Vijaya Lakshmi
Published on Sep 06 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?సతీదేవి శిరస్సు పడిన చోటుగా పడిన ప్రదేశం. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూకు 50కి.మీ దూరంలో కాట్రా అనే ప్రదేశంలో ఉంది ప్రాంతం. అక్కడి నుండి గుర్రాల మీద లేదా హేలీకాప్టర్లో కొండపైకి వెళ్ళి జ్వాలాముఖి లేదా వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకోవచ్చు.ఈ ఆలయంలో గుహ ఉంది. మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషా తయారుచేయించి, తన స్వహస్తాలతో మోస్తూ కొండపైకి నడిచి వెళ్ళి అమ్మవారికి సమర్పించిన వెండి గొడుగు నేటికీ ఈ ఆలయంలో ఉంది.
ఆ దేవిని దర్శించినవరెవరూ తమ న్యాయమైన కోరికలు తీరకుండా రిక్త హస్తాలతో వెను తిరగరని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సముద్రమట్టానికి 5200 అడుగుల ఎత్తులో త్రికూట పర్వత గుహలో వెలసిన వైష్ణో దేవి, భక్తులు అడిగే న్యాయమైన కోర్కెలు తీర్చే చల్లని తల్లి.
ఈ ఆలయం ఎన్ని ఏళ్ళు క్రితం వెలిసింది అన్న దానికి ఆధారాలు లేవు. భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం వున్న గుహ ఒక మిలియన్ సంవత్సరాల పూర్వంనుంచి వున్నదని కనుగొన్నారు. ప్రప్రధమంగా పాండవులకాలంలోనే శక్తి పూజలు ప్రారంభం అయినాయనీ, వారే ఈ ప్రాంతంలో దేవీ ఆలయాలు నిర్మించారని ఇంకొక కధనం. జమ్మూలోని పర్వత సానువులలో ఉన్న అమ్మవారి ఆరాధన ఎప్పుడు మొదలైందనేది ఇదమిత్థంగా చెప్పలేము. కానీ పిండీలు అని పిలవబడే మూర్తులు మూడు కొన్ని లక్షల సంవత్సరములుగా అక్కడ ఉన్నాయని భూగోళ శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. త్రికూట పర్వతముగా ఋగ్వేదములో చెప్పబడిన పర్వతసమూహము ఇదేనని కొందరి వాదన. ఋగ్వేదములో ఇక్కడ శక్తి ఆరాధన జరుగుచుండేదని చెప్పబడింది.
కురుపాండవ యుద్ధానికి ముందు శ్రీకృష్ణుని ఆదేశానుసారము అర్జునుడు ఇక్కడ అమ్మవారిని పూజించి ఆమె దీవెనలు తీసుకున్నాడని వ్యాసభారతము చెపుతోంది. స్థలపురాణము ప్రకారము పాండవులు మొదటగా ఇక్కడ దేవాలయ నిర్మాణము చేసినారని తెలుస్తుంది. త్రికూటపర్వతమునకు పక్కన ఐదు రాతి కట్టడములు ఉన్నాయి. వీటిని పంచ పాండవులకు ప్రతీకగా స్థానిక జనము భావిస్తారు.
మధ్యకాలపు చరిత్ర ప్రకారము మొదటగా సిక్కుల గురువైన గురు గోబింద్ సింగ్ పుర్మండాల్ మీదుగా వచ్చి ఈ పవిత్ర గుహను దర్శించినాడని తెలుస్తుంది.
ఇక్కడ సతీదేవి యొక్క శిరస్సు పడిన కారణముగా కొన్ని సంప్రదాయములు శక్తిపీఠాలన్నింటిలోనూ ఈ పీఠమును అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తాయి. కొన్ని సంప్రదాయముల వారు మాత్రము అమ్మవారి కుడిచేయి ఇక్కడ పడిందని భావిస్తారు. హైందవ పవిత్ర పుస్తకముల మూలముగా తెలియవచ్చేది ఏమనగా కష్మీరములో అమ్మవారి కుడిచేయి పడిందని. ఇప్పటికీ మాతా వైష్ణోదేవి ఆలయములో మనిషి కుడి చేయి రూపములోని కొన్ని శిల్పములు లభ్యము కావడము ఈ వాదన సరైనదేననడానికి ఊతమిస్తుంది. ఈ చేతి శిల్పమును అమ్మవారి వరద హస్తముగా భక్తులు గౌరవిస్తారు.
శ్రీధరపండితుడు అనే వ్యక్తి 700 సంవత్సరాలకు పూర్వము ఈ కొండగుహలను కనుగొన్నాడని చెపుతారు. తన ఇంటిలోనున్న పూజా సంపుటములో అమ్మవారి విగ్రహం మాయమవడం చూసిన శ్రీధరపండితుడు అమ్మవారికి కటిక ఉపవాసము చేస్తూ మొరపెట్టుకోగా కలలో దర్శనమిచ్చిన అమ్మవారు తను పర్వత సానువులలో ఉన్నానని దారి చూపించిందని, ఉపవాస దీక్ష మానవలసినదిగా ఆదేశించిందని. ఆమె ఆజ్ఞానుసారము శ్రీధర్ వెతుక్కుంటూ వెళ్ళగా మూడు రాతుల రూపములో అమ్మవారు దర్శనమిచ్చిందని చెపుతారు. ఆ మూడు మూర్తులే మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళీ అవతారములుగా శ్రీధరపండితుడు పూజించినాడని చెపుతారు. తరువాత అమ్మవారి ప్రసాదముగా శ్రీధరపండితునికి నలువురు కుమారులు జన్మించినారని, తరువాత శ్రీధరపండితుడు తన శేష జీవితాన్ని అమ్మవారి సేవలో గడిపినాడని ఒక స్థానిక కథ.
బీహార్ రాష్ట్రంలో పాట్నాకు 75కి.మీ దూరంలో ఉంది గయా క్షేత్ర. సతీదేవి అమ్మవారి వక్షోజాలు ఇక్కడ పడ్డాయని చెబుతారు. ఇక్కడ అమ్మవారు మంగళగౌరిగా కొలువుదీరి ఉంది. ఈ ఆలయానికి దగ్గరలోనే బుద్ధగయ, బోధి వృక్షం, బౌద్ధాలయాలు ఉన్నాయి. గయలో పితృదేవులకు పిండ ప్రధానం చేయాలని ప్రతి హిందువూ కోరుకుంటాడు.
శ్రాద్ధ కర్మలు ఇక్కడే ఎందుకు?
తనను తాకిన ప్రతి జీవికీ మోక్షం వచ్చేలా విష్ణుమూర్తి వరం పొందిన గయాసురుడు పర్వతాకారంలో ఉన్న ప్రాంతమిది. గయాసురుడు శరీరాన్ని విపరీతంగా పెంచి అందరికీ మోక్షాన్ని ఇచ్చే సందర్భంలో, అతని శరీరం పెరగకుండా ధర్మవతశిలను అతని శిరస్సుపై ఉంచి, దాని పైకి విష్ణువును ఆవాహన చేసినట్లు ఒక పురాణగాథ ఉంది. విష్ణుమూర్తి సహోదరి అయిన మాంగల్యగౌరి ఈ క్షేత్రరూపిణి అని పండితులు చెబుతున్నారు. శ్రాద్ధకర్మలు ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి.
సతీదేవి "మణికట్టు" పడిన స్థలం కాశీ పుణ్యక్షేత్రం.శివుని విశిష్ట స్థానంగా కాశిని చెప్తారు. కాశీనే వారణాశి అని కూడా పిలవడం ఉంది. వరుణ, అసి అనే రెండు నదుల సంగమస్థానంగా ఈ ప్రాంతం వారణాసిగా ప్రసిద్ధి చెందింది. గంగాస్నానం, విశ్వేశ్వరుడు, విశాలాక్షి దర్శనం నయనానందకరం. శుభకరం.
శివుని కన్నులు మూసి లోకాన్ని చీకటి చేసిన పాపానికి నల్లగా మారిన గౌరి, అన్నదానపుణ్యంతో తిరిగి బంగారు వర్ణంలోకి మారిన క్షేత్రం కాశి అని ఓ కథనం. వ్యాసునికి కడుపార భోజనం పెట్టిన తల్లి అన్నపూర్ణ తిరుగాడిన క్షేత్రం కాశిగా పురాణాలు చెబుతున్నాయి. హిమాలయాలపై ఉండడం ఇష్టం లేక తన కోసం అమ్మవారు నిర్మించుకున్న పట్టణం కాశి అని చెప్తారు. శివుని వైభవాన్ని విశాల నేత్రాలతో చూసిన తల్లి శక్తిపీఠంగా వెలసినదే విశాలాక్షి పీఠమని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి ఈ పుణ్యస్థలిలో భక్తులను బ్రోచే జగన్మాత విశాలాక్షిగా కొలువైంది.
