Vijaya Lakshmi
Published on Sep 05 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?ఉజ్జయినీ నగరంలో సతీదేవి యొక్క "పైపెదవి" పడిన స్థలంగా దేవిభాగవతం చెబుతుంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణానికి 50కి.మీ దూరంలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మహాకాళి ఆలయం ఉన్నాయి. అజ్ఞానం, చీకటి, శత్రు భయాలను పోగొట్టడానికి శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు మహాకాళి రూపంలో ఉజ్జయినిలో కొలువై ఉన్నారు. గృహకాళికగా పూజలందుకుంటున్నారు.
ఈ క్షేత్రాన్ని భూమికి నాభిగా పేర్కొంటారు. ప్రతి 12 సం||లకు ఒకసారి ఇక్కడ “కుంభమేళా” ఉత్సవం జరుగుతుంది. ఈ ఉజ్జయిని కుశస్థలి, కనకశృంగి, పద్మావతి, కుముద్వతి, అమరావతి, విశాల అనే పేర్లతో కాల పరిస్థితులను బట్టి మారింది. సప్తమోక్ష పురలలో ఒకటి ఈ ఉజ్జయిని.
పూర్వం బ్రహ్మదేవుడి నుంచి ఎన్నో వరాలు పొందిన అంధకాసురుడు వర గర్వంతో ప్రజలను, దేవతలను విపరీతంగా హింసించసాగాడు. దేవతలా కోరిక మీద మహాకాళేశ్వరుడయిన పరమేశ్వరుడు అమ్దకాసురుడ్ని వధించదానికి అంధకాసురుడితో యుద్ధం చేస్తాడు. కానీ బ్రహ్మదేవుని వరం కారణంగా అంధకాసురుని రక్తం ఎన్ని చుక్కలు నేలను తాకితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తారు. అలా అతని సైన్యం పెరిగిపోయి విజ్రుంభించ సాగింది. దాంతో ఆదిపరాశక్తి మహాకాళికాదేవి అవతారం దాల్చి యుధ్ధభూమిలో ప్రవేశించి తన పొడవైన నాలుకను చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని, అప్పుడు మహాకాలుడు అందకాసురుడ్ని సంహరించాడని స్థలపురాణం.
కుజునికి ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఆలయం ఉంది. భూమిపుత్రుడైన కుజుడు భూమినుంచి విడిపోయిన ప్రాంత ఇదేనని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. విక్రమార్క మహారాజు చరిత్ర ఉజ్జయినితో ముడిపడి ఉంది. మహాకవి కాళిదాసు నాలుకపై అమ్మవారు బీజాక్షరాలు రాసింది
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లలో సామర్లకోటకు 13కి.మీ దూరంలో ఉన్న పిఠాపురంలో సతీదేవి "పీఠభాగం" పడటం వల్ల మొదట్లో పీఠికాపురంగా, కాలక్రమంలో పిఠాపురంగా ఈ ప్రాంతం పేరొందింది. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హుంకారిణిగా పూజలందుకుంటున్నది. అమ్మవారి నాలుగుచేతుల్లో బీజపాత్ర, గొడ్డలి, తామరపువ్వు మరియు మధుపాత్ర ఉంటాయి. ఇక్కడ పరమేశ్వరుడు కుక్కుటేస్వరునిగా వెలిసాడు.
పూర్వం ఏలుడు అనే ఋషి గంగమ్మ కోసం శివుని అనుగ్రహం కోరుతూ ఘోరమైన తపస్సు చేసాదు. ఏలుని తపస్సుతో సంతృప్తి చెందిన పరమేశ్వరుడు తన జటాజూటంలో ఉన్న గంగలోని ఒక పాయను వదిలి, ఒక షరతును కూడా పెట్టాడు శివుడు... నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా పోయినంతసేపూ, గంగ నీతో వస్తుందని, ఎక్కడైనా వేనక్కి తిరిగి చూస్తే అక్కడే ఆగిపోతుందని చెప్పాడు శివుడు ఏలునితో.
