఏకదంతుడు వినాయకుడి పూజ చేసి ఆ తరువాతే ఏ పూజ గాని, వ్రతం గాని, హోమం గాని ఎలాంటి శుభకార్యం గాని చెయ్యడం జరుగుతుంది. వినాయకపూజ చెయ్యకుండా ఏ కార్యమూ జరగదు. అంత ప్రాధాన్యత ఉంది
విఘ్ననాయకుడు వినాయకుడికి. వినాయకుడి గురించి చెప్పుకునేతపుడు మన రాష్ట్రం విషయానికి వస్తే ప్రముఖంగా కాణిపాకం వినాయక దేవాలయం గురించి చెప్పుకుంటాం అలాగే దేశ వ్యాప్తంగా చెప్పుకోవాలంటే అష్టవినాయక దేవాలయాల గురించి చెప్పుకోవాలి.
అయితే ముస్లిం దేశంగా చెప్పే ఇండోనేషియా దేశంలో బాలిదీవిలో కూడా వినాయకుడికి ఆలయాలు ఉన్నాయి. బాలీతో పాటు సుమత్రా దీవులు, జావా ద్వీపంలోనూ గణపతి ఆలయాలు దర్శనమిస్తాయి. కొన్ని శతాబ్దాలుగా ఇండోనేషియాలో ప్రజల చేత పూజలందుకుంటున్నాడు గణనాధుడు.
ఇండోనేషియాలో బాలి ద్వీపాన్ని ‘దేవత’ల నివాసంగా పరిగణిస్తారు. ప్రశాంతతకు అర్థాన్ని చెప్పే ప్రదేశం, ఆహ్లాదకరం అంటే ఇదీ అని ప్రత్యక్షంగా చూపించే భూతలస్వర్గం లాంటి ఆ ప్రాంతం దేవతలా నివాసం అంటే వింతేమీ కాదు కదా. ఇండోనేషియా ముస్లిం దేశమయినా ఈ ప్రాంతం మాత్రం 90 శాతం మంది హిందువులు నివసించే ప్రదేశం. నిత్యం పూజలు, దైవారాధనతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక చింతనతో నిండి ఉంటుంది. బాలిలో హిందు, బౌద్ధ, జావా మతాలు ఆచరణలో ఉన్నాయి.
సరే ప్రస్తుత విషయానికి వస్తే ఇండోనేషియాలోని మౌంట్ బ్రోమోలో 700 సంవత్సరాల పురాతన గణేశ విగ్రహం ఉంది. ఈ మౌంట్ బ్రోమో మామూలు పర్వతం కాదు భయంకరమైన అగ్నిపర్వతం. ‘బ్రోమో’ అనే పదం హిందూ దేవతలలో సృష్టి కర్త అయిన బ్రహ్మదేవుడికి చెందిన పేరు. స్థానికుల ఉచ్చారణ నుండి బ్రోమోగా మారింది. రికార్డుల ప్రకారం ఇండోనేషియాలోని 141 అగ్నిపర్వతాలున్నాయి. వాటిల్లో 130 అగ్ని పర్వతాలు మరింత భయంకరమైనవిగా చెబుతున్నారు. 2012 వరకు ఉన్న రికార్డుల ప్రకారం ఇండోనేషియా మొత్తం ప్రాంతంలో వందకు పైగా చురుకైన అగ్నిపర్వతాలు ఉన్నాయి. దీంతో దాదాపు 5 మిలియన్ల మంది ప్రజలు ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
ఇలాంటి భయంకరమైన అగ్నిపర్వతాలలో ఒకటి మౌంట్ బ్రోమో. మౌంట్ బ్రోమో అగ్నిపర్వతంపై ఒక గణపతి విగ్రహం కొలువుతీరి ఉంది. ప్రతి సంవత్సరం యడ్ న్యా కసాడా అన్న పేరుతొ స్థానికులు జరుపుకునే పండుగ రోజు అక్కడి ప్రజలు ఆ బ్రోమో అగ్ని పర్వతానికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆ మొక్కులలో మేకలు, కోళ్ళు, దగ్గరనుంచి కూరగాయలు, పళ్ళు, బియ్యం ఇలా తమ శక్త్యానుసారం తమకు తోచినవన్నీ అక్కడి గణనాతుడికి నైవేద్యంగా సమర్పించి వాటిని మండుతున్న ఆ అగ్నిపర్వత బిలంలో వేసేస్తారు. ఇలా వెయ్యడానికి కూడా ఓ కారణం చెబుతారు.
భగవంతుడు తమకు ఇచ్చినవాటిలో కొంత భాగం మళ్ళీ నైవేద్యంగా తిరిగి దేవుడికి సమర్పిస్తే ఆ స్వామి తమపై మరింత కరుణ చూపిస్తాదన్న భావంతో ఎక్కువ ఆవులున్న వారు అందులో ఒక ఆవును, కోళ్ళున్నవారు ఒక కోడిని, ఇలా తమకు ఏది కలిగితే అది అంటే తమ జీవనోపాధి అయిన వాటిని నైవేద్యంగా సమర్పించి ఆ అగ్నిపర్వత బిలంలో వేసేస్తారు. ఇలా వీరు బిలంలో వేసిన వాటిని పట్టుకోడానికి తెన్గర్ తెగకు చెందని వారు ఆ అగ్నిపర్వతం అంచున నిలబడి వలలు వేసి ఆ వలల్లో వాటిని పట్టుకొని తీసుకుపోతో ఉంటారు. అయితే ఆ అగ్నిపర్వతానికి మండుతున్న బిలానికి మధ్యలో చాల దూరం ఉంటుందట. అందుకే తెన్గర్ తెగ భక్తులు బిలంలో వేసిన ప్రాణులు, పదార్ధాలు అన్నీ ఆ మధ్యలో పడుతూ ఉంటాయి. వాటిని తెమ్గర్ తెగకు చెందని కొందరు సేకరించి తీసుకుపోతున్తారట.
అక్కడి స్థానికులు చెప్పిన ప్రకారం ఈ గణేషుని విగ్రహం 700 సంవత్సరాలుగా అక్కడ ఉంది. ఈ గణేశుడుని తమ పూర్వీకులు అగ్నిపర్వతం ముందు ప్రతిష్టించారని టెంగర్ మాసిఫ్ తెగ చెబుతుంది. ఈ చురుకైన అగ్నిపర్వతం బద్దలు కాకుండా గణేశుడు తమను రక్షిస్తాడని స్థానికులు నమ్ముతారు. టెంగర్ మాసిఫ్ తెగకు చెందిన ఇతిహాసాల ప్రకారం సుమారు 700 సంవత్సరాల క్రితం టెంగర్ మాసిఫ్ తెగకు చెందిన పూర్వీకులు ఈ పర్వతం మీద గణేశ విగ్రహాన్ని ప్రతిష్టించారని దృఢంగా నమ్ముతారు. దీని కారణంగా వీరు వినాయకుడికి పూజలు చేసి అనేక రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. గణపతి పూజ ఎటువంటి సందర్భంలోనూ ఆపకూడదు అనేది వీరి నమ్మకం. పరిస్తితులు ఎలా ఉన్నా సరే ఇక్కడ వినాయకుడిని పూజించడమే కాకుండా పూలు, పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. అలా చేయకుంటే అగ్నిపర్వతం బద్దలై తమని అగ్ని పర్వతం తినేస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం!
మౌంట్ బ్రోమో అగ్నిపర్వతం సరిహద్దుల్లో నివసించే ప్రజలు..ఆ అగ్నిపర్వతం విస్పోటనం చెందకుండా తమను రక్షించమని లంబోదరుడిని పూజిస్తారు. ఈ చుట్టూ పక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న తెన్గర్ తెగ ప్రజలంతా సంవత్సరానికి ఒకసారి యడ్ న్యా కాసాడ పండుగ రోజు ఈ పర్వతం దగ్గర సమావేశమవుతారు. స్థానిక టెన్గర్ కేలండర్ ప్రకారం కసాడ నెలలో వచ్చే 14 వ రోజు ఈ పండుగ చేసుకుంటారు. ఆ రోజు అందరూ ఇక్కడ సమావేశామాయి తమ తెగను చల్లగా చూడమని, ఈ భయంకరమైన అగ్నిపర్వతం నుంచి తమను రక్షించమని గణనాథుడిని వేడుకుంటారు. పూజలు, ఆరాధనలు చేస్తారు.
