విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు | Vijayawada kanakadurga temple Shravan festivals

Vijaya Lakshmi

Published on Jul 24 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

రేపటి నుంచే శ్రావణ మాసోత్సవాలు


విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 25 అంటే రేపటి నుంచి శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నెల రోజుల పాటు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగే  ప్రత్యేక పూజలు, పవిత్రోత్సవాలకు సంబంధించిన తేదీలను ఆలయ అధికారులు విడుదల చేశారు.




సామూహిక వరలక్ష్మీ వ్రతాలు


విజయవాడ దుర్గమ్మ ఆలయంలో జూలై 25 నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు శ్రావణ మాస ఉత్సవాలు జరగనున్నాయని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రావణమాసం రెండో వారం ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతం వేడుకలు నిర్వహించనున్నారు. ఆ రోజున దుర్గాదేవి వరలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అయితే ఆగస్టు 8న ఆలయ పూజారులు వరలక్ష్మీ వ్రతం ఏకాంతంగా నిర్వహించనుండగా, మహిళా భక్తులు వరలక్ష్మీ వ్రతాలలో పాల్గొనడానికి వీలుగా ఆగస్టు 22న శ్రావణ ఐదవ శుక్రవారం  శ్రీ మల్లిఖార్జున మహా మండపం 6వ అంతస్తులో సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. ఇందులో  రెండు బ్యాచ్‌లుగా మహిళలను ఈ పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతించనున్నారు.



మొదటి సెషన్ ఉదయం 7 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు, రెండో సెషన్ ఉదయం 10 గంటల నుంచి ఉదయం 11:30 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతంలో మహిళలు ఉచితంగా పాల్గొనవచ్చు అయితే ముందుగా తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. దరఖాస్తులను ఆగస్టు 18 నుంచి దరఖాస్తులను ఆలయంలోని టోల్-ఫ్రీ కౌంటర్‌లో (పనివేళల్లో) స్వీకరిస్తారు. దరఖాస్తుకు ఒక మహిళ మాత్రమే అనుమతించబడతారు. పాల్గొనేవారికి 150 గ్రాముల కుంకుమ, బ్లౌజ్ పీస్, గాజులు, లడ్డూ, పులిహోర, పూర్ణం, శక్తి కంకణంతో కూడిన ప్రసాద కిట్లు అందుతాయి. వ్రతం ఆచరించే మహిళలకు ప్రత్యేక క్యూ లైన్ ద్వారా అమ్మవారి దర్శనం కల్పించనున్నారు.


youtube play button






పవిత్రోత్సవాలు - ఆర్జిత సేవలు రద్దు


ఆగస్టు 8 శుక్రవారం నుంచి శ్రావణ శుద్ధ చతుర్దశి వరకు ఆ మూడు రోజులు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. పవిత్రోత్సవాలు జరిగే మూడు రోజులూ దుర్గామల్లేశ్వరస్వామి వార్లకు నిర్వహించే అన్ని ప్రత్యక్ష, పరోక్ష సేవలను నిలిపివేస్తారని ప్రకటించారు. 11వ తేదీ నుంచి యథావిధిగా అన్ని అర్జిత సేవలు కొనసాగనున్నాయి. ఆగస్టు 16వ తేదీన కృష్ణాష్టమిని పురస్కరించుకుని దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. ఆగస్టు 23న ఆలయ ప్రాంగణంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయని ఆలయ వైదిక కమిటీ వెల్లడించింది. వ్రతాలకు సంబంధించిన అప్లికేషన్స్ కూడా ఆలయంలోనే ఇస్తారని తెలిపారు.



భయపడని వారే చూడండి


youtube play button


youtube play button


youtube play button




Recent Posts
ఊర్మిళాదేవి నిద్ర : రామాయణంలో ఎవరికీ తెలియని మహా త్యాగం: ఊర్మిళా దేవి గాథ  | The Untold Sacrifice of Urmila in Ramayana
ఊర్మిళాదేవి నిద్ర : రామాయణంలో ఎవరికీ తెలియని...
900 ఏళ్ల చరిత్ర! కరకచెట్టు పోలమాంబ దేవి అద్భుత గాథ | Vizag Powerful Goddess Polamamba Story
900 ఏళ్ల చరిత్ర! కరకచెట్టు పోలమాంబ దేవి...
త్రిశంకు స్వర్గం నిజంగా ఉందా? విశ్వామిత్రుడు సృష్టించిన మరో స్వర్గం కథ  | Shocking Truth! Trishanku Swargam
త్రిశంకు స్వర్గం నిజంగా ఉందా? విశ్వామిత్రుడు సృష్టించిన...
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి - చందనోత్సవంపై ఆసక్తికర కోణాలు - రహస్యాలు  | Simhachalam Temple History in Telugu
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి - చందనోత్సవంపై ఆసక్తికర కోణాలు...
అక్షయ తృతీయ ఎందుకు జరుపుకోవాలి? | Importance & significance of Akshaya tritiya
అక్షయ తృతీయ ఎందుకు జరుపుకోవాలి? | Importance...