ఈ శక్తిపీఠంలో విశాలాక్షి గర్భాలయంలో రెండు రూపాలతో దర్శనమిస్తుంది. ఒకరూపం స్వయంభువు. మరొక రూపం అర్చామూర్తి. మనం ఆలయంలోని ప్రవేశించగానే ముందుగా అర్చామూర్తిని, అటు పిమ్మట స్వయంభువును దర్శించుకోవాలి. పసుపు కుంకుమలతో ప్రకాశిస్తూ, పుష్పమాలాంకృతురాలైన ఆమెను మనసారా పూజిస్తే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని విశ్వాసం.
ఆదిదంపతులు స్వయంగా వెలసిన అరుదైన క్షేత్రాల్లో ఇది ఒకటి. యావత్ విశ్వంలో సాక్షాత్తూ పరమేశ్వరుని సృష్టిగా వారణాసిని పేర్కొంటారు. ఆ లయకారకుడైన శివుడే ఈ నగరాన్ని నెలకొల్పినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి కాశీ క్షేత్రంలో జనజీవితం విరాజిల్లుతోంది. పగలు, రాత్రి అని తేడా లేదు నిత్యం వేలాదిమంది యాత్రికులతో సందడిగా వుంటుందీ ఈ దివ్యక్షేత్రం. ద్వాదాశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వనాథక్షేత్రంగా, విశాలాక్షి వెలసిన పవిత్రభూమిగా, అన్నపూర్ణ నేలగా ఈ క్షేత్రం పేరుపొందింది.
ఇక్కడ సతీదేవి "చేయి" పడిందని కొందరు, కుడిచెంప పడిన స్థలమని కొందరు చెబుతారు. పురాణేతిహాసాల కథనాల వల్ల అమ్మవారి ఆలయం కాశ్మీర్ లో ఉందని తెలుస్తోంది. ఇక్కడ సరస్వతీ దేవీని కీరవాణి, కీర్ భవాని అని పిలు స్తారు. ఇదే శారదా పీఠం, ప్రస్తుతం ఇది పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులో నీలం నది ఒడ్డున ఉంది. ఈ నీలం నదిని భారతదేశంలో కిషన్‌గంగ అని పిలుస్తారు. అయితే, ప్రస్తుతం ఈ ఆలయ శిథిలాలు తప్ప మరేమీ లేవు. ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకి చేరువలో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులోని నీలం జిల్లాలో ఉంది.
ఈ ఆలయం వల్లనే కాశ్మీరుని శారదాదేశంగా కూడా పిలుస్తారు. ఇది ఒకప్పుడు కాశ్మీరీ పండితుల విద్యాకేంద్రంగా విరాజిల్లినది. ఇక్కడే ఆది శంకరుడు సర్వజ్ఞానపీఠాన్ని అధిష్టించాడు. ఒకప్పుడు సంస్కృత పండితులకు, కాశ్మీరీ పండితులకు, హిందూ, బౌద్ధ ధర్మాలకూ నిలయంగా ఉండేది.
ఒక సందర్భంలో పార్వతీపరమేశ్వరులు విశ్వకర్మతో అందమైన ఇల్లు కట్టించుకుని గృహప్రవేశానికి సిద్దమౌతారు. శివభక్తుడైన రావణుని పురోహితునిగా నియమిస్తారు. గృహప్రవేశం పూర్తయిన తరువాత దక్షిణ కోరుకొమ్మంటుంది పార్వతీదేవి. ఆ ఇంటినే తనకివ్వమంటాడు రావణుడు. ఆడిన మాట తప్పలేక ఇచ్చేస్తుంది పార్వతీదేవి. తన పుట్టింటికి బాధపడుతూ వెళుతుంది. దారిలో సరస్వతి కనిపించి తనను ఓదారుస్తుంది. వారిద్దరూ కలిసిన ప్రదేశమే ఈ శక్తి పీఠంగా వెలసిందని ఆలయ గాథలు చెబుతున్నాయి. ఈ ఆలయం చెరువులో ఉంటుంది.
ఆ అమ్మవారిని దర్శించేందుకు విదేశాల నుంచి కొన్ని వేల మంది వచ్చి చేరుకునేవారు. కానీ ఆ ఆలయం ధ్వంసం అవడంతో అక్కడ పూజలు జరగటంలేదని శంకరాచార్యులు ఆ పీఠాన్ని శృంగేరిలో(కర్ణాటక రాష్ట్రంలో) ప్రతిష్టించారని చెప్తారు. మంగుళూరుకు 100కి.మీ దూరంలో సరస్వతీ ఆలయ రూపకల్పన చేసి, ఒక రాయిపై చక్ర యాత్ర స్థాపన చేసి,సరస్వతీదేవి చందనపు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసారు.
ఇవి అష్టాదశ శక్తిపీఠాల చరిత్ర, పురాణ కథనాలు.