Vijaya Lakshmi
Published on Aug 05 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?అక్కడ మన ప్రశ్నలకు ఆ అమ్మవారు ఖచ్చితంగా సమాధానమిస్తుంది. ఇక అమ్మవారు అక్కడ స్వయంగా అక్కడ కొలువున్నది అని చెప్పడానికి నిదర్శనం అక్కడ అమ్మవారు ఎప్పుడూ కదులుతూనే ఉంటుందట. ఆ తల్లి మహిమలు ఒకటా రెండా.. ఎన్నో ఎనెన్నో...
ఆ ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. ఆ దేవత మహారాష్ట్రీయుల ఆరాధ్యదైవం. మహారాష్ట్రను పాలించిన భోంస్లే వంశీయుల ఇలవేల్పు. ముఖ్యంగా ఛత్రపతి శివాజీకి ఎల్లవేళలా అండగా నిలచి, స్వయంగా ఖడ్గాన్ని అందించిన కులదేవత.
తుల్జాభవానీ మాత... తుల్జాభవాని మాతకు యుగాల చరిత్ర ఉంది. కృతయుగంలో అనుభూతి, త్రేతాయుగంలో శ్రీ రామచంద్రమూర్తి, కలియుగంలో ఛత్రపతి శివాజీ ఇలా ఎంతోమంది తుల్జాభవానీ ఆదరణకు పాత్రులైనట్టు పురాణ, చారిత్రిక కథనాలు చెప్తున్నాయి.
ఈ ఆలయం మహారాష్ట్ర లోని ఉస్మానాబాద్ జిల్లాలో ... బాలఘూట్ పర్వత శ్రేణులపై కొలువై ఉంది. సముద్ర మట్టానికి 2150 అడుగుల ఎత్తుపైన తుల్జాపూర్ పట్టణం ఉంటుంది. ఉస్మానాబాద్ నుంచి సుమారు 23 కి.మీ దూరంలో ఆలయం నెలకొంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని చించపూర్ అని పిలిచేవారట. క్రమంగా ఈ పేరు మారి అమ్మవారు తుల్జా భవానీ పేరుమీద తుల్జాపూర్‌గా మారిందట.
స్కంద పురాణం, మార్కండేయ పురాణం,దుర్గాసప్తశతి,దేవీభాగవతం లాంటి అనేక పురాణాలు, గ్రంధాలలో తుల్జాభవాని మాతకు సంబంధించిన ప్రస్తావన కనబడుతుంది.
కృతయుగంలో కర్డమ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య అనుభూతి. కర్డమ మరణించటంతో అతని చితిౖపె కూర్చుని సతీసహగమానికి సిద్ధపడుతుంది. ఆ సమయంలో ఆకాశవాణి నుంచి.. పిల్లలను వదిలి ఇలాంటి పని చేయడం అనుచితం అన్న మాటలు వినిపించాయి. ఈ మాటలు విన్న అనంతరం ఆమె తన మనస్సు మార్చుకుని యమునాచల్ లో దీర్ఘతపస్సు చేయసాగింది. ఆ యమునాచల్ ప్రాంతమే ఇప్పటి బాలఘూట్. అలా అనుభూతి యోగ సమాధిలో ఉన్న సమయంలోనే రాక్షసుడైన కుకార్ అనుభూతిని చూస్తాడు. ఆమె అందాన్ని చూసి ఎలాౖగెనా ఆమెను సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో ఆమెను బలవంతం చేయబోతాడు.
ఈ పరిణామంతో అనుభూతి అమ్మవారిని వేడుకుంటుంది. ఆమె ఆక్రందనలను విన్న మాతా భావానీమాత ప్రత్యక్షమవుతుంది. అప్పుడు కుకార్ పశువుగా రూపం మార్చుకుని యుద్ధ భూమిలో వికృతంగా నాట్యం చేస్తుంటాడు. అతని ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ తుల్జా మాత కుకార్ను వధిస్తుంది. అనంతరం భగవతిని ఇక్కడే ఉండిపొమ్మని అనుభూతి ప్రార్థించటంతో శాశ్వతంగా ఆమె అక్కడే కొలువైందని అంటారు.ఆపదలో ఉన్న భక్తుల పిలుపును ఆలకించి వెనువెంటనే ప్రత్యక్షమయ్యే మాత కనుక ఆమెకు 'త్వరిత' అన్న నామం స్తిరపడిందట. మరాఠీలో 'తుల్జా' అంటే త్వరితంగా ప్రత్యక్షమయ్యే దేవత అని అర్థం చెప్తారు. భక్తుల కోరికను త్వరితగతిన తీరుస్తుంది గనుక.. త్వరిత, అని తుల్జ అని కాలక్రమేణాగా తుల్జాభావనిగా పేరొందిందని చెప్తారు.
గురుచరిత్రలో కూడా ఈ తుల్జాపూర్ భవానీ మాత ప్రస్తావన కనబడుతుంది. అనారోగ్యం పాలైన నందిశర్మ అన్న భక్తుడు తన వ్యాధి నివారణ కోసం తుల్జాపూర్ భవాని మాట ను ఉపాసించడం మొదలుపెట్టాడు. అయితే ఎంతకాలం గడుస్తున్నా ఆ మాత కరుణించకపోవడంతో విసిగిపోయిన నందిశర్మ నిరాశగా దుఃఖించడం మొదలు పెట్టాడట. అప్పుడు తుల్జాభావానీ మాట అతనికి స్వప్నంలో దర్శనమిచ్చి... గంధర్వపురం అంటే గాణగాపూర్ లోని శ్రీ నృసింహసరస్వతి స్వామిని ఆరాధించమని చెప్పిందట. దాంతో ఆ ప్రకారంగానే చేసిన నందిశర్మ వ్యాధి పోగొట్టుకుని నృసింహ సరస్వతికి పరమ భక్తునిగా మారతాడు. తన ప్రార్ధనలతో స్వామిని స్తుతిస్తూ ‘కవీశ్వరుని’గా ప్రసిద్ధి చెందాడట. ఇప్పటికి కూడా దత్త భక్తులు గాణ్గాపూర్ దర్శించిన తరువాత తప్పనిసరిగా తుల్జాపూర్ మాతను దర్శించుకుంటారు.
ఇక ఆధునిక కాలానికి వస్తే, మరాఠా ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆలయంగా తుల్జా మాత దేవాలయం నిలిచింది. మరాఠీ రాజులకు, భోంస్లే వంశీయులకు తుల్జాభావాని ఇలవేల్పుగా ఆరాదిమ్చేవారట. తుల్జాభావానీ మాతను ఛత్రపతి శివాజీ కులదేవతగా అరాదించేవాడట. ఎప్పుడు ఎలాంటి సమస్య ఎదురయినా తుల్జా భవానీ దీవెనలౖకె ఛత్రపతి శివాజీ తరచుగా ఆలయాన్ని దర్శించేవారని ప్రతీతి
అమ్మవారి దీవెనలతోనే ఛత్రపతి శివాజీ యుద్ధభూమిలో ప్రతిసారి విజయం సాధించేవాడని చెప్తారు. అది మాత్రమె కాదు తుల్జా భవానీ స్వయంగా ఛత్రపతి శివాజీకి ఖడ్గాన్ని బహూకరించిందని చెప్పుకుంటారు.
ప్రతి సంవత్సరం శివాజీ మహారాజు తులజా భవానీ ఆలయంలోనే అమ్మ సమక్షంలో రాఖీ పండుగను జరుపుకునేవాదట. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో కొలువుతీరిన తుల్జా మాత మహారాష్ట్రీయులకే కాదు ఇతర ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా ఆరాధ్య దేవతగా కోలుచుకుంటారు.
ఇక చారిత్రక, పురావస్తు శాఖల అంచనా ప్రకారం .. ఈ ఆలయం ‘రాష్ట్రకూట్’ల కాలం నాటిది అంటారు. తుల్జాభవాని ఆలయం కూడా ఒక అద్భుతమే. నిజానికి ఆలయం చూస్తే అది ఒక ఆలయంలా కంటే ఒక కోటలా కనబడుతుంది. ఆలయం ప్రవేశద్వారంలోకి అడుగు పెడుతూనే ఒక కోటలోకి వేలుతున్నట్టే ఉంటుంది. ఇక గర్భగుడికి సమీపంలో స్థానికులు పలంగ్ అని పిలుచుకునే వెండితో తయారుచేసిన మంచం ఒకటి కనబడుతుంది.. అమ్మవారు ఈ మంచౖంపె నిద్రకు ఉపక్రమిస్తుందట. ఆ పలంగ్ ఎదురుగా మహదేవుడు లింగరూపంలో దర్శనమిస్తాడు.
ఇక అక్కడ ఉన్న స్థూపాలలోని ఒకదానిౖపె ఓ వెండి ఉంగరం ఉంటుంది. దానికి సంబంధించి ఒక కథనం చెప్తారు. శరీరంలోని ఏ భాగంలోౖనెనా తీవ్రౖమెన నొప్పితో బాధపడేవారు ఆ ఉంగరాన్ని ఏడురోజులపాటు తాకితే చాలు ఆ బాధ మటుమాయమవుతుందని భక్తుల నమ్మకం.
ఆలయంలో మరో అద్భుతం శకునవంతి. ఒక గుండ్రని రాయి. ఆ రాయినే శకునవంతి అని పిలుస్తారు. నిజానికి రాయి కాదు అమ్మవారే శిలగా అక్కడ ఉందని ప్రజల నమ్మకం. ఈ రాయిౖపె చేతితో గట్టిగా అదిమిపెట్టి ఓ ప్రశ్నను అడిగి దానికి అవునా కాదా అని అడిగితే రాయి సమాధానం చెప్తుందట. సమాధానం అవును అయితే రాయి కుడిౖవెపుకు తిరుగుతుంది. కాదు అనే సమాధానౖమెనట్లయితే ఎడమౖవెపుకు తిరుగుతుందట. ఒకవేళ రాయి ఎటూ కదలకుండా స్థిరంగా ఉన్నట్లయితే అనుకున్న పని ఆలస్యంగా పూర్తవుతుందని అర్థం. ఇవన్నీ భక్తులు నమ్మకాలు.
ఇప్పుడే కాదు ఛత్రపతి శివాజీ సైతం ఏ యుద్ధానిౖకెనా వెళ్లే ముందు ఈ శకునవంతి రాయి దగ్గరకు వెళ్లి తాను యుద్ధానికి వెళ్లాలా.. వద్దా అని ప్రశ్నించేవాడట. సమాధానం కూడా పొందేవాడని కథలుగా చెప్పుకుంటారు.
ఈ ఆలయంలో మరో అద్భుతం జమదర్ఖానా అంటే అమ్మవారి ఖజానా. అమ్మవారి నగలన్నీ ఈ జమదర్ఖానాలోనే ఉంటాయి. ఈ నగలన్నీ ఉత్సవాల సమయంలో అమ్మవారికి ధరింపచేస్తారు. ఈ నగలలో 108 విగ్రహాలు పొదిగిన బంగారు గొలుసు ఓ అద్భుతం. అది అప్పటి రాజు ఛత్రపతి శివాజీ అమ్మవారికి బహూకరించినది. తుల్జాపూర్ భవానిని నవరాత్రుల వేళల్లో చూడాలి అత్యంత శోభాయమానంగా దర్శనమిస్తుంది అమ్మవారు. ఈ సమయంలో ఆమెను చూడటానికి రెండు కళ్లూ చాలవు. కోట్లాదిరూపాయల విలువైన వజ్రవైఢూర్యాలు, మరకత మాణిక్యాలు, మంచి ముత్యాలు పొదిగిన ఆభరణాలతో, ధగధగలాడే కిరీటం, వజ్రాలు పొదిగిన నెక్లెస్, పాదుకలు, బంగారు కళ్ళతో బంగారం రాశిపోసినట్టు కనబడుతుంది అమ్మవారు. ఇవిగాక ఛత్రపతి శివాజీ సమర్పించిన 101 బంగారు నాణాల దండ ప్రత్యేకంగా అలంకరిస్తారు. ప్రత్యేకంగా ఈ అలంకారం చూడటానికే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారట.
భవాని అమ్మవారి ఆలయాన్ని సందర్శించే భక్తులు వెదురుబుట్టల్లో ప్రత్యేకంగా గోధుమ పిండితో చేసిన చపాతీలు, నైవేద్యంగా సమర్పిస్తారు.
షోలాపూర్ హైవే మార్గంలో తుల్జాపూర్ భవానీ మాటకు మరో చిన్న ఆలయం కూడా ఉంది. అదే ఘట్ శీల్ టెంపుల్. తుల్జాపూర్ భవాని ఇక్కడ ఒక శిల మాదిరిగా ఉంటుందట. అందుకే ఈ మూర్తికి ఘట్ శీల్ అని పేరు వచ్చిందంటారు. లక్షలాది మంది భక్తులు కాలినడకన వచ్చి ముందుగా ఈ మందిరాన్ని సందర్శించి ఆ తర్వాత తుల్జాపూర్ ప్రధాన ఆలయానికి వెళతారు.
ఇక ఈ తుల్జాపూర్ క్షేత్రానికి ఎలా వెళ్ళాలో చూద్దాం. రైలు మార్గం ద్వారా... వెళ్ళాలంటే తుల్జాపూర్‌కు అతి దగ్గరలో వున్న రైల్వే స్టేషన్ కాబట్టి రైల్లో షోలాపూర్ వరకు చేరుకొని అక్కడి నుంచి బస్సులో 45 కి.మీ. దూరంలో ఉన్న తుల్జాపూర్ చేరుకోవచ్చు. విమానమార్గం ద్వారా.. పూణెకు చేరుకొని అక్కడి నుంచి తుల్జాపూర్ వెళ్ళొచ్చు సుమారు గంట ప్రయాణం.
ఇక్కడ వసతి సదుపాయాల విషయానికి వస్తే చౌల్ట్రీలు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఆలయానికి ఎప్పుడు వెళ్ళాలంటే ఎండాకాలంలో ఇక్కడ ఎండవేడి తీవ్రంగా ఉంటుంది. అస్సలు బయటకు అడుగుపెట్టలేని పరిస్తితిగా ఉంటుంది. వర్షాకాలంలో అయితే తిరగడానికి ఇబ్బంది కాబట్టి శీతాకాలం ఈ క్షేత్ర దర్శనానికి అనువుగా ఉంటుంది.