కానీ శివుని అనుగ్రహానికి ఆనకట్టగా నిలవాలని ఇంద్రుడు కోడి పుంజులా మారి కూశాడు. ఏలుడు వెనక్కి చూశాడు. గంగ ఆగి అక్కడ ఏలానదిగా మారింది. శివుడు కుక్కుటేశ్వరుడుగా మారాడు. ఇక్కడ ఎక్కువగా అపరకర్మలు చేస్తారని ఆలయ పండితులు చెబుతున్నారు.
నేటి ఒరిస్సా రాష్ట్రంలో కటక్ సమీపంలోని వైతరణీనది ఒడ్డున అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా వెలిసింది. ఈ ప్రాంతాన్ని వైతరణీపురం అని కూడా అంటారు. ఒరిస్సాలోని జాజిపూర్ రోడ్డు నుంచి 20కి.మీ దూరం ప్రయాణిస్తే గిరిజాదేవి(ఇక్కడ భిరిజాదేవిగా ప్రసిద్ధి)ఆలయానికి చేరుకోవచ్చు.సతీ దేవి "నాభీస్థానం" ఇక్కడ పడిందని అంటారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలతో, దండలతో మరియు బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు.
ఇక్కడ గిరిజాదేవిని శ్వేతవరాహమూర్తి రూపంలో విష్ణుమూర్తి అర్చిస్తుంటాడు. సింహవాహణిగా దర్శనమిచ్చే గిరిజా దేవి, ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో మహిషాసురుని తోక పట్టుకుని ఉంటుంది. ఈమెను శక్తిత్రయరూపిణి కొలుస్తారని ఆలయ పురాణాలు చెబుతున్నాయి.
ద్రాక్షారామం ... ఇది సతీదేవి "కణత భాగం" పడిన ప్రదేశం, పంచారామాలలో మొదటిదిగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఇది. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామలో మాణిక్యాంబగా అమ్మవారు వెలిశారు.
ఇది దక్షయజ్ఞంలో సతీదేవి ఆహుతి అయిన ప్రదేశంగా చెప్తారు. భోగానికి, మోక్షానికి, వైభవానికి ప్రసిద్ధి చెందినది ఈ క్షేత్రం. ఈ ప్రదేశం పంచారామాలలో ఒకటిగా ... త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిచెంది ప్రజల నీరాజనాలు అందుకుంటోంది. ఇక ఇప్పుడున్న మాణిక్యాంబాదేవి విగ్రహాన్ని ఆది శంకరుల వారు ప్రతిష్ఠించి పూజించినట్టుగా ఆధారాలు వున్నాయి.
అస్సాం రాష్ట్రం రాజధాని గౌహతి పట్టణంలో బ్రహ్మపుత్రా నది ఒడ్డున నీలాచల పర్వత శిఖరం పై సతీదేవి "యోనిభాగం" పడిందని ప్రతీతి. నీలాచలంలోని గర్భగుడిలో యోని వంటి శిలఒకటి ఉంది. ఆ శిల నుండి సన్నని ధారగా జలం వస్తుంది.ఏటా వేసవి కాలంలో మూడు రోజుల పాటు ఎర్రని నీరు వస్తుంది. అది స్ర్తీత్వానికి ప్రతీక అంటారు . అమ్మవారు రజస్వల అయ్యిందని, ఈ మూడు రోజులు దేవాలయాన్ని మూసి ఉంచుతారు. నాలుగో రోజున సంప్రోక్షణ జరుపుతారు.
పరశురాముని మాతృ హత్యాదోషాన్ని ఈ తల్లే పోగొట్టిందని, శివుని కంటి మంటకు దహనమైన మన్మథుణ్ని జీవింపచేసిందని పురాణాలు చెబుతున్నాయి. సతీదేవి ఆత్మత్యాగానంతరం తీవ్రమైన వేదనతో తపస్సమాధిలో లీనమై ఉన్న పరమేశ్వరుని మనస్సును మార్చాలని దేవతలు సంకల్పిస్తారు. ఇందులో భాగంగా మన్మథుడు సమయం చూసుకుని, పూలబాణాలు వేసి, ఆయనకు తపోభంగం కలిగిస్తాడు. దాంతో ముక్కంటి తన మూడవకంటిని తెరచి మన్మథుణ్ణి మసి చేస్తాడు. మన్మథుడికే కాముడు అనే పేరు. కాముణ్ణి దహించిన ప్రదేశం కనుక దీనికి కామాఖ్య అనే పేరొచ్చిందంటారు.
ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహంతో మన్మథుడు తిరిగి రూపాన్ని పొందాడు. అయితే కేవలం ఆయన భార్య రతీదేవికి మాత్రమే రూపంతో కనిపిస్తాడు. ఇక్కడి బ్రహ్మపుత్రానదిలో భస్మకూటమనే పర్వతం ఉండటం శివుడు మన్మథుని భస్మం చేయడం, తిరిగి ఆయన రూపం పొందాడనడానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక్కడ అమృతేశ్వర్, కోటిలింగ, సిద్ధేశ్వర, కామేశ్వర శివాలయాలున్నాయి.
ఈ ప్రాంతం ఎన్నో ప్రత్యేకతలకు ఆలవాలం: ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినదిగా భావిస్తున్న ఈ ఆలయం 16వ శతాబ్దంలో అన్యమతస్థుల దాడుల్లో ధ్వంసం కాగా, 17వ శతాబ్దంలో కుచ్ బీహార్ రాజు నరనారాయణుడు పునర్నిర్మించాడని శాసనాధారాలున్నాయి.
తేనెపట్టు ఆకారంలో ఉన్న ఆలయ శిఖరం గణేశుడు తదితర దేవీ దేవతల శిల్పాలతో కనువిందు చేస్తుంది. మాంత్రికులకు, తాంత్రికులకు, వామాచారులకు, క్షుద్రపూజలు చేసేవారికి ఈ ఆలయమే ఆధారం. కారణం ఇది సతీదేవి యోని భాగం పడిన ప్రదేశం. కాబట్టి అమ్మవారు అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.
ఆలయం మూడు మంటపాలుగా నిర్మించి ఉంటుంది. అందులో మొదటి ప్రాకారంలో గుహలా ఉండే గర్భాలయంలో యోనిచిహ్నం ఉన్న నల్లటి బండరాయి ఉంటుంది. దానికే పూజలు జరుగుతాయి. అయితే ఆ రూపం కనిపించకుండా భక్తుల దర్శనానికి ముందే పూలతో నింపేస్తారు. ఆ గుహలోపల రాతి మీద ఎప్పుడూ జల వూరుతూ ఉంటుంది. అందువల్ల మూలవిరాట్టు ఎప్పుడూ తడిగా ఉంటుంది.
ఆలయం బయటే శీతలాదేవి సన్నిధి ఉంటుంది. దీర్ఘవ్యాధులు ఉన్నవారు ఈమెను సేవించుకుంటే వాటినుంచి విముక్తి కలుగుతుందని ప్రతీతి. రెండవ మండపం చతురస్రాకారంలో, సువిశాలంగా ఉంటుంది. అదే అమ్మవారు కొలువై ఉన్న గుహాంతర్భాగంలోకి దారితీస్తుంది.
అమ్మవారికి రోజూ చేసే పూజలు గాక దేవీ నవరాత్రులలో ప్రత్యేకంగా దుర్గాపూజ జరిపిస్తారు. ఇవిగాక ఫాల్గుణ మాసంలో దుర్గాడియుల్ అని దుర్గాదేవికి ప్రత్యేక పూజ ఉంటుంది. అదేవిధంగా మానసాపూజ, పోహన్ బియా అంటే పుష్యమాసంలో కామేశ్వరుడికీ, కామేశ్వరీదేవికీ కల్యాణం జరిపిస్తారు. అదేవిధంగా చైత్రమాసం రాగానే, వసంత రుతు ఆగమనానికి సంకేతంగా వసంతపూజ జరుగుతుంది. ఇదే మాసంలో మదన డియుల్ అంటే కామదేవతకీ, కామదేవుడికీ పూజ జరుగుతుంది.
మృగశిర కార్తె వెళ్ళి ఆరుద్ర ప్రవేశించే నాటికి భూమాత రజస్వల అవుతుందని దేవీభాగవతంలో ఉంది. అంబుబూచి మేళా ఈ సమయంలోనే జరుగుతుంది. ఇదే కామాఖ్యా కుంభమేళాగా పిలుస్తారు. తొలకలరి చినుకులు కురిసే సమయంలో గర్భగుడిలో శక్తిపీఠంపై ప్రవహించే జలధార ఎర్రగా మారుతుంది దీనినే దేవీ వార్షిక రుతుచక్రంగా భావిస్తారు.
ఈ అంబుబాచి పర్వానికి ముందు శక్తిపీఠంపై ఎర్రటి వస్ర్తాన్ని కప్పుతారు. జలధార ఎర్రగా మారటంతో వస్ర్తం ఎర్రగా మారుతుంది. ఈ వస్ర్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా మార్చి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. తరువాత పండాలు, గర్భగుడిని, శక్తిపీఠాన్ని శుభ్రపరచి ప్రత్యేక పూజలు చేసిన తరువాత ఐదోరోజున ఆలయాన్ని తెరుస్తారు. ఈ ఐదురోజులు సాధువులు, సామాన్యులు ఆలయం వెలుపల అమ్మవారి దర్శనంకోసం వేచివుంటారు. ఈ సందర్భంగా సిధ్ధులు అద్భుతమైన విన్యాసాలు చేస్తారు.
దేవీభాగవతం, శివపురాణం ఇతర ఇతిహాసాలలో ఈ శక్తిపీఠం ఎంతో ప్రశస్తి కలిగివుంది. తాంత్రిక భావనలకు ప్రసిద్ధి చెందడంతో ఇక్కడ జంతుబలులు సర్వసాధారణం. మరెక్కడా లేనివిధంగా ఇక్కడ మహిషాలను సైతం బలిస్తారు. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ప్రదక్షిణ చేయకపోతే దర్శనఫలం దక్కదని భక్తుల నమ్మకం. సంధ్యావేళ దాటిన తరవాత అమ్మవారిని దర్శించుకోకూడదనే నియమం కూడాఉంది. అందుకే సాయంత్రం దాటితే ఆలయాన్ని మూసేస్తారు.
ఏటా వేసవిలో మూడురోజుల పాటు అంబుబాచీ పండుగ సందర్భంగా కామాఖ్యదేవి రజస్వల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ మూడు రోజులు ఆలయాన్ని మూసేస్తారు.
అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ (అలహాబాద్) ప్రాంతంలో పడినట్టు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు.
అమృత తీర్థం
స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బిందుమాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమనీ... సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమనీ వ్యవహరించడం కద్దు.
ఈ దేవిని అలోపీదేవిగా పిలవటానిక ఇక్కడ ప్రచారంలో వున్న కధ....ఒకప్పుడు ఇదంతా దట్టమైన అరణ్య ప్రదేశం. ఈ ప్రాంతంవారు ఆడపిల్లకి పెళ్ళిచేసి డోలీలో కూర్చోబెట్టి అత్తవారింటికి పంపిస్తారు. అలా ఒక పెళ్ళి కూతురుని పంపించేటప్పుడు బందిపోటు దొంగలు వారిని ఆపి దోచుకున్నారు. పెళ్ళికూతురు అమ్మవారిని ప్రార్ధించగా, ఆవిడ పెళ్ళికూతురుని మాయంచేసి, ఆ దొంగలబారినుండి రక్షించిందట. అప్పటినుంచి ఆ దేవిని అలోపీదేవిగా వ్యవహరిస్తున్నారు. అలోపీ అంటే మాయమవటం అని అర్ధం. అప్పటినుంచీ అక్కడివారు పెళ్ళిళ్ళకి ముందు ఈ అమ్మవారిని పూజించి శుభకార్యం మొదలు పెడతారు.
మిగిలిన శక్తిపీఠాల వివరణ తరువాతి బ్లాగ్ లో ...