తిరుచానూరు (అలిమేలు మంగాపురం) లో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు టిక్కెట్లు విడుదల | Tickets released for mass Varalakshmi Vratas at Sri Padmavati Ammavari Temple in Tiruchanur (Alimelu Mangapuram)

Vijaya Lakshmi

Published on Jul 30 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో శ్రావణశోభ మొదలయిపోయింది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా సామూహిక శ్రావణ వరలక్ష్మీ వ్రతాలకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఆగ‌స్టు 8వ తేదీ శుక్ర‌వారం శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నట్టు TTD ప్రకటించింది. తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయం ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

ఈ వ్ర‌తాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నున్నట్టు ttd ప్రకటించింది.


youtube play button



టిక్కెట్లు ఎలా బుక్ చేసుకోవాలి

భ‌క్తులు నేరుగా వ్ర‌తంలో పాల్గొనేందుకు జూలై 31న ఉద‌యం 9 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో 150 టికెట్లు జారీ చేస్తారు. అదేవిధంగా ఆల‌యం సమీపం కౌంటర్‌లో ఆగ‌స్టు 7న ఉదయం 9 గంటలకు కరెంట్‌ బుకింగ్‌లో 150 టికెట్లు విక్రయిస్తారు. రూ.1000/- చెల్లించి భక్తులు టికెట్‌ కొనుగోలు చేయవచ్చు. ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులను అనుమతిస్తారు.


వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయంలో అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజ‌ల సేవ‌, బ్రేక్ ద‌ర్శ‌నం, వేద ఆశీర్వ‌చ‌నం సేవలను టిటిడి రద్దు చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపింది.


ఇవి కూడా చదవండి

Recent Posts
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర  | Complete History & Divine Miracles, how to reach, AP shaktipeethas
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర |...
పంచ మాధవ క్షేత్రాల రహస్యం  |  విష్ణువు కొలువైన 5 మహాక్షేత్రాలు  | Hidden Secrets of Pancha Madhava Temples  |  how to reach panchamadhava 5 Vishnu temples
పంచ మాధవ క్షేత్రాల రహస్యం |...
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది  |  బ్రిటిష్ వారు ఇందులో ఏం దాచారు  | orissa Konark temple dark secrets, history & mystery
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది ...
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 20 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం ...
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 19 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం ...