అన్వేషణ తెలుగు నవల పదకొండవ భాగం | ఇందూరమణ | Anveshana part 11 | investigative & most suspense novel

Vijaya Lakshmi

Published on Jul 02 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

అన్వేషణ

ధారావాహిక నవల

పదకొండవ భాగం

రచన : శ్రీ ఇందూరమణ

ఆ యువకులిద్దర్నీ తీసుకుని వర్తకుల దగ్గర ఎవరి దగ్గరన్నాా బైకు ఉంటే అడగాలని పరుగుపెట్టారు. ఎట్టకేలకు కిరాణా దుకాణం వరహాల శెట్టి దగ్గరున్న హీరోహోండా బైక్‌ అడిగి తీసుకున్నాారు. ఒక కానిస్టేబుల్‌ని వెనకే ఎవరినన్నాా లిఫ్ట్‌ అడిగిరమ్మని యువకులిద్దరూ, మరో కానిస్టేబుల్‌ బైక్‌ మీద కొండదిగువకు వెళ్తున్న బస్సుని పట్టుకోడానికి బయలుదేరారు. కొండ ఘాట్‌ రోడ్‌లో స్టార్ట్‌ చెయ్యకుండానే న్యూూట్రల్లో పెడితే చాలు క్రిందకు సర్రున జారిపోతాయి బైకు. కానిస్టేేబుల్‌ బైక్‌ డ్రైవ్‌ చేస్తుున్నాాడు. మిగతా ఇద్దరు యువకుల వెనక ఒకరి వెనుక ఒకరు ఇరికించుకు కూర్చున్నాారు.

కానిస్టేబుల్‌కి ఆందోళనగానే ఉంది. కొండ బస్సు క్రిందకి చేరుకుని ‘ఆమె’ బస్సు దిగి వెళ్ళిపోతే.... ఇంతమంది భక్తుుల సందోహంలో... యాత్రీకుల రద్దీలో ‘ఆమె’ని తాము పట్టుకో గలరా! ఇటు గోపాలపట్నం కేసి వెళ్ళే బస్సు ఎక్కుతుందో? అటు ఆరిలోవ కేసి వెళ్ళే బస్సు ఎక్కుతుందో ఈ రెండుదారుల్లో కాకుండా విజయనగరం రూట్లో వెళ్ళే బస్సు ఎక్కేేస్తుందో... భగవంతుడా! ‘ఆమె’ ఈ రోజు మా చేతికి చిక్కేేలా చెయ్యి స్వాామి. మనసులో పిచ్చిగా ఆలోచించుకుంటూ బైక్‌ని న్యూట్రల్‌లో నడిపిస్తే వేగం తగ్గి దానికి నచ్చినట్టు వెళ్తుందని బైక్‌ ముందుకు పరిగెడుతున్నప్పుడు సడెన్‌గా గేర్‌ లోకి మార్చి బైక్‌ ఇంజన్‌ ఆన్‌ చేసాడు కానిస్టేబుల్‌. పరిగెడుతున్న బైక్‌ని గేర్‌లోకి మార్చేసరికి ఒక్క సారే ఆగి సర్రున ఇంజన్‌ స్టార్ట్‌ అయి మరింత వేగం పుంజుకుంది బైక్‌. ఘాట్‌ రోడ్‌ అంతా పల్లంగా మలుపు మలుపులుగా ఉన్నాా కానిస్టేబుల్‌ అదేదీ పట్టించుకోకుండా బైక్‌ని రెయిజ్‌ చేసి స్పీడు పెంచుకుంటూ ముందుకురికించాడు. ఎదురుగా అంతే వేగంగా దూసుకువస్తుున్న కార్లని, బైక్‌ను తప్పించుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాాడు.

కానిస్టేబుల్‌ వెనుకే కూర్చున్న యువకులిద్దరికీ ముచ్చెెమటలు పట్టేస్తుున్నాాయి. గాల్లో విమానంలా దూసుకుపోతున్న బైక్‌ మీద కూర్చున్నాారే గాని గుండెలు అరచేతిలో పెట్టుకున్నాారు. ఎదురుగా వస్తున్న బైకులు, కార్లు ఎక్కడ గుద్దుకుంటాయోనని భయంతో జడిసిపోతూ ఒకర్నొకరు గట్టిగా వాటేసుకుని కూర్చున్నాారు. కనుచూపు మేరలో కొండ బస్సు క్రిందకు దిగుతూ కనిపించేసరికి బైక్‌ డ్రైవ్‌ చేస్తున్న కానిస్టేబుల్‌కి ఆనందంతో మనసు ఉప్పొంగిపోయింది. హమ్మయ్య అనుకున్నాాడు. కొండ దిగుతున్న బస్సు కొంచెం నెమ్మదిగా వెళ్తోందని గ్రహించిన కానిస్టేబుల్‌ బైక్‌ స్పీడు మరింతగా పెంచి ముందుకు ఉరికించాడు. ఎదురుగా మరో కొండ బస్సు పైకి ఎగబ్రాకుతున్న కొండచిలువలా కొండపైకి వెళ్లడానికి ఎదురవడంతో కొండ దిగుతున్న బస్సు స్పీడు తగ్గించి ఆ బస్సుకి దారి ఇవ్వడం గమనించ లేకపోయాడు బైక్‌ నడుపుతున్న కానిస్టేబుల్‌. కొండ దిగుతున్న బస్సు మీదే దృష్టి పెట్టి బైక్‌ స్పీడ్‌ పెంచడం వలన ఎదురుగా వస్తుున్న బస్సుని గమనించలేకపోయాడు. స్పీడ్‌ కంట్రోల్‌ చెయ్యలేక బస్సు మీదకు వెళ్లి గుద్దెయ్యబోతూ బైక్‌ని రోడ్డు ప్రక్కకి మళ్ళించాడు కానిస్టేేబుల్‌. ఇంతలో కొండపైకి ఎక్కుతున్న కొండబస్సుని ఓవర్‌ టేక్‌ చేస్తూ కొండ పైకి వెళ్ళడానికి అతివేగంగా వస్తుున్న కారుని బలంగా గుద్దేస్తూ రోడ్డు ప్రక్కనే ఉన్న తుప్పల్లోకి లోయలా ఉన్న పల్లంలోకి బైక్‌ తో పాటు ముగ్గురూ దొర్లుకుంటూ వెళ్ళిపోయారు. హఠాత్తుుగా కొండదిగుతున్న బైక్‌ కారును గుద్దుకుని క్రింద ప ల్లంలో ఉన్న తుప్పల్లో నుండి బండ మీద నుండి లోయలోకి దొర్లుకుంటూ వెళ్లడం చూసిన బస్సు డ్రైవర్‌ టక్కున బస్సు ఆపేసాడు. బస్సులో ఉన్న ప్రయాణీకులంతా ఆశ్చర్యంతో... ఆందోళనతో బైక్‌తో లోయలో పడిపోయిన ముగ్గురు యువకులను రక్షించడానికి సమాయత్తమయ్యాారు. కొండదిగువకు ముందుకు వెళ్తున్నకొండ బస్సు డ్రైవర్‌ కూడా బైక్‌ ప్రమాదం గమనించి వారగా బస్సు ఆపేసాడు. దారిన పోతున్న కార్లు, బైక్‌లు అన్నీ ఎక్కడి వక్కడ ఆపేసి అందరూ కొండచరియల్లో పడిపోయిన బైక్‌ మీద వున్న యువకుల్ని రక్షించాలని రాళ్ళు, ముళ్లను కూడా లెక్కచేయకుండా లోయలోకి దిగారు. కొండ దిగుతున్న బస్సులో ఉన్న ‘ఆమె’ కూడా అందరితో పాటు బస్సు దిగింది. బైక్‌ మీద ముగ్గురు యువకులు కొండదిగుతూ కారును గుద్దుకుని లోయలోకి దొర్లిపోయారని తెలిసి ‘అయ్యో! పాపం!’ అనుకుంటూ తన మానాన తను కొండదిగువకు రోడ్డుమార్గాన ముందుకు సాగిపోయింది.

కొద్దిదూరంలో ఘాట్‌ రోడ్‌ మలుపులో ఎత్తుుగా ఎవరెస్టు అంత ఎత్తుులో అభయహస్తం చూపిస్తూ నిలబడ్డ ఆంజనేయస్వాామి విగ్రహం చూసి హమ్మయ్య అనుకుంది ఆమె. దానికి ఎదురుగానే స్వాామివారి తొలి పావంచా ఉంది. ముందు రోజు ఉదయం అక్కడ నుండి కొండపైకి నడక ప్రాారంభించిన విషయం గుర్తుుకొచ్చి కొండ దిగువకు చేరుకున్నాాననుకుంది ఆమె. ‘తొలి పావంచా మెట్లుు, ఘాట్‌ రోడ్‌ మలుపుకి ఆనుకుని ఉన్నాాయి. నేరుగా ఘాట్‌ రోడ్‌లో కొద్దిదూరం ముందుకు నడిస్తే టోల్‌ గేట్‌ వస్తుంది. ఆంజనేయస్వాామి విగ్రహం దగ్గర మలుపును ఆనుకుని ఉన్న మెట్లదారిలోకి మళ్లితే దిగువ కొండ బస్సుస్టాండుకి చేరుకోవచ్చు’. అనుకుందామె. ఘాట్‌ రోడ్‌ లో నుండి తొలిపావంచా దగ్గరకు చేరుకుంది ఆమె. అప్పటికే చీకటి చిక్కబడిపోయింది. ఘాట్‌ రోడ్‌లో ఉన్న వీధి లైట్లు ఒకటి అర వెలిగి ఉన్నాాయి. తొలిపావంచా దగ్గరకు వెళ్ళి నిలబడింది ఆమె.

ఇంతలో ఎక్కడ నుంచి వచ్చాారో రాము, సోమూ పరుగు పరుగున ఆమె దగ్గరకు వచ్చాారు. ‘‘అమ్మాా! అనాథ పిల్లలమమ్మాా! ఓ పది రూపాయుంటే దానం చెయ్యమ్మాా! ఆకలేస్తోంంది! దయ చూపించడమ్మాా’’ అంటూ ఆమెకి చెరో వైపు నిలబడి ఒకరి తర్వాాత ఒకరు సిల్వర్ పళ్ళాలు వూపుతూ యాచించారు.

కొండ దిగుతున్న భక్తులు ఇద్దరు, ముగ్గురు నెమ్మదిగా దిగుతున్నాారు. ఒకరిద్దరు యాత్రీకులు తొలిపావంచా దగ్గర కాలభైరవస్వాామికి దండం పెట్టుకుని కొబ్బరికాయలు కొట్టి కొండపైకి వెళుతున్నాారు. ఘాట్‌ రోడ్డు మలుపు దగ్గర హైమాక్స్‌ లైటు వెలుగు తొలిపావంచా దగ్గర షెడ్డులోకి చొచ్చుకు వస్తుంది. షెడ్డులోనున్న లైటు మినుకు మినుకుమని వెలిగి ఆరుతుంది. పడీపడని వెలుగులో ఆమె మొహం కేసి చూసిన రాము ఉన్నట్టుంండి ఉలిక్కిిపడ్డాడు.

‘‘ఒరేయ్‌ సోమూ! అమ్మగార్రాా! నిన్న మనకి వెయ్యిి రూపాయలు దానం చేసిన దేవతరా’’ అన్నాాడు ఆనందంగా.

ఆ యాచకబాలుడు అలా అనేసరికి ఆమె ఛటుక్కున ఆ కుర్రాాళ్ల కేసి చూసింది. తలనిండుగా ముసుగేసుకున్న ఆమె మొహంలో ఆ ఇద్దరు బాలయాచకుల్ని చూడగానే సంతోషం కలిగింది.ఆ బాల యాచకులిద్దర్నీ కళ్ళతోనే ప్రక్కకు రమ్మని సైగచేసి చీకటిగా ఉన్న ఓ మూలకు వెళ్లింది ఆమె. ఆమె అలా సైగ చెయ్యడం గమనిస్తూనే ఇద్దరు బాల యాచకులు ఆమె వెంట వెళ్లారు.

‘‘బాబూ! మీరు నాకో సహాయం చేస్తారా?’’ అడిగింది ఆమె.

‘‘చెప్పండమ్మాా!’’ ఆనందంగా అన్నాాడు రాము.

‘‘ఇక్కడ డబ్బులిచ్చేే బ్యాంకు మిషన్‌ ఎక్కడుందో మీకు తెలుసా?’’ తొలి పావంచా ప్రక్కనే ఉన్న పెద్ద మర్రిి చెట్టు క్రింద వున్న బండమీద కూర్చుంటూ అడిగింది ఆమె.

‘‘బ్యాంకు ఏ.టి.ఎమ్‌. గురించా అమ్మాా మీరు అడుగుతున్నాారు?’’ ఆశ్చర్యంగా ఆమెకేసి చూస్తూ అన్నాాడు సోము.

‘ఇంత అందంగా... గొప్పగా.... మహారాణిలా ఉన్న ఈ దేవతకి బ్యాంక్‌ ఏ.టి.ఎమ్‌ పేరే తెలీదా?! తెలిసే ఆలా అడుగుతుందా? సోముకు ఆ ఆలోచన కలగగానే అనుమానంగా ఆమెకేసి చూసాడు.

‘‘ఆ!...ఏ.టి.ఎమ్‌ గురించే అడుగుతున్నాా. మీకు తెలీదనుకుని అలా అడిగాను.’’ చిన్నగా నవ్వుతూ అంది ఆమె.

‘‘మాకా...! హ్హహ్హ!’’ ఫకాలున నవ్వాాడు రాము.

‘‘ఇదిగో! చూసారా!’’ అంటూ ఆండ్రాాయిడ్‌ సెల్‌ ఫోన్‌ తీసి ఆమెకి చూపించాడు సోము.

‘‘మీకు సెల్‌ ఫోన్‌ ఎందుకు?’’ ఆశ్చర్యంగా అడిగింది ఆమె.

‘‘ఎందుకంటారేంటమ్మాా! ఇంటర్నెెట్‌ ఫ్రీగా ఇస్తున్నాారు కదా! అందుకే ఇద్దరం డబ్బు పోగేసి ఈ సెల్‌ కొనుక్కున్నాం. సినిమాలు అన్నీ ఫ్రీగా చూసేస్తున్నాం తెలుసా?!’’ ఆనందంగా అన్నాాడు రాము.

‘‘సరే! నాకు ఏటిఎమ్‌ ఎక్కడుందో చూపిస్తారా?’’ అడిగింది ఆమె.

