శ్రీశైలంలో స్పర్శ దర్శనాలు రద్దు, శ్రావణ మాసోత్సవాలు, పూర్తి వివరాలు | shrisailam temple latest news about sravana festivals

Vijaya Lakshmi

Published on Jul 13 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

ప్రముఖ శైవ క్షేత్రం, జ్యోతిర్లింగ క్షేత్రమయిన శ్రీశైలం శ్రావణమాస ఉత్సవాలకు సిద్ధమైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని ప్రత్యేక రోజుల్లో గర్భాలయ అభిషేకాలు రద్దు కానున్నాయి. స్పర్శ దర్శనం వేళల్లో కూడా మార్పులు జరిగాయి.



శ్రావణ మాసం సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో జూలై 25 నుండి ఆగస్టు 24 వరకు శ్రావణ మాసోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తుల రద్దీ పెరుగుతుందని అంచనా వేసి, ఆలయ అధికారులు కొన్ని తాత్కాలిక మార్పులను ప్రకటించారు. అందులో భాగంగా గర్భాలయ అభిషేకాలను తాత్కాలికంగా నిలిపివేశారు.


శ్రావణ మాసంలో శ్రావణ శనివారాలు, ఆదివారాలు, సోమవారాలు, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పౌర్ణమి రోజుల్లో గర్భాలయ అభిషేకాలు ఉండవని ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు. అంటే దాదాపు 16 రోజుల పాటు అభిషేకాలు నిలిపివేస్తారు. మిగిలిన రోజుల్లో మాత్రం అభిషేకాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు.



అదేవిధంగా రద్దీగా ఉండే రోజుల్లో రోజుకు మూడుసార్లు మాత్రమే స్పర్శ దర్శనం ఉంటుందని చెప్పారు. ఆగస్టు 15 నుంచి 18 వరకు స్పర్శ దర్శనం పూర్తిగా నిలిపివేస్తామని ప్రకటించారు. ఈ నాలుగు రోజులు శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంటుంది.



మిగిలిన రోజుల్లో రోజుకు మూడు విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతి కల్పిస్తారు.

ఉచిత వరలక్ష్మీ వ్రతాలు



భక్తుల సౌకర్యార్థం ప్రతి ఏడాది లాగా ఈ సంవత్సరం కూడా రెండు విడతలుగా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు.


Recent Posts
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర  | Complete History & Divine Miracles, how to reach, AP shaktipeethas
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర |...
పంచ మాధవ క్షేత్రాల రహస్యం  |  విష్ణువు కొలువైన 5 మహాక్షేత్రాలు  | Hidden Secrets of Pancha Madhava Temples  |  how to reach panchamadhava 5 Vishnu temples
పంచ మాధవ క్షేత్రాల రహస్యం |...
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది  |  బ్రిటిష్ వారు ఇందులో ఏం దాచారు  | orissa Konark temple dark secrets, history & mystery
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది ...
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 20 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం ...
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 19 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం ...