Vijaya Lakshmi
Published on Jun 08 2026
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?ఈ అద్భుతాలను చూసే ముందు, ఈ ఆలయ చరిత్రను ఒక్కసారి చూద్దాం. ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న ఈ మహాక్షేత్రం, హిందువుల పవిత్ర చార్ ధామాలలో ఒకటి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయ నిర్మాణాన్ని 12వ శతాబ్దంలో గంగవంశానికి చెందిన రాజు అనంతవర్మ చోడగంగదేవ్ ప్రారంభించారు. ఆకాశాన్ని తాకుతున్నట్టుగా, దాదాపు 214 అడుగుల ఎత్తులో ఉండే ఈ ఆలయ ప్రధాన శిఖరం, తనలో ఎన్నో రహస్యాలను దాచుకుంది. వాటిలో మొదటిది...
మాములుగా ఏదైనా జెండా గాలి ఎటు వీస్తే అటే ఎగురుతుంది. సింపుల్ లాజిక్. కానీ, పూరి జగన్నాథ ఆలయ గోపురం మీద ఉండే జెండా మాత్రం ఈ సూత్రాన్ని ఫాలో అవ్వదు. పూరి క్షేత్రం సముద్ర తీరంలో ఉండటంతో, పగలు గాలి సముద్రం నుండి భూమి వైపు, సాయంత్రం భూమి నుండి సముద్రం వైపు వీస్తుంది. కానీ విచిత్రంగా, గుడి పైన ఉన్న జెండా మాత్రం ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలోనే రెపరెపలాడుతుంది.
భక్తులు ఇది ఆ జగన్నాథుని మహిమే అని బలంగా నమ్ముతారు. ప్రతిరోజూ, దాదాపు 214 అడుగుల ఎత్తైన గోపురాన్ని, ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండా ఒక పూజారి ఎక్కి ఈ జెండాను మార్చడం శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. ఒకవేళ ఈ ఆచారం ఒక్కరోజు ఆగితే, ఆలయాన్ని 18 సంవత్సరాల పాటు మూసివేయాల్సి వస్తుందని ఒక ప్రగాఢమైన నమ్మకం కూడా ఉంది.
మరి సైన్స్ ఏం చెబుతోంది అంటే సైన్స్ పరంగా ఇప్పటికీ దీనికి కచ్చితమైన సమాధానం లేదు. ఆలయ నిర్మాణం, ఆ ప్రాంతంలోని గాలి ప్రవాహంలో ఏవైనా ప్రత్యేకమైన మార్పులను తీసుకువచ్చి ఈ అద్భుతానికి కారణం అవుతుండవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. కానీ, అది కేవలం ఒక ఊహ మాత్రమే. ఈ జెండా రహస్యం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. పూరీ క్షేత్రంలో... పూరీ క్షేత్రంలోనే కాదు ఆధ్యాత్మికంగా ఎవ్వరి ఊహకు అందని ఒక ఊహాతీతమైన రహస్యం నవకళేబరయాత్ర దీనిగురించి ఒక ప్రత్యేకమైన వీడియో మన చానల్ లో ఉంది లింక్ దిస్క్రిప్షణ్ లోను ఎండ్ కార్డ్స్ లోను ఇస్తాను చూడండి. ఇక పూరీ క్షేత్రంలో మరో అద్భుతం... ఆలయ శిఖరంపై ఉండే సుదర్శన చక్రం
ఆలయ శిఖరంపై అష్టధాతువులతో చేసిన ఒక పెద్ద చక్రం కనిపిస్తుంది. దానినే నీలచక్రం లేదా సుదర్శన చక్రం అంటారు. టన్నుల బరువుండే ఈ చక్రాన్ని శతాబ్దాల క్రితం అంత ఎత్తుకు ఎలా చేర్చారన్నది ఇప్పటికీ ఒక ఇంజనీరింగ్ అద్భుతమే. కానీ అసలు మిస్టరీ అది కాదు.
మీరు పూరి పట్టణంలో ఏ మూలన నిలబడి గుడి వైపు చూసినా, ఆ సుదర్శన చక్రం మిమ్మల్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇదెలా సాధ్యం? మీరు ఆలయానికి ముందు నిలబడ్డా, పక్కనుంచి చూసినా... ఆ చక్రం ఎప్పుడూ మీకు అభిముఖంగానే ఉంటుంది. బహుశా, భక్తులను కాపాడటానికి ఆ జగన్నాథుడు చక్రం రూపంలో అందరినీ గమనిస్తూ ఉంటాడన్న నమ్మకానికి ఇదే ప్రతీక కావచ్చు.
నిపుణులు దీన్ని ఒక అద్భుతమైన "ఆప్టికల్ ఇల్యూషన్" లేదా దృష్టి భ్రాంతి అని వివరిస్తున్నారు. ఆ చక్రాన్ని డిజైన్ చేసిన విధానం, దానిని అమర్చిన కోణం వల్ల దూరం నుండి చూసినప్పుడు అది అన్ని వైపుల నుండి ఒకేలా కనిపించేలా చేస్తుందని అంటారు. ఏదేమైనా, వందల సంవత్సరాల క్రితం, ఇప్పటి టెక్నాలజీ లేకుండా ఇంత కచ్చితమైన దృష్టి భ్రాంతిని ఎలా సృష్టించగలిగారు అనేది నిజంగా ఊహకు అందని విషయమన్నది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సినదే.
పూరీ జగన్నాథుని ఆలయంలో మరో అంతుచిక్కని విషయం గుడి పైన ఆకాశంలో దాగి ఉన్న రహస్యం.
సాధారణంగా ఏ పెద్ద గుడి గోపురాలపైనైనా పావురాలు, పక్షులు వాలడం మనం చూస్తాం. కానీ పూరి జగన్నాథ ఆలయ ప్రధాన గోపురం మీదుగా ఒక్క పక్షి కూడా ఎగరదని చెబుతారు. అంతేకాదు, ఆలయ ప్రాంగణంపై విమానాలు కూడా వెళ్ళవు. అయితే, ప్రభుత్వపరంగా మాత్రం ఇది "నో-ఫ్లై జోన్" అని అధికారికంగా ప్రకటించలేదు.
అసలు పక్షులు ఎందుకు ఆలయంపైకి రావు? దీనికి ఒక కారణాన్ని చెబుతారు. పక్షులకు రాజైన గరుత్మంతుడు స్వయంగా జగన్నాథుని ఆలయాన్ని రక్షిస్తాడని, అందుకే ఆయన మీద గౌరవంతో ఏ ఇతర పక్షి ఆ ప్రదేశం మీదగా ఎగరడానికి సాహసించదని భక్తులు నమ్ముతారు. సరే పురాణపరమైన కథ ఇలా ఉంటె...
మరి సైన్స్ ఏం చెబుతోంది? దీనికి కూడా శాస్త్రవేత్తల దగ్గర కచ్చితమైన సమాధానం లేదు. కొందరు, ఆలయం యొక్క భారీ నిర్మాణం వల్ల ఏర్పడే ప్రత్యేకమైన గాలి ప్రవాహాల కారణంగా పక్షులు అంత ఎత్తులో ఎగరడం కష్టంగా ఉండవచ్చని ఊహిస్తున్నారు. కారణం ఏదైనా, ఆలయ శిఖరంపై పక్షులు లేని ఆకాశం చూసేవారిని మాత్రం కచ్చితంగా ఆలోచనలో పడేస్తుంది.
మరి ఈ రహస్యాలు మీ మైండ్‌ని బ్లాక్ చేస్తున్నాయా?
పూరి ఆలయం బంగాళాఖాతానికి చాలా దగ్గరగా ఉంది. మీరు గుడి బయట ఉన్నంత సేపు, సముద్రపు అలల శబ్దం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. కానీ, ఇక్కడే అసలు అద్భుతం మొదలవుతుంది. మీరు ఆలయ ప్రధాన ద్వారమైన "సింహద్వారం" గుండా ఒక్క అడుగు లోపలికి పెట్టగానే, ఆ సముద్రపు శబ్దం మాయమైనట్టుగా ఆగిపోతుంది. బయటి ప్రపంచానికి, ఆలయం లోపలి ప్రశాంతతకు మధ్య ఆ ద్వారం ఒక అదృశ్య గోడలా పనిచేస్తుంది. మళ్ళీ అదే ద్వారం నుండి బయటకు రాగానే, సముద్రపు హోరు యధావిధిగా వినిపిస్తుంది.
