తిరుమల సమాచారం, ఎస్వీ గోసంరక్షణశాలలో గోకులాష్టమి వేడుకలు, విఖనస మహర్షి జయంతి, దర్శనాలు | TTD news, TTD latest updates

Vijaya Lakshmi

Published on Aug 11 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

టిటిడి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఆగష్టు 16వ తేదీన గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా గోసంరక్షణశాలలో గోపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు.

గోకుల నందనుడు, బృందావన విహారి, అయిన శ్రీకృష్ణ భగవానుని జన్మదిన మహోత్సవాన్ని గోకులాష్టమిగా నిర్వహించడం హిందూ సంప్రదాయం. సనాతన హిందూ ధర్మ ప్రచారమే ప్రధాన లక్ష్యంగా స్వీకరించిన టిటిడి హిందువుల అతిముఖ్యమైన పండుగలలో ఒకటైన జన్మాష్టమి వేడుకలను తిరుపతిలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నతు టి టి డి ఒక ప్రకటనలో తెలిపింది.

గోలోకాన్ని తలపించే ఏర్పాట్లు

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చేపట్టబోతున్న కార్యక్రమాలను ఒక కార్యక్రమంలో మీడియాకు వెల్లడించింది టిటిడి. టిటిడి తెలిపిన వివరాల ప్రకారం సాక్షాత్తు శ్రీ కృష్ణగోలోకాన్ని తలపించే విధంగా టిటిడి శ్రీవేంకటేశ్వర గోశాలలో ఏర్పాట్లను చేయనుంది. భారీగా పందిళ్ళు, మామిడితోరణాలు, పూమాలలతో, ముత్యాల రంగవల్లికలతో అలంకారాలు చేసి, గోశాలలోని గోసంపదను అందంగా అలంకరించి భూలోక గోకులంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.



గోశాలకు విచ్చేసే భక్తులు గోశాలలో స్వయంగా పశువులకు బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని తినిపించే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంది. హైందవ ధర్మంలో గోవును ”గోమాత”గా వ్యవహరిస్తూ అత్యంత ఉత్కృష్టమైన స్థానంలో నిలిపి ముక్కోటి దేవతలకు ప్రతీకగా గోవును కొలుస్తారు. అటువంటి గోవుకు మేతదానం చేస్తే మహాపుణ్యఫలమని భక్తుల భావన, నమ్మకం.

గోకులాష్టమి సందర్భంగా ఎస్వీ గోసంరక్షణశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 5 నుండి 10.30 గంటల వేణుగానం, తిరుమల వేదపాఠశాల విద్యార్థులచే వేదపారాయణం, టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజనలు, కోలాటాలు నిర్వహిస్తారు.



ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాలస్వామి హారతి నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రీ వేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు. సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో హరికథ కార్యక్రమం నిర్వహించనున్నారు.

శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

ఇక నిన్న తిరుమలలో జరిగిన కార్యక్రమాల విషయానికి వస్తే, తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం నుండి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు, నిన్న ఆదివారం ఉత్త‌ర మాడవీధిలో కొలువైన  శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి వేంచేపు చేశారు. శ్రీవిఖ‌న‌స మ‌హ‌ర్షి జ‌యంతి శ్రావణ పౌర్ణమి నాడు జ‌రిగింది. ఆ మ‌రుస‌టి రోజు స్వామి, అమ్మ‌వార్లు శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి వేంచేపు చేయ‌డం తిరుమలలో ఆన‌వాయితీగా వ‌స్తోంది.

వైఖానస ఆగమం

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో నిత్య‌కైంక‌ర్యాలు, సేవ‌లు, ఉత్స‌వాలు అన్నీ వైఖాన‌స ఆగ‌మం ప్ర‌కారం జ‌రుగుతాయి. ఈ వైఖాన‌స ఆగ‌మ‌శాస్త్రాన్ని శ్రీ విఖ‌న‌స మ‌హ‌ర్షి ర‌చించారు. అందుకే తిరుమలలో విఖనస మహర్షికి ప్రముఖ స్థానం.

సాయంత్రం స‌హ‌స్ర‌దీపాలంకార సేవ అనంత‌రం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి వేంచేపు చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఆస్థానం నిర్వ‌హించి నివేద‌న చేప‌ట్టారు.

దర్శన వివరాలు

ఇక నిన్న ఆదివారం 82,628 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 30,505 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 3.73 కోట్ల హుండీ కానుకలు సమర్పించారు.

పూరీ జగన్నాథ స్వామి గురించి ఇవి విన్నారా!?


youtube play button



youtube play button



Recent Posts
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర  | Complete History & Divine Miracles, how to reach, AP shaktipeethas
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర |...
పంచ మాధవ క్షేత్రాల రహస్యం  |  విష్ణువు కొలువైన 5 మహాక్షేత్రాలు  | Hidden Secrets of Pancha Madhava Temples  |  how to reach panchamadhava 5 Vishnu temples
పంచ మాధవ క్షేత్రాల రహస్యం |...
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది  |  బ్రిటిష్ వారు ఇందులో ఏం దాచారు  | orissa Konark temple dark secrets, history & mystery
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది ...
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 20 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం ...
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 19 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం ...