Vijaya Lakshmi
Published on Jan 21 2026
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?పద్మనాభస్వామి ఆలయం శ్రీ మహావిష్ణువు అనంతశయన రూపంలో కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం. ఈ ఆలయం 108 దివ్యదేశాలలో ఒకటి. పురాణాల ప్రకారం బలరాముడు ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నాడు. 12 మంది అళ్వార్లలో ఒకరైన నమ్మాళ్వారు ఈ ఆలయాన్ని తన పాశురాలలో ప్రస్తావించారు.చారిత్రక ఆధారాల ప్రకారం కలియుగ ఆరంభ కాలం నుంచే ఈ ఆలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కనిపిస్తున్న నిర్మాణాన్ని శతాబ్దాల క్రితం ట్రావెన్‌కోర్ రాజులు పునర్నిర్మించారు. భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. వింతలు, రహస్యాలను దాచుకున్న అనేక దేవాలయాలు ఉన్నాయి. సనాతన ధర్మ విశిష్టతను తెలుపుతూ.. కొండ కోనల్లో ఉన్న అనేక ఆలయాల్లో కొన్ని స్వయంభూ ఆలయాలు కాగా మరికొన్ని మానవ నిర్మితాలు. వాటిల్లో ఎన్నో రహస్యాలు, మిస్తారీలు. ఈ రహస్యాలలో ఒకటి దేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటైన కేరళలోని తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఈ ఆలయంలో ఒక ద్వారం ఉంది. అది ఏడవ ద్వారం.. ఈ ద్వారం ఇంకా తెరుచుకోలేదు.. ఈ ద్వారం తెరిస్తే అందులో ఉన్న భారీ నిధి బయటపడుతుందని. ఈ సంపద లెక్క పెట్టలేనంత ఉంటుందని చెబుతారు.
చారిత్రిక ఆధారాలు గ్రందాల ప్రకారం కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. వేల సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకున్నట్లు ఆలయ రికార్డులు కూడా చెబుతున్నాయి. అయితే ఈ మందిరాన్ని 260 ఏళ్ల క్రితం తిరిగి నిర్మించారట.
స్వామివారి మూల విరాట్టును ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేమట. పెద్ద విగ్రహం కావడం వల్ల తలను, చేతిని, పాదాలను వేర్వేరు ద్వారాల నుంచి చూడాలట. ఈ విషయం చాలామందికి తెలియదు. కాగా ట్రావెన్ కోర్ మహారాజు రాజా మార్తాండవర్మ పాలనా సమయంలో వేల సాల గ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారట. ఆ కాలంలో 4 వేల మంది శిల్పకారులు, 6 వేల మంది కార్మికులు, 100 ఏనుగులు ఆరునెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పటు చేసినట్లు తెలుస్తోంది.
పద్మనాభస్వామి ఆలయం శ్రీమహావిష్ణువు అనంతశయన రూపంలో ఉన్న ఆలయం. ఈ ఆలయం త్రావణకోర్ రాజుల సంరక్షణలో ఉండేది. కేరళ లోని ఈ పద్మనాభస్వామి ఆలయం ప్రత్యేకత ఏమిటంటే… రాజులు తమ సంపదను, తాము స్వామికి సేవకులమని భావించి ఆలయంలో సమర్పించారు. అందుకే ఈ ఆలయం అపారమైన ధనసంపదకు కేంద్రంగా మారింది.
పద్మనాభస్వామి ఆలయానికి ఉన్న అపార సంపదకు ప్రధాన కారణం ట్రావెన్‌కోర్ రాజులు. వారు తమను “పద్మనాభదాసులు”గా భావించి, రాజ్యాన్ని కూడా స్వామివారి ఆస్తిగా ప్రకటించారు. తమ సంపదను తరతరాలుగా ఆలయంలో సమర్పించారు. అందుకే ఈ ఆలయం అపారమైన ధనరాశికి కేంద్రంగా మారింది.
2011లో భారత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆలయంలోని రహస్య గదులను తెరవడం జరిగింది.
ఈ గదులకు A, B, C, D, E, F అనే పేర్లు పెట్టారు.
👉 A, C, D, E, F గదులు తెరిచినప్పుడు:
బయటపడ్డాయి.
₹1 లక్ష కోట్లకు పైగా (కొన్ని అంచనాల ప్రకారం ₹5 లక్షల కోట్ల వరకు) సుప్రీంకోర్టు తీర్పుతో ఐదు గదులను తెరిచారు. ఫలితంగా ఆ గదుల్లో అపారమైన సంపద ఉన్నట్లు గుర్తించారు. ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్ అనే ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఆ గదులకు పేర్లు పెట్టారు. మొదట ఏ, బీ, సీ గదులను తెరిచారు. వాటిలో 20 పెద్ద జగ్గులు, బంగారు హ్యాండిల్ తో కూడిన ఒక జగ్గు, ఒక బంగారు కలం, 340 వరకు బంగారు జగ్గులు, 30 వెండి దీపాలు, శివుడి విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలు రాశుల కొద్ది ఉన్నట్లు గుర్తించారు. ఇవి కాకుండా తీస్తున్న కొద్ది బంగారు కంకణాలు, ఉంగరాలు వస్తూనే ఉన్నాయట. ఆలయానికి ఉత్తరం వైపున, ఆగ్నేయంలో రూమ్ ఎఫ్ ను తెరిచారు. ఈ గదుల్లోనూ అపారమైన బంగారం, వజ్రాలు రాశుల కొద్ది లభించాయి. వీటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని అంచానా. నేల మాళిగల్లో బయటపడ్డ సంపదలతో అప్పటి వరకూ దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభ స్వామి ఆలయం వెనక్కు నెట్టింది. ఆలయంలోని నేలమాళిగలలో ఇప్పటికే కొన్ని నేలమాళిగలు తెరిచారు. అందులో బయటపడిన సంపద సుమారు ఐదు లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు ఐదుఅన్ని గదులు తెరిచినప్పటికీ ఒక్క గదిని మాత్రం ఇంకా తెరవలేదు. నాగ బంధనం వేసి ఉండటంతో తెరవడం సాధ్యం కాదని చెబుతున్నారు పండితులు. ఆ గదిలో మిగిలిన గదుల్లో ఉన్నదానికంటే రెట్టింపు సంపద ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆలయంలోని అనంతమైన సంపదకు ఆలయ నిర్వహణకు ట్రావెన్ కోర్ పాలకులే సంరక్షకులకుగా ఉంటున్నారు. వెల కట్టనేలని నిధుల రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు.
ఈ ఆరు గదుల్లో ఒక్క గది మాత్రమే ఇప్పటికీ తెరవలేదు. అదే Vault B.
❗ B Vault ప్రత్యేకతలు
స్థానికుల విశ్వాసం ప్రకారం ఈ గదిని సాధారణ మనుషులు తెరవలేరు.
కేవలం గరుడ మంత్రంతో, సిద్ధ పురుషులు మాత్రమే తెరవగలరని చెబుతారు.
B Vault తెరిస్తే:
స్థానికులు విశ్వసిస్తారు.
కొంతమంది ఈ గదిలో:
ఆలయ ఏడవ తలుపు చెక్కతో చేయబడింది. ఈ తలుపు మీద ఒక సర్పాక్రుతి చెక్కబడి ఉంది. అక్కడే... ఆ తలుపులోనే ఉంది రహస్యమంతా. ఈ ద్వారానికి శ్రీ మహావిష్ణువు పాన్పు అయిన శేషుడు కాపలాగా ఉన్నాడని నమ్ముతారు. ఈ తలుపు తెరిస్తే ప్రళయం వస్తుందని, భారీ విపత్తు జరుగుతుందని, అనేకమైన భయాలు తెరమీదికోచ్చాయి. మిగిలిన తలుపులు తెరిచే సమయంలో జరిగిన సంఘటనలు కూడా ఈ భయాలకు ఊతమిచ్చాయి. దీంతో తలుపులు తెరిచే ప్రయత్నం ఆగిపోయింది. ఈ తలుపు తెరవడంపై వివాదం నెలకొంది.
ఈ తలుపు గురించి మరికొన్ని కథలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ గదిలో శ్రీచక్రం ఉందనీ, ఒక యక్షిణి ఇక్క స్వామి వారికి పూజలు చేస్తుందని, ఇలా చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి. ఈ తలుపును తెరవడానికి ఎన్నో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కాని అవి అక్కడితో ఆగిపోయాయి. నిజానికి తలుపుకి ఎలాంటి గడియలు, తాళాలు ఉండవు. తలుపు మీద మహాసర్పాల బొమ్మలు మాత్రమె కనబడతాయి. ఆ తలుపులకున్న నాగాబందాన్ని తొలగించడానికి ఎంతోమంది మాన్త్రికుల్ని రప్పించినా ఫలితం లేకపోయింది. పైగా ఆ ప్రయత్నాలు చేసిన వారిలో చాలామందికి అనుకోని ఆపదలు వచ్చాయి. కేరళను వరదలు ముంచెత్తాయి. అదే సమయంలో ట్రావెన్ కోర్ రాజకుటుంబం ఆ గదిని తెరవకుండా కోర్ట్ లో ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకురావడంతో ఆ తలుపు తెరిచే ప్రయత్నాలు ఆగిపోయాయి. ఇవే కాదు ఈ ఆలయానికి సంబంధించి చెప్పుకోవలసిన మరెన్నో రహస్యాలు, విశేషాలు, చరిత్ర ఉన్నాయి.
శాస్త్రవేత్తలు, న్యాయపరమైన వాదనల ప్రకారం:
అని అంటున్నారు.
కానీ భక్తుల అభిప్రాయం ప్రకారం:
అనే నమ్మకం ఉంది.
ఈ వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా B Vault తెరవవద్దని నిర్ణయించింది.
ఇప్పటి వరకు బయటపడిన సంపద ఆధారంగా చూస్తే:
➡️ పద్మనాభస్వామి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వెనక్కు నెట్టి ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా నిలిచింది.
కేరళలోని పద్మనాభస్వామి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు…
అది చరిత్ర, భక్తి, భయం, విశ్వాసం, రహస్యాల సంగమం.
👉 B Vault రహస్యం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉంది.
నాగబంధం, స్థానిక నమ్మకాలు, కోర్టు ఆదేశాల వల్ల తెరవలేదు.
అంచనా ప్రకారం ₹1–5 లక్షల కోట్ల వరకు.
ఇప్పటి వరకు బయటపడిన సంపద ఆధారంగా అవును.