తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు | Navratri celebrations at Sri Padmavati Ammavari Temple, Tiruchanur from September 22 to October 2

Vijaya Lakshmi

Published on Sep 18 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 22 నుంచి అక్టోబ‌రు 2వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాల షెడ్యూల్ ను ప్రకటించింది ఆలయ కమిటీ.


ఈ సందర్భంగా ప్రతిరోజూ మ‌ధ్యాహ్నం 3 నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అదేవిధంగా సాయంత్రం ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. అక్టోబరు 2వ తేదీ విజయదశమినాడు శ్రీపద్మావతి అమ్మవారు రాత్రి 7.45 గంట‌ల‌కు విశేషమైన గజ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.


ఆర్జిత సేవ‌లు ర‌ద్దు 

న‌వ‌రాత్రి ఉత్స‌వాల కార‌ణంగా ఈ 10 రోజుల పాటు క‌ల్యాణోత్స‌వంను ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది. అదేవిధంగా, సెప్టెంబ‌రు 26న ల‌క్ష్మీపూజ‌ సేవ‌లు రద్ద‌య్యాయి.


ఇవి కూడా చూడండి

Recent Posts