సైన్స్ ని సవాలు చేసే భారతదేశంలోని 5 అద్భుత దేవాలయాలు | Most Mysterious Temples in India

Vijaya Lakshmi

Published on Jan 25 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

పరిచయం (Introduction)

సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా, ఇప్పటికీ సమాధానం చెప్పలేని ఎన్నో అద్భుతాలు మన భారతదేశంలో ఉన్నాయి. అవి ముఖ్యంగా పురాతన దేవాలయాల రూపంలో మన ముందుకు వస్తాయి.

ఈ ఆలయాలలో

శాస్త్రానికి అందని రహస్యాలు

నమ్మశక్యం కాని అద్భుతాలు

భక్తి, భయం, విశ్వాసం కలిసిన అనుభూతులు అడుగడుగునా కనిపిస్తాయి.

ఈ వ్యాసంలో మనం తెలుసుకోబోయేది

👉 భారతదేశంలోని 5 Most Mysterious Temples

ఈ ఆలయాల రహస్యాలను ఇప్పటివరకు ఎన్నో పరిశోధనలు చేసినా… వాటి అసలు సత్యం మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.


🔥 జ్వాలా దేవి ఆలయం – ఎప్పటికీ ఆరని అగ్ని రహస్యం

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలా దేవి ఆలయం భారతదేశంలోని అత్యంత రహస్యమైన శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయం సతీదేవి యొక్క 51 శక్తిపీఠాలలో ఒకటి అని విశ్వసిస్తారు.

🔥 ఆలయ ప్రత్యేకత

సైన్స్ ని సవాలు చేసే అద్భుతాలు మన భారతదేశంలోని ఆలయాల సొంతం. ఆ ఆలయాల నిండా అడుగడుగునా ఎన్నో వింతలూ, అద్భుతాలు, రహస్యాలు, ఒళ్ళు గగుర్పొడిచే మిస్టరీలు.  ఆ ఆలయ మిస్టరీలు చేధించడానికి ఎన్నో పరిశోధనలు జరిగినా వాటి రహస్యాలు మాత్రం మిస్టరీగానే మిగిలిపోయాయి. 


హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలా దేవి ఆలయం. ఈ ఆలయంలో సైన్స్ కి అందని ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. ఇది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన, రహస్యమైన శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయం సతీదేవి యొక్క 51 శక్తిపీఠాలలో ఒకటైన జ్వాలా దేవికి అంకితం చేయబడింది.



శతాబ్దాలుగా వీడని మిస్టరీ

శతాబ్దాలుగా ఎటువంటి ఇంధనం లేకుండానే సహజంగా ఇక్కడ ఒక జ్వాలా అలా ఎగసిపడుతూనే ఉంటుంది. ఈ జ్వాల ఎప్పటికీ ఆరదు. ఇలా ఒకటి కాదు తొమ్మిది జ్వాలలు ఆలయంలో మండుతూనే ఉంటాయి. ఐతే ఎందుకు ఇలా జ్వాలలు ఎలా ఎగసిపడతాయో సైంటిస్టులు కూడా కనుక్కోలేకపోయారు. ఈ ఆలయాన్ని రాజు భూమ్ చంద్ నిర్మించాడు. భూమిచంద్  అమ్మవారి ఆజ్ఞ మేరకు  ఈ ఆలయాన్ని సంప్రదాయ శైలిలో నిర్మించారు. ఆలయ గర్భగుడిలో తొమ్మిది జ్వాలలు నిరంతరం మండుతూనే ఉన్నాయి. గర్భగుడి పైన ఒక అందమైన బంగారు గోపురం ఉంది. చుట్టుపక్కల ప్రశాంతమైన వాతావరణం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.


🔬 సైన్స్ ఏమంటోంది?

భౌగోళిక శాస్త్రవేత్తల ప్రకారం ఈ మంటలకు కారణం సహజ వాయువు (Natural Gas) అని అంటారు. కానీ,


👑 అక్బర్ చేసిన ప్రయత్నం

మొఘల్ చక్రవర్తి అక్బర్ అమ్మవారి శక్తిని పరీక్షించడానికి ఆలయ జ్యోతిని ఆర్పడానికి ప్రయత్నించాడు. మండుతున్న మంటలపై నీళ్లు పోసినా మంటలు ఆరిపోలేదు. ఈ మహిమకు  ముగ్ధుడైన అక్బర్ ఆలయానికి బంగారు గొడుగును బహూకరించాడని చెబుతారు. జ్వాలా దేవి ఆలయం కేవలం మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం మాత్రమే కాదు, ఇది భక్తుల విశ్వాసం , నమ్మకానికి చిహ్నం. సహజసిద్ధమైన వెలుగుతో , పవిత్ర వాతావరణం కారణంగా ఇది ఒక ప్రత్యేకమైన పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. జ్వాలా దేవి ఆలయం యొక్క రహస్యం, అద్భుతం, పవిత్రత హిమాచల్ ప్రదేశ్ కె కాదు భారతదేశం అంతటా విస్తరించి ఇదొక ప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా మారింది. ఇది ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమె కాదు ప్రత్యేకమైన ప్రకృతి తీర్చిన అద్భుతం కూడా.


లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం – గాల్లో వేలాడే స్తంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాలోని లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం. భారతదేశపు శిల్పకళా వైభవానికి గొప్ప ఉదాహరణ.

🛕 ఆలయ చరిత్ర

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోని  లేపాక్షిలో ఉన్న  శ్రీ వీరభద్ర స్వామి ఆలయం. ఇది భారతదేశంలోని అత్యంత విశిష్టమైన , చారిత్రాత్మక దేవాలయాలలో ఒకటి. అద్భుతమైన వాస్తుశిల్పం, ఎన్నో రాతి శిల్పాలతో రహస్య స్తంభాలతో ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ దేవాలయాలు భారతీయ శిల్పకళా నైపుణ్యానికి పెట్టింది పేరు. ఈ ఆలయం శివుని భీకర రూపమైన వీరభద్రుడికి అంకితం చేయబడింది .


🛕 ఆలయ నిర్మాణం

ఇది 16వ శతాబ్దంలో నిర్మించబడింది. విజయనగర సామ్రాజ్యానికి చెందిన ఇద్దరు పాలకులు వీరప్పన్న, వీరన్న నిర్మించారు. కళా పోషకుడిగా ప్రసిద్ధి చెందినా కృష్ణ దేవరాయల కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయంలో శివుని కోపానికి మరో రూపమైన వీరభద్రుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ ఆలయంలో శివుడు, పార్వతి దేవి, ఇతర దేవతల భారీ  విగ్రహాలు కనిపిస్తాయి . వీరభద్రుని విగ్రహం అతని శక్తివంతమైన భంగిమను వర్ణిస్తూ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద నాగలింగం ఉంది, ఇది ఒకే రాయితో నిర్మించబడింది. శివలింగం పైన ఉన్న పాము యొక్క పడగా ఆకారం అత్యంత విశిష్టంగా ఉంటుంది.

సతీదేవికి పుట్టినింట్లో జరిగిన అవమానానికి, కోపంతో వీరభద్రుని రూపం దాల్చిన శివుని శక్తికి, కోపానికి ఈ ప్రదేశం చిహ్నంగా మారింది.


👉 భారతదేశంలోనే అతి పెద్ద నంది

ఆలయం సమీపంలోనే  భారీ నంది విగ్రహం కనిపిస్తుంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద నంది విగ్రహాలలో ఒకటి.


🪨 వేలాడే స్తంభం మిస్టరీ

ఈ ఆలయంలో మొత్తం 70 స్తంభాలు ఉన్నాయి. అయితే 👉 ఒక స్తంభం మాత్రం భూమిని తాకకుండా గాల్లో వేలాడుతూ ఉంటుంది. ఈ స్తంభం కింద ఒక పలుచని గుడ్డను కూడా సులభంగా తీసుకెళ్లవచ్చు. స్తంభం భూమిని తాకదు. గాలిలో వేలాడుతున్నత్తుగా ఉంటుంది. దీనిని వేలాడే స్తంభం అని పిలుస్తారు. ఇది శిల్పకళలో ఒక రహస్య అద్భుతంగా కనిపిస్తుంది.


