విజయవాడ దుర్గ గుడి దసరా ఉత్సవాల షెడ్యూల్ విడుదల, అలంకరణల తేదీలు వివరాలు | Vijayawada Durga Temple Dussehra festival schedule released, decoration dates details

Vijaya Lakshmi

Published on Jul 28 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

దసరా అంటే అందరి కళ్ళముందు మెదిలేది మహిషాసుర మర్ధిని దుర్గాదేవి. దుర్గాదేవి అంటే తెలుగు ప్రజలకు గుర్తొచ్చేది విజయవాడ. బెజవాడ దుర్గమ్మ. దసరా పండుగకు విజయవాడ దుర్గమ్మ వైభవం, ఉత్సవాలు చూడడానికి రెండు కన్నులు చాలవు. చూసి తీరవలసిందే తప్ప మాటలతో చెప్పలేం.


భక్తుల గుండెల్లో కొలువైన కనకదుర్గమ్మ దసరా ఉత్సవాల తేదీలు ప్రకటించారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని విజయవాడ దుర్గగుడి EO శీనా నాయక పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో 2025 దసరా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను దుర్గ గుడి ఈవో శీనా నాయక్ ఆవిష్కరించారు. అమ్మవారి అలంకారాలకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి వైదిక సభ్యులు కూడా పాల్గొన్నారు.



youtube play button

సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు


ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరుపుతున్నట్టు తెలిపారు. ఈ ఏడాది 11 రోజుల పాటు దసరా మహోత్సవాలు జరుగుతాయని, ప్రతి రోజు సాయంత్రం విజయవాడ నగరోత్సవాలు కూడా జరుగుతాయని తెలిపారు.


మూలా నక్షత్రం రోజు అంటే సెప్టెంబర్ 29 వ తేదీ సోమవారం నాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారనీ, అక్టోబర్ 2 వ తేదీ గురువారం విజయదశమి రోజున ఉదయం మహా పూర్ణాహుతి, సాయంత్రం కృష్ణా నదిలో తెప్పోత్సవం కార్యక్రమం జరుగుతుందనీ వివరించారు.

సామాన్యులకు పెద్దపీట వేస్తూ అందరికీ దుర్గమ్మ దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంటామన్న ఈవో ఈ ఏడాది దుర్గ గుడి ఉత్సవాల నిర్వహణ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు చెప్పారు.

youtube play button


అమ్మవారి అలంకారాలు


సెప్టెంబర్ 22వ తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారం 

23వ తేదీ శ్రీ గాయత్రి దేవి అలకారం 

24వ తేదీ శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం 

25 వ తేదీ శ్రీ కాత్యాయిని దేవి అలంకారం 

26 వ తేదీ శ్రీ మహా లక్ష్మీ దేవి అలంకారం

27 వ తేదీ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం 

28 వ తేదీ శ్రీమహా చండీ దేవి అలంకారం 

29 తేదీ శ్రీ మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతి దేవి అలంకారం 

30 వ తేదీ శ్రీ దుర్గా దేవి అలంకారం 

1వ తేదీ శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం 

2 వ తేదీ విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం

ఇలా 11 రోజులు 11 దివ్య అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు


youtube play button



ఇవి కూడా చదవండి








Recent Posts