Vijaya Lakshmi
Published on Jul 17 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?భారతదేశంలో ఉన్న ఎన్నో ఆలయాల్లో ఎన్నో మిస్టరీలు వున్నాయి. సైన్స్ కి అంతు చిక్కని రహస్యాలు ఇప్పటికీ మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఆలయం కూడా ఇంచుమించు అలాంటిదే. ఇక్కడి దేవుడు ఆకలికి అస్సలు తట్టుకోలేడట. అందుకే రోజూ ఎన్నో సార్లు స్వామి వారికి నైవేద్యం అందిస్తారు.
ఇంతకు దేవుడికి ఆకలి వేయడం ఏమిటి..ఆయనే కదా ఈ ప్రపంచానికి ఆకలి లేకుండా అందరికీ భోజనం ఇచ్చేది అని అనుకుంటున్నారు కదా. నిజమే కానీ అదే ఇక్కడి రహస్యం.. ఇంతకు ఆ ఆకలి దేవుడి పేరేంటి...? ఆయన ఆలయం ఎక్కడ?
కేరళలోని కొట్టాయం జిల్లాలో తిరువేరపు లేదా తిరువరప్పు ప్రాంతానికి వెళ్తే మనకు ఆకలి కృష్ణుడి ఆలయం కనిపిస్తుంది. ఆ ఆలయంలో కనిపించే కృష్ణుడి విగ్రహం ఆకలిని అస్సలు తట్టుకోలేదట. నైవేద్యం తినకపోతే ఈ విగ్రహం బలహీనమైపోతుందని ఇక్కడివారు చెప్తారు. కాబట్టి ఇది ఒక స్పెషల్ టెంపుల్ అని చెప్పొచ్చు.
1500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శ్రీకృష్ణుడికి రోజుకు 10 సార్లు నైవేద్యాన్ని పెడతారు. నైవేద్యం ఇలా ప్లేట్ లో పెట్టగానే అలా ఎవరో అదృశ్య శక్తి తినేస్తూ ప్లేట్ ఖాళీ అవుతూ కనిపిస్తుందట. కృష్ణుడు మేనమామ కంసుడు అన్న విషయం అందరికీ తెలుసు. ఆయన్ని సంహరించిన తర్వాత కృష్ణుడు ఆకలితో ఉన్నాడని అంటారు. అలాగే ఇక్కడి ఆలయంలో విగ్రహం కూడా ఆకలితో అలమటిస్తూ కనిపిస్తుంది.
ఏదేమైనా స్వామివారికి నైవేద్యం పెట్టడంలో కొంచెం ఆలస్యం అయినా.. విగ్రహం సన్నగా ఐపోతుందని ఇక్కడి వారి విశ్వాసం. అందుకే ఈ ఆలయాన్ని రోజుకు రెండు నిమిషాలు మాత్రమే మూసి ఉంచుతారు. ఇక్కడ విగ్రహం రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు కేవలం ఆ 2 నిమిషాలు మాత్రమే నిద్రపోతాడట. ఆ రెండు నిమిషాలు గడిచాకా ఆలయం తలుపులు తెరవకపోతే ఇక స్వామి వారు ఆకలికి తట్టుకోలేక పోతారని అంటారు. అందుకే ఆలయ తాళపు చెవిని, దాంతో పాటు ఒక గొడ్డలిని కూడా పూజారికి ఇస్తారు. ఒక వేళ ఆలయం తలుపులు తాళం చెవితో తెరవలేకపోతే. తాళం కప్పను గొడ్డలితో బద్దలు కొట్టి గబగబా లోపలి వెళ్లి నైవేద్యం పెట్టాలట.. ఈ విషయంలో పూజారికి అనుమతి ఉంది.
ఈ పద్దతి కొన్ని వందల ఏళ్లుగా ఇక్కడ సాగుతోంది. ఈ ఆలయ ఆచారాల కారణంగా గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయాన్ని మాత్రం అస్సలు ముయ్యారు. ఐతే ఈ ఆలయంలోని స్వామివారి ప్రసాదం తిన్న వ్యక్తి తన జీవితంలో ఎప్పటికీ ఆకలితో బాధ పడడు అని నమ్మకం. స్వామికి నైవేద్యం పెట్టాక భక్తులందరికీ ప్రసాదంగా దాన్ని పంచుతారు. ప్రసాదం తీసుకోకుండా ఏ భక్తుడూ ఆకలితో వెళ్ళకూడదని ఈ ఆలయ నియమం. అందుకే ప్రసాదం పంచడం పుర్తయ్యాక, "ఇంకా ఎవరైనా ప్రసాదం తీసుకోనివారు ఉన్నారా?” అంటూ ఇక్కడి అర్చక స్వాములు పెద్ద పెద్ధగా అరుస్తారు.
ఇక ఈ ఆలయానికి వెళ్తే గ్రహ, గ్రహణ దోషాలు, సంతాన, సర్పదోషాలు, వ్యాపారంలో నష్టం, వివాహ సమస్యలు, బ్రాహ్మణ హత్య వంటి మహాపాతకాలు అన్నీ ఇక్కడ నివారణ అవుతాయని భక్తులు విశ్వాసం.
ఐతే ఇక్కడి స్థల పురాణం అనేది ఒకటి ఉంది. ఒకసారి పాండవులు వనవాసానికి వెళ్తూ ఉండగా తనని పూజించుకోవడానికి వీలుగా కృష్ణుడు వాళ్లందరికీ ఒక విగ్రహాన్ని ఇచ్చాడట. ఐతే పాండవుల వనవాసం పూర్తయ్యే టైం కి చేర్తాలా అనే ప్లేస్ లో ఉన్నారు. అలా అక్కడినుంచి పాండవులు తిరిగి వెళ్ళిపోతూ ఉండగా ఆ ఊరివాళ్లు కృష్ణుడి విగ్రహాన్ని తమకు ఇవ్వమని ఎంతో భక్తితో అడిగేసరికి పాండవులు కూడా వాళ్లకు ఇచ్చేశారట. అప్పుడు వాళ్లంతా కలిసి స్వామి వారికి ఒక అందమైన ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం మొదలు పెట్టారు.
అయితే... రోజులు గడిచేకొద్దీ ఆ ఊరి వాళ్లకు ఏవో రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉండేసరికి ఈ విగ్రహం వచ్చిన దగ్గర నుంచే ఇలా అవుతోందని తెలిసి, వాళ్లంతా కలిసి ఒక స్వామీజీని కలిసి విషయం చెప్పేసరికి ఆయన ఇలా అన్నాడు. కృష్ణుడికి సరిగ్గా పూజలు చేయడం లేదు కాబట్టి ఆయన ఆగ్రహానికి గురవుతున్నారు..అందుకే ఇలా జరుగుతోంది కాబట్టి స్వామి వారిని సరిగా చూసుకోలేనప్పుడు నీటిలో వదిలేయడమే మంచి మార్గం అని ఒక సలహా ఇచ్చాడు. దాంతో ఊరి వాళ్లంతా కలిసి కృష్ణుడి విగ్రహాన్ని ఓ కొలనులో వదిలేశారు.
అలా ఉండగా కొన్నాళ్లకు విశ్వమంగళం స్వామి అనే సాధువు పడవలో వస్తుండగా సరిగ్గా స్వామి వారి విగ్రహాన్ని వదిలేసిన చోటే ఆయన పడవ ఆగిపోయింది. దాంతో ఆయనకు ఎదో అనుమానమొచ్చి తనతో వున్న వారిని వెళ్లి నీళ్ళల్లో వెతకమని చెప్పేసరికి వాళ్లకు కృష్ణుడి విగ్రహం కనిపించింది. అలా ఆయన ఆ విగ్రహాన్ని తీసుకుని ఒడ్డుకు వెళ్ళాడు. అలా వెళ్ళాక అక్కడ కన్పించిన ఓ వెడల్పాటి పాత్రలో విగ్రహాన్ని నిలబెట్టి, తాను స్నానం చేయడానికి వెళ్ళాడట. స్నానం చేసి తిరిగొచ్చి చూసేసరికి ఆ పాత్ర మట్టిలో ఇరుక్కుపోయింది. విగ్రహం కూడా అక్కడే అతుక్కుపోయేసరికి ఆయన ఏం చేయాలో అర్థంకాలేదు. ఈ విషయం తెలిసిన ఊరి వాళ్లంతా అక్కడ పోగయ్యారు. అప్పుడు వాళ్లలోని ఒక భక్తుడు స్వామి వారి విగ్రహం ఉన్న పాత్ర, ఆ స్థలం కూడా తనదేనని చెప్పి తర్వాత ఆయన కోసం ఆ స్థలాన్ని ఇచ్చేశాడట. అలా ఆ ప్లేస్ లోనే స్వామికి ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
కృష్ణుడు అంటే ముందుగా గుర్తొచ్చే పండగ కృష్ణాష్టమి. ఈ వేడుకల్లో భాగంగా ఉట్టిని పగులగొట్టి.. గ్రామోత్సవాలు నిర్వహిస్తారు.. పిల్లల్ని చిన్ని కృష్ణుడిలా అందంగా అలంకరించి ఇంట్లో కృష్ణుడి పాదాలు వేసి మురిసిపోతూ ఉంటారు.
కానీ ఇక్కడి కృష్ణుడే కొంచెం డిఫరెంట్. కానీ లైఫ్ లో ఒక్కసారైనా ఈ కృష్ణుడిని చూసి తరించాల్సిందే. కృష్ణుడి గురించి ముఖ్యంగా చెప్పాలంటే మహాభారత యుద్ధ సమయంలో గీతోపదేశంతో లోకకల్యాణం జరిగింది. అర్జునునికి సారథిగా మహసంగ్రామ యుద్ధం ముగిసేంతవరకు పాండవులకు రక్షణగా నిలబడి కష్ట సమయంలో మనిషి మనిషి తోడు నీడ అని నిరూపించాడు.
అశ్వత్థామ అస్త్రం కారణంగా ఉత్తర గర్భంలో పిండం కూడా మృత్యువు అంచులకు చేరినప్పుడు కృష్ణుడు తన చక్రంతో ఆ పిండాన్ని రక్షించి మాతృత్వానికి మంచి అర్ధం చెప్పాడు. ఆ శిశువే పరీక్షిత్తుగా జన్మించి పాండవుల తర్వాత రాజ్యానికి మహారాజు అయ్యాడు. లోక కళ్యాణం కోసమే భూలోకంలో శ్రీకృష్ణుడిగా పుట్టి దుష్ట శిక్షణ చేశాడు. ఆ పరమాత్మను శ్రీకృష్ణాష్టమి సందర్భంగా పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరతాయని భక్తులు గట్టిగ నమ్ముతారు.
ఇక ఈ ఆకలి కృష్ణుని ఆలయానికి వెళ్ళాలి అంటే, కొట్టాయం నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి వెళ్లాలనుకునే వారికి ఏపీ, తెలంగాణ నుంచి రైలు, విమాన, బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ముందుగా కొచ్చి లేదా కొట్టాయంకి చేరుకుంటే చాలు. ఆ తర్వాత ఆలయానికి వెళ్ళడానికి బోల్డు మార్గాలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
మరి ఆకలి కృష్ణుడి గురించి మీకేమనిపిస్తోంది.