🧠 శాస్త్రవేత్తల అభిప్రాయం



🛕 లేపాక్షి ఆలయం

భారతీయ శిల్పకళ సైన్స్‌కు గొప్ప నిదర్శనం. చాలా మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు దీనికి గల కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు, కాని ఇది నేటికీ రహస్యంగానే ఉండిపోయింది.


🧠 జటాయువుకు మోక్షం ఇచ్చిన ప్రదేశం

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఆలయంలో ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ రోజున వీరభద్రుడిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు వస్తారు. రావణుడితో యుద్ధంలో గాయపడిన జటాయువుకు శ్రీరాముడు ఇక్కడే  మోక్షం ప్రసాదించడంతో ఈ ప్రదేశం పవిత్రమైన ప్రదేశంగా మారింది.


భారతీయ శిల్పుల పరిజ్ఞానం

69 స్తంభాలు పైకప్పు భారాన్ని మోస్తూ.. ఒక్క స్తంభాన్ని గాల్లో తేలేలా చేయడం అనేది ఆనాటి శిల్పుల సైన్స్ పరిజ్ఞానానికి గొప్ప ఉదాహరణగా నిలబడుతుంది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏర్పడే ప్రకంపనల వల్ల మండపానికి నష్టం జరగకుండా ఒక స్తంభాన్ని బ్యాలెన్స్ గా ఉంచడానికి ఈ పిల్లర్ ని ఇలా గాల్లో ఉండేలా నిర్మించి ఉంటారని చాలా మంది భావిస్తున్నారు. అయితే ఈ స్తంభాన్ని గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని వ్యతిరేకంగా ఉపయోగించి ఈ స్తంభాన్ని నిర్మించినట్లు కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


🛕 కాల భైరవ ఆలయం – మద్యం తాగే దేవుడు

⚔️ కాల భైరవుడు ఎవరు?

కాల భైరవుడు శివుని ఉగ్ర రూపం. 👉 కాలానికి, మరణానికి అధిపతి. ఈ నగరానికి రక్షకుడిగా పూజించబడతాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఉజ్జయినిలో ఉన్న కాల భైరవ ఆలయం. భారతదేశంలోని అత్యంత విచిత్రమైన ఆలయాలలో ఒకటి. భారతదేశంలో కాల భైరవ ఆలయం ఉజ్జయిని నగరంలో క్షిప్రా నది ఒడ్డున ఉంది. హిందూ మతం యొక్క అత్యంత పవిత్రమైన, రహస్యమైన ఆలయాలలో ఒకటైన ఈ ఆలయం భైరవుడు యొక్క భయంకరమైన, శక్తివంతమైన రూపం కాలభైరవుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని పురాతన కాలంలో భద్రసేన రాజు నిర్మించాడని చెప్తారు. హిందూ మతంలోని 18 ప్రధాన పురాణాలలో ఒకటైన స్కంద పురాణంలో దీని గురించిన ప్రస్తావన ఉంటుంది. ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో మరాఠా జనరల్ మహాదాజీ షిండే పునరుద్ధరించారు, ఆలయం సమీపంలోని నదిపై ఒక ఘాట్ కూడా నిర్మించారు.

ఇతిహాసం ప్రకారం బ్రహ్మదేవుడు శివుడిని అవమానించినప్పుడు, శివుడు తన భీకర రూపాన్ని కాలభైరవుడిని సృష్టించాడు. కాలభైరవుడు తన అహంకారాన్ని అంతమొందించడానికి బ్రహ్మదేవుని ఐదు తలలలో ఒకదాన్ని నరికేశాడు అంటారు. ఇక కాల భైరవుడు ఈ నగరానికి రక్షకుడిగా భావిస్తారు. కాలభైరవుడు కాలానికి, మరణానికి అధిపతిగా పూజించబడే శివుని ప్రధాన విగ్రహాలలో ఒకటి. తాంత్రిక ఆచారాలు, అఘోర సాధనలో ఆయనను పూజిస్తారు.