‘‘అయ్యో! రా అమ్మాా! మీరు మా దేవత! మీకు ఏ సహాయం కావాలన్నాా చెప్పండమ్మాా! చిటికెలో చేసేస్తాం’’ అన్నాాడు సోము సంతోషంగా. అలా అనడమే తరువాయి రాము ముందు నడుస్తూ దారి చూపిస్తుంటే వెనుక ఆమె నీడలా నడిచాడు

సోము. ఇద్దరూ ఆమెని తీసుకుని బజార్లో కొచ్చేేసరికి రయ్‌ రయ్‌మని పోలీసు జీపులు ఇటు గోపాల పట్నం నుండి ఒకటి, ఇటు ఆరిలోవ రూట్‌లో నుండి రక్షకవాహనం ఒకేసారి కొండ బస్సుస్టాండ్‌ దగ్గరకు దూసుకువచ్చాాయి. అప్పటికే కొండపై నుండి వస్తుున్న మోటారు సైకిల్‌ తో పాటు ముగ్గురు యువకులు ఘాట్‌ రోడ్‌ లోయలోకి పడిపోయారన్న వార్త పొగలా అల్లుకు పోయింది. అదే సమయంలో ఎస్సై అక్బర్‌ ఖాన్‌ దిగువ బస్సుస్టాండ్‌లో పై నుండి దిగుతున్న కొండబస్సు కోసం వేయి

కళ్లతో ఎదురు చూస్తూ నిలబడ్డాడు.

ఎవరో ముగ్గురు యువకులు బైక్‌ తో పాటు లోయలోకి పడిపోయారని తెలియగానే అదిరిపడ్డాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌

తొలి పావంచా దగ్గర నుండి బజార్లోకొచ్చిన ఆమె పోలీసుజీపు చూడగానే టక్కున చీకట్లోకి వెళ్లి నక్కిి నిలబడింది.రామూ సోమూ ఇద్దరూ ప్రక్క ప్రక్కనే హైమాక్స్‌ లైటు క్రింంద నిలబడి చీకట్లో నక్కిి నిలబడ్డ ఆమె కేసి చూసారు.

‘‘రండమ్మాా! అదిగో! ఆ పురూరవ సత్రాాల ప్రక్కనే వుంది. బ్యాంక్‌ ఏటిఎమ్‌. రండి!’’ ఆమె కేసి చూస్తూ అన్నాాడు రాము. 

‘‘ఇలారా బాబూ!’’ రాముకేసి చూసి దగ్గరగా రమ్మని సైగ చేసింది ఆమె. మౌనంగా సైగ చేసి దగ్గరకు రమ్మని పిలవడం చూసి రామూ, సోమూ ఇద్దరూ చీకట్లో నిలబడ్డ ఆమె దగ్గరకు వెళ్లారు.

‘‘మీలో ఎవరికి ఏటిఎమ్‌లో డబ్బు తియ్యడం వచ్చు?’’ ఇద్దరికేసి చూస్తూ అడిగింది ఆమె.

*********************************

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో


కొండ చరియలలో పడిపోయిన ఆ యువకులిద్దరూ బ్రతికి బయట పడ్డారా? ఆమెని పట్టుుకోగలిగారా?

ఇవి కూడా చదవండి



Recent Posts
అన్వేషణ తెలుగు నవల పదకొండవ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 11 |   investigative & most suspense novel
అన్వేషణ తెలుగు నవల పదకొండవ భాగం ...
అన్వేషణ తెలుగు నవల పదవభాగం  |  ఇందూరమణ  | Anveshana part 10 |   investigative & most suspense novel
అన్వేషణ తెలుగు నవల పదవభాగం |...
అన్వేషణ తెలుగు నవల తొమ్మిదవభాగం  |  ఇందూరమణ  | Anveshana part 9 |   investigative & most suspense novel
అన్వేషణ తెలుగు నవల తొమ్మిదవభాగం |...
భారతదేశంలోని అత్యంత రహస్యమైన తాంత్రిక శక్తి పీఠాలు! | India's Most Mysterious Tantric Temples Explained in Telugu
భారతదేశంలోని అత్యంత రహస్యమైన తాంత్రిక శక్తి పీఠాలు!...
అన్వేషణ తెలుగు నవల ఎనిమిదవ భాగం  |  ఇందూరమణ | Anveshana part 8 |   investigative & most suspense novel
అన్వేషణ తెలుగు నవల ఎనిమిదవ భాగం ...