జగన్నాథుని సోదరి సుభద్రాదేవి, ఈ సముద్రపు అలల శబ్దం ఆలయ ప్రశాంతతకు భంగం కలిగిస్తోందని తన సోదరుడు జగన్నతస్వామితో మొరపెట్టుకోగా... స్వామి, సముద్రుడిని శాసించాడని భక్తులు నమ్ముతారు. ఈ సముద్రపు ఘోషకు సంబంధించిన పురాణకథ ఇలా ఉంటె,
దీని వెనుక ఉన్న శాస్త్రీయ వివరణ ఎలా ఉందంటే , ఇది ధ్వనిశాస్త్రానికి (Acoustics) సంబంధించిన ఒక అద్భుతమైన ఉదాహరణ కావచ్చు అంటారు. ఆలయ నిర్మాణం, ముఖ్యంగా ప్రహరీ గోడలు, శబ్ద తరంగాలను నిరోధించేలా పనిచేస్తాయి. సింహద్వారం యొక్క డిజైన్ శబ్ద తరంగాలను శోషించుకోవడం లేదా వాటి దిశను మార్చడం వల్ల లోపలికి వెళ్ళగానే శబ్ద తీవ్రతలో అంత స్పష్టమైన తేడా వస్తుంది. ఇది ఆనాటి వాస్తుశిల్పుల నైపుణ్యానికి ఒక గొప్ప నిదర్శనం అని చెబుతారు.
ఇక చివరిగా, అందరినీ ఆశ్చర్యపరిచే అద్భుతం... ఆ జగన్నాథుని మహాప్రసాదం. ఎప్పటికీ వృధా కాని మహాప్రసాదం
పూరి ఆలయ వంటశాల ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాలల్లో ఒకటి. పూరీ జగన్నాథుని ఆలయంలో ప్రతిరోజూ జగన్నాథుడికి "మహాప్రసాదం" లేదా "ఛప్పన్ భోగ్" పేరుతో 56 రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. విచిత్రం ఏమిటంటే, ఆలయానికి రోజుకి వేల మంది వచ్చినా, పండుగలప్పుడు లక్షల మంది వచ్చినా, వండిన ప్రసాదం ఎప్పుడూ తక్కువ కాదు, అలా అని ఒక్క మెతుకు కూడా వృధా కాదు. సందర్శకుల సంఖ్యను బట్టి ప్రసాదం పరిమాణం దానంతట అదే సర్దుబాటు అవుతుందని, ఇది లక్ష్మీదేవి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతుందని, అందుకే ఎలాంటి లోపం లేకుండా జగన్నాథుని మహాప్రసాదం అందరికీ సమృద్ధిగా అందుతుందని భక్తులు బలంగా విశ్వసిస్తారు.
ఇంకో అద్భుతం ఏంటంటే, ప్రసాదాన్ని వండే విధానం. కట్టెల పొయ్యి మీద, ఒకదానిపై ఒకటి ఏడు మట్టి కుండలను పెట్టి వండుతారు. మామూలుగా అయితే, అడుగున ఉన్న కుండలోని పదార్థం ముందుగా ఉడకాలి. కానీ, ఇక్కడ దానికి పూర్తి రివర్స్‌లో, పైన ఉన్న ఏడవ కుండలోని ప్రసాదం ముందుగా ఉడుకుతుంది, ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి కింది కుండలలోని ప్రసాదం ఉడుకుతుంది.
ఈ వృధా కాకపోవడం వెనుక వంటవారి తరతరాల అనుభవం, అద్భుతమైన ప్రణాళిక ఉందని కొందరు అంటారు. ఇక కుండల విషయానికొస్తే, వేడి బదిలీ అయ్యే విధానంలో ఉన్న ప్రత్యేకత వల్ల ఇది సాధ్యం కావచ్చని అంచనా వేస్తున్నారు. కానీ, కింద మంట పెడితే పైన ఉన్న కుండలో ప్రసాదం ముందుగా ఎలా ఉడుకుతుందన్నది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే.
గాలికి వ్యతిరేకంగా ఎగిరే జెండా, అందరినీ చూసే సుదర్శన చక్రం, పక్షులు చేరని ఆకాశం, ఆగిపోయే సముద్ర ఘోష, మరియు అద్భుతమైన మహాప్రసాదం... ఇవి పూరి జగన్నాథ ఆలయంలోని ఐదు అద్భుతాలు.
కొన్నింటికి శాస్త్రీయ వివరణలు చెప్పడానికి ప్రయత్నించినా, అవి భక్తుల విశ్వాసాన్ని, ఆలయం చుట్టూ అల్లుకున్న రహస్యాన్ని పూర్తిగా ఛేదించలేకపోయాయి. కొన్నిసార్లు సైన్స్‌కు కూడా అందని విషయాలు కొన్ని ఉంటాయేమో. వాటిని తర్కంతో కాదు, కేవలం అనుభూతితోనే అర్థం చేసుకోగలమేమో.