❓ మిస్టరీ ప్రశ్న

కాల భైరవ ఆలయం ప్రత్యేక సంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్వామికి భక్తులు మద్యం సమర్పిస్తారు. అది నెమ్మదిగా విగ్రహం యొక్క పెదవుల నుండి లోపలి వెళ్లి మాయమవుతుంది. అది ఎటు వెళుతుంది అనేది ఎవరికీ అర్ధం కానీ విషయమ్. ఈ అద్భుతం గురించి ఇప్పటికీ శాస్త్రవేత్తలకు మిస్టరీగానే మిగిలిపోయింది. ప్రతిరోజు భారీ సంఖ్యలో ఈ దృశ్యాన్ని చూడడానికి ఆలయానికి చేరుకుంటారు. ప్రతిరోజూ వందలాది మంది భక్తులు దేవతకు మద్యం సమర్పిస్తారు. బాటిల్‌లో దాదాపు మూడింట ఒక వంతు భక్తుడికి ప్రసాదంగా తిరిగి ఇవ్వబడుతుంది .భైరవ్ బాబాకు నైవేద్యాలలో నల్ల నువ్వులు, కొబ్బరికాయలు, మద్యం మరియు జిలేబీ వంటి స్వీట్లు కూడా సమర్పిస్తారు.



భయాన్ని, శత్రువులను పోగొట్టే ఆలయం

 కాలభైరవుడిని పూజించడం వల్ల భయం, ప్రతికూల శక్తులు, శత్రువులు నశిస్తాయని నమ్ముతారు. న్యాయం. శాంతి, సౌభాగ్యం కోసం కాలభైరవుడిని పూజిస్తారు. కాల భైరవ్ ఆలయం భారతీయ సంస్కృతి, పురాణాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చిహ్నం. దీని ప్రత్యేకమైన పూజావిధానం, విశిష్టమైన వాస్తుశిల్పం ప్రతి భక్తుడికి, పర్యాటకుడికి మరచిపోలేని అనుభూతిని కలిగిస్తాయి. ఈ ఆలయం ఆధ్యాత్మికత, రహస్యం, భక్తి యొక్క అద్భుతమైన సంగమం.


🛕 వైద్యనాథ్ ధామ్ – వంగిన జ్యోతిర్లింగం రహస్యం

జార్ఖండ్ రాష్ట్రం, దియోఘర్ జిల్లాలో ఉన్న వైద్యనాథ్ ధామ్ శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి.

🕉️ ప్రత్యేకత

ఇక్కడి శివలింగం 👉 కొద్దిగా వంగి ఉంటుంది. ఇది మిగతా జ్యోతిర్లింగాలకు పూర్తిగా భిన్నం.


📜 పురాణ కథ

ఇదొక రహస్య శివాలయం, వైద్యనాథ్ ధామ్ హిందూ మతంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటి. శివుని 12 జ్యోతిర్లింగాలలో ఉన్న ఈ ఆలయం జార్ఖండ్ లోని దియోఘర్ జిల్లాలో ఉంది. పురాణాలలో ఈ ఆలయ చరిత్ర కనిపిస్తుంది. శివ పురాణం, లింగ పురాణం, స్కంద పురాణం వంటి పురాతన హిందూ గ్రంథాలలో వైద్యనాథ్ ధామ్ ప్రస్తావన ఉంది.


🛕 ఆలయ నిర్మాణం

ఈ ఆలయం ఎంత పురాతనమైనదో  ఖచ్చితంగా నిర్ణయించడం కష్టం, కానీ ఇది వేద కాలం నుండి పూజించబడుతుందని నమ్ముతారు. ప్రస్తుత ఆలయ నిర్మాణాన్ని పదవ శతాబ్దంలో నాగవంశీ రాజులు నిర్మించారు. ఆలయ నిర్మాణ శైలి, శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ ఖ్యాతిని విన్న మొఘల్ చక్రవర్తి అక్బర్ దీనికి బంగారు ఛత్రిని కానుకగా ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది. బ్రిటీష్ పాలనలో కూడా ఈ ఆలయం హిందూ యాత్రికులకు ఒక ముఖ్యమైన ప్రదేశంగా ఉంటుంది.

📜 పురాణాలలో

పురాణ కథనం ప్రకారం  బాబా బైద్యనాథ్ లోని శక్తి పీఠం శివుని భార్య సతి పురాణంతో ముడిపడి ఉంది. ఆమె ఆత్మాహుతి చేసుకున్న తర్వాత, శివుడు బాధతో ఆమె శరీరాన్ని భూమి అంతటా మోసుకెళుతూ ఉంటాడు . ఆమె శరీర భాగాలు పడిపోయిన ప్రతి ప్రదేశంలో, ఒక శక్తి పీఠం ఉద్భవించింది. దేవఘర్‌లో, సతి హృదయం పడిపోయిందని నమ్ముతారు, దీనితో అది హృదయ పీఠం అని హృదయ మందిరం అని పిలుస్తారు. ఇక్కడి శక్తి పీఠం పార్వతి దేవి యొక్క అవతారమైన జయ దుర్గకు అంకితం చేయబడింది. సతీదేవిని శారీరక బాధల నుండి విముక్తులను చేయడానికి శివుడు ఇక్కడ వైద్యుడిగా వ్యవహరించాడని చెబుతారు. అందువలన దీనిని వైద్యనాథ్ అని పిలుస్తారు, శక్తి పీఠంగా కూడా భావిస్తారు. వైద్యనాథ్ ధామ్ లోని జ్యోతిర్ లింగాన్ని నల్లరాతితో నిర్మించారు. ఈ శివలింగం కొద్దిగా వంగి ఉంటుంది, ఇది దీని ప్రత్యేక లక్షణం. మిగతా జ్యోతిర్లింగాల కంటే భిన్నంగా ఉంటుంది. గర్భగుడి చుట్టూ చిన్న చిన్న మందిరాలతో నాగర శైలిలో ఈ ఆలయం నిర్మించబడింది. ఇక్కడ మొత్తం 22 దేవాలయాలు ఉన్నాయి, ఇవి వివిధ దేవుళ్ళు, దేవతలకు అంకితం చేయబడ్డాయి.


📜  భిన్నమైన పూజా విధానం

ఈ ఆలయంలో పూజించే విధానం ఇతర జ్యోతిర్లింగాలకు భిన్నంగా ఉంటుంది. ఇక్కడ శివలింగాన్ని దక్షిణ దిశలో పూజిస్తారు. ఇక్కడ పూజలు చేస్తే సకల పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. శివుని దర్శనంతో జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి. ఈ ఆలయంలోని శివలింగాన్ని పూజిస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. శివుడితో పాటు పార్వతీ దేవి ఆశీస్సులు పొందడానికి ఈ ప్రదేశం అనువైనదిగా భావిస్తారు. వైద్యనాథ్ ధామ్ శివుని పవిత్ర జ్యోతిర్లింగం మాత్రమే కాదు. ఇది భారతదేశ పౌరాణిక, మత , సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం. ఆధ్యాత్మిక శాంతి, శివుని ఆశీస్సులు పొందాలంటే ఖచ్చితంగా వైద్యనాథ్ ధామ్ ను సందర్సించాలి.


🛕 యమధర్మ రాజు ఆలయం – మరణానంతర న్యాయ స్థలం

హిమాచల్ ప్రదేశ్‌లోని భర్మౌర్ ప్రాంతంలో ఉన్న యమధర్మ రాజు ఆలయం. భారతదేశంలోనే అత్యంత అరుదైన ఆలయం.

⚖️ ఆలయ విశిష్టత

యమధర్మ రాజు ఆలయం.. భారతదేశంలోనే ప్రత్యేకమైన, అరుదైన ఆలయం, ఇది యమరాజుకు అంకితం చేయబడింది. ఈ ఆలయం మత విశ్వాసానికి మాత్రమే కాదు, కర్మ, న్యాయానికి కూడా కేంద్రంగా ఉండే ఆలయం . మరణానంతర జీవితంతో ముడిపడి ఉన్న లోతైన తాత్విక భావాలకు చిహ్నంగా ఈ ఆలయం నిలుస్తుంది. ఈ ఆలయం ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలోని భర్మౌర్ ప్రాంతంలో ఉంది. భారతదేశంలో యమరాజు యొక్క ఏకైక ఆలయంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం హిమాచలం యొక్క పురాతన సంప్రదాయాలపై ఆధారపడి ఉంటుంది. ఇది మత విశ్వాసానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. 



⚖️ యమలోకానికి ప్రవేశ ద్వారం

మరణం గురించి, మరణానంతర జీవితం గురించి తెలుసుకునే ప్రదేశాలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం యమలోకానికి ప్రవేశ ద్వారం అని, ఇక్కడ ప్రతి ఆత్మ న్యాయం కోసం యమరాజు ముందు హాజరుకావాల్సి ఉంటుందని నమ్ముతారు. స్థానిక విశ్వాసం ప్రకారం, భర్మౌర్లో ఉన్న ఈ ప్రదేశం యమరాజు నివాసంగా పరిగణించబడుతుంది. హిందూ మాట విశ్వాసాల ప్రకారం ఏదైనా జీవి మరణించిన తర్వాత.. ఆ  ఆత్మను చిత్రగుప్తుని ముందు ఉంచుతారు. ఆత్మ మంచి, చెడు పనులన్నీ ఇక్కడ లెక్కించబడతాయి. చిత్రగుప్తుని రహస్య గదికి ఎదురుగా ధర్మరాజు ఆస్థానం అని పిలువబడే మరొక గది ఉంది. ఈ గదిలోకే ఆత్మను తీసుకుని వెళ్లారట. అక్కడ జీవి ఆత్మ తదుపరి ఎక్కడ ప్రయాణించాలనే నిర్ణయం తీసుకోబడుతుందట. ఈ నమ్మకం కారణంగా ప్రజలు ఈ ఆలయానికి వెళ్ళడానికి కొంచెం భయపడతారు.


రహస్య గది

పురాతన కాలం నుంచి ఈ ఆలయంలో శివలింగం ఉందని, చిత్రగుప్తుని గదిగా పరిగణించబడే ఆలయంలో ఒక రహస్యమైన గది కూడా ఉందని స్థానికులు చెబుతారు. మత విశ్వాసాల ప్రకారం చిత్రగుప్తుడు ఇక్కడ నుంచే వ్యక్తులు చేసే పనులను గమనిస్తూ ఉంటాడట. యమధర్మ రాజు ఆలయం సాంప్రదాయ హిమాచల వాస్తుశిల్పానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇది చెక్క, రాళ్లతో తయారు చేయబడిన అద్భుతమైన ఆలయం. గర్భ గుడిలో యమధర్మ రాజు విగ్రహాన్ని సాంప్రదాయ రూపంలో కనిపిస్తుంది.   సత్యం, అహింస, న్యాయం, ధర్మం అనే నాలుగు దిక్కులు, నాలుగు స్తంభాలకు ప్రతీకగా ఈ ఆలయం రూపుదిద్దుకుంది. ఈ ఆలయంలో చిత్రగుప్తుడి విగ్రహం కూడా ఉంది. ప్రతి జీవి యొక్క మంచి చెడుల గురించి లెక్కలు వేస్తూ కనిపిస్తాడు. ముఖ్యంగా అకాల మరణం పొందిన ఆత్మల కోసం ఇక్కడ ప్రార్థనలు చేస్తారు. ప్రజలు ఇక్కడికి వచ్చి తమ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తారు. ఆలయంలోకి ప్రవేశించగానే ప్రత్యేక ప్రశాంతత, ఆధ్యాత్మికత కలుగుతుందని భక్తులు చెబుతుంటారు. ఆలయం యొక్క వాతావరణం చాలా ప్రశాంతంగా , గంభీరంగా ఉంటుంది, ఇది భక్తులు ఆత్మపరిశీలన చేసుకోవడానికి , వారి చర్యల గురించి ఆలోచించడానికి ప్రేరేపిస్తుంది. యమధర్మ రాజు ఆలయం మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు..ఇది హిందూ మతం యొక్క లోతైన తాత్విక ఆలోచనలకు చిహ్నం కూడా . మన కర్మ ఈ జన్మలోనే కాదు మరణానంతరం కూడా ప్రభావం చూపుతుందని ఈ ఆలయం మనకు బోధిస్తుంది. ప్రశాంతమైన, రహస్యమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది.


అన్నా చెల్లెళ్ళ పండుగ

ఇక ఇక్కడ అన్నాచెల్లెళ్ల పండగ బాగా జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అన్నాచెల్లెళ్ల పండుగ యమధర్మ రాజుకి సంబంధించినది. చాలా కాలం తర్వాత తన సోదరి యమునదేవి ఇంటికి యముడు వెళ్తాడని నమ్మకం. అప్పుడు యమున దేవి సంతోషంతో తన సోదరుడు యమధర్మ రాజును ప్రతి సంవత్సరం తన ఇంటికి తన రావాలనే వరం కోరింది. అందుకనే అన్నాచెల్లెళ్ల పండగ రోజున ప్రతి అన్న తమసోదరి ఇంటికీ వెళ్లి భోజనం చేస్తాడు. శక్తి కొలది కనుక ఇస్తాడు అని నమ్ముతారు. ప్రాణాలను హరిస్తాడని నమ్మే యమధర్మరాజుకి ఎంతో భక్తితో ఇక్కడ పూజలు చేస్తారు. ఇలా గుడి ఉండటం ఆశ్చర్యంగా అనిపించినా.. కొన్ని వందల ఏళ్ల నుంచి ఇక్కడ  యముడు పూజలు అందుకుంటున్నాడు.



గండ దీపం

శని గ్రహ దోషాలు, జాతక దోషాలు ఉన్న వారు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. తమ జాతకాలు బాలేవు అని, ఏం చేసిన కలిసి రావట్లేదని, జాతకం ప్రకారం ప్రమాదాలు జరిగే సమయమని అనుకునే వాళ్లు ఇక్కడకు వస్తుంటారు. భక్తులు తమ జీవితాలలో అడ్డంకులు ఏర్పడకుండా ఉండేందుకు యమ ధర్మరాజు కి గండ దీపంలో నూనె పోసి పూజిస్తారు. ఇలా దీపం వెలిగిస్తే గండాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇవి భారతదేశంలోని కొన్ని అద్భుత ఆలయాలు.


Frequently Asked Questions (FAQ)

❓ భారతదేశంలో అత్యంత మిస్టరీ ఆలయాలు ఏవి?

జవాబు:

భారతదేశంలో జ్వాలా దేవి ఆలయం, లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం, కాల భైరవ ఆలయం, వైద్యనాథ్ ధామ్, యమధర్మ రాజు ఆలయం వంటి ఆలయాలు అత్యంత మిస్టరీగా ప్రసిద్ధి చెందాయి.


❓ జ్వాలా దేవి ఆలయంలో మంటలు ఎందుకు ఎప్పుడూ ఆరవు?

జవాబు:

జ్వాలా దేవి ఆలయంలో సహజంగా వెలువడే అగ్ని జ్వాలలు ఇంధనం లేకుండానే మండుతుంటాయి. శాస్త్రవేత్తలు సహజ వాయువు కారణమని చెబుతున్నా, మంటలు ఎప్పటికీ ఆరని విషయం ఇప్పటికీ పూర్తిగా రుజువు కాలేదు.

❓ లేపాక్షి ఆలయంలో వేలాడే స్తంభం నిజమేనా?

జవాబు:

అవును. లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయంలో ఒక స్తంభం భూమిని తాకకుండా గాల్లో వేలాడుతూ ఉంటుంది. ఈ స్తంభం కింద పలుచని గుడ్డను కూడా తీసుకెళ్లవచ్చు, ఇది భారతీయ శిల్పకళలో ఒక గొప్ప మిస్టరీ.

❓ కాల భైరవ ఆలయంలో దేవుడు నిజంగా మద్యం తాగుతాడా?

జవాబు:

కాల భైరవ ఆలయంలో భక్తులు సమర్పించిన మద్యం విగ్రహం పెదవుల దగ్గర పెట్టగానే నెమ్మదిగా మాయమవుతుంది. ఇది భక్తుల విశ్వాసం ప్రకారం దేవుడు స్వీకరిస్తాడని నమ్ముతారు, అయితే శాస్త్రీయ వివరణ ఇంకా స్పష్టంగా లేదు.

❓ వైద్యనాథ్ ధామ్ లోని శివలింగం ఎందుకు వంగి ఉంటుంది?

జవాబు:

వైద్యనాథ్ ధామ్ లోని జ్యోతిర్లింగం కొద్దిగా వంగి ఉండటం ప్రత్యేక లక్షణం. ఇది పురాణాల ప్రకారం శివుని వైద్య రూపాన్ని సూచిస్తుందని నమ్మకం ఉన్నప్పటికీ, దానికి ఖచ్చితమైన శాస్త్రీయ కారణం తెలియదు.

❓ యమధర్మ రాజు ఆలయం ఎందుకు భయంకరంగా భావిస్తారు?

జవాబు:

యమధర్మ రాజు ఆలయం మరణం, కర్మ, న్యాయం వంటి భావనలతో అనుసంధానించబడింది. ఇది యమలోక ప్రవేశ ద్వారం అని స్థానిక విశ్వాసం ఉండటంతో చాలా మంది భక్తులు భయం మరియు భక్తితో ఈ ఆలయాన్ని దర్శిస్తారు.

❓ ఈ మిస్టరీ ఆలయాలు దర్శించడానికి సురక్షితమేనా?

జవాబు:

అవును. ఈ ఆలయాలు సాధారణ భక్తులకు పూర్తిగా సురక్షితమైనవి. భయం అనేది విశ్వాసం మరియు కథల వల్ల ఏర్పడే భావన మాత్రమే.

❓ ఈ ఆలయాలు సైన్స్‌ను నిజంగా సవాల్ చేస్తున్నాయా?

జవాబు:

ఈ ఆలయాల్లో జరిగే కొన్ని ఘటనలకు ఇప్పటికీ పూర్తిస్థాయి శాస్త్రీయ వివరణ లేదు. అందుకే ఇవి సైన్స్‌కు సవాల్ చేస్తున్న అద్భుతాలుగా భావించబడుతున్నాయి.



 

Recent Posts
ఘనంగా ముగిసిన తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు | Srivari Theppotsavam concludes with great success
ఘనంగా ముగిసిన తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు |...
సింహాచలంలో దేవుడు నరసింహస్వామేనా? వరాహ ముఖం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!  | Vizag Simhachalam temple secrets
సింహాచలంలో దేవుడు నరసింహస్వామేనా? వరాహ ముఖం వెనుక...
బద్రినాథ్ ఆలయాలు 5 ఉన్నాయా!?  |  పంచ బద్రి ఆలయాలు  | Uttarakhand Pancha Badri temples Full Guide Telugu
బద్రినాథ్ ఆలయాలు 5 ఉన్నాయా!? |...
తిరుమల మే నెల దర్శన కోటా  వివరాలు | Tirumala darshan tickets quota release
తిరుమల మే నెల దర్శన కోటా ...
మహాశివరాత్రి రోజున ఏం చేయాలి? ఇలా చేస్తే శివానుగ్రహం ఖాయం! | Maha Shivaratri Special Rituals
మహాశివరాత్రి రోజున ఏం చేయాలి? ఇలా చేస్తే...