సరే ఇంతకీ అక్కడ ఈ పండుగ జరుపుకోవడం ఎప్పుడు ఎలా ప్రారంభామయిండీ అంటే స్థానిక జానపద కథనాల ప్రకారం 15వ శతాబ్దంలో ఈ పండుగ జరుపుకోవడం ప్రారంభమయినట్టు చెబుతున్నారు. అక్కడి యువరాణి రోరో అంతెంగ్ ఆమె భర్త తమకు పెళ్ళయి ఎంతకాలమైనా పిల్లలు కలగాకపోవడంతో ఈ పర్వతం దగ్గరే కూర్చొని ధ్యానం చేస్తూ ఉండిపోయారట. ఆ తరువాత వారికి 25 మంది సంతానం కలిగారు. అయితే తమకు సంతాన భాగ్యం కలిగించినందుకు ప్రతిగా తమ సంతానంలో ఒకరిని భగవంతుడికి నైవేద్యంగా ఆ మౌంట్ బ్రోనో అగ్నిపర్వతంలోకి వేసేస్తామని మొక్కుకున్నారట. అయితే సంతానం కాస్త పెరిగిన తరువాత తల్లిదండ్రుల మొక్కు తీర్చి, తమ తెన్గర్ తెగ ప్రజల మంచి కోసం వారి సంతానంలో ఒక బాలుడు తన ఇష్టపూర్వకంగానే ఆ అగ్నిపర్వతంలోకి దూకేసాడని ప్రచారంలో ఉన్న కథ.
అయితే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన సమయంలో ఎన్నో కార్యక్రమాలు రద్దయిన విషయం మనకు తెలిసిందే. ఆ సమయంలోనే 2020 సంవత్సరం నుంచి ఇక్కడ సామూహికంగా పండుగ చేసుకోవడం అనేది జరగలేదు. మళ్ళీ నాలుగేళ్ల తరువాత ఈ సంవత్సరం ఆ పండుగ జరుపుకొని సంకటనాశ గణనాథుడిని సేవించడం కోసం వేలాదిమంది తెన్గర్ తెగ ప్రజలు సమావేశమయ్యారు.
చుట్టుపక్కల 48 గ్రామాలోని 3 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. వారు గణేశునికి ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు. తమను అగ్నిపర్వతాల నుంచి రక్షించే దేవుడు గణేషుడే అని, ఈ గణేశుడు విగ్రహమే మౌంట్ బ్రోమో అగ్నిపర్వతం బద్దలవ్వకుండా తమను కాపాడుతుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. 'విది వాసా' పేరుతో స్థానిక ప్రజలు పండుగ జరుపుతారు. పండ్లు, పువ్వులను అగ్నిహోత్రం చేసి విఘ్నాలను తొలగించాలని కోరుకుంటారు. గణేశుని ఆరాధనకు ఎప్పుడూ అంతరాయం కలగదు. ఇక్కడ 'యద్నాయ కసాడా' అనే సంప్రదాయం ఉంది. ఇది వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన సంప్రదాయం. అగ్నిపర్వతంలో భారీ విస్ఫోటనాలు ఉన్నప్పటికీ ఆ పద్ధతి మాత్రం నిరంతరం కొనసాగుతోంది.
మౌంట్ బ్రోమో అగ్నిపర్వతం ఎక్కడం మొదలు అయ్యే ప్రదేశంలో నల్ల రాళ్లతో తయారు చేయబడిన 9వ శతాబ్దపు బ్రహ్మ ఆలయం కూడా ఉంది. బ్రోమో అనే పేరుకు జావానీస్ భాషలో బ్రహ్మ అని అర్థం. ఇండోనేషియా ఇస్లామిక్ దేశంగా ఉన్నప్పటికీ అక్కడ గణేషుడిపై ఎంతో భక్తి .. అంటే నమ్మకం కూడా. విగ్రహం సందర్శకులను ఆకర్షిస్తుంది. ఈ గణేశుడుని తమ పూర్వీకులు అగ్నిపర్వతం ముందు ప్రతిష్టించారని టెంగ్గర్ మాసిఫ్ తెగ చెబుతుంది.