అభిమానం హద్దులు దాటితే... ఆలయం కట్టేయడమే...! ఎవర్ గ్రీన్ ట్రెండ్! | Celebrity temples in all over India

Vijaya Lakshmi

Published on Aug 14 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

అభిమానం హద్దులు దాటితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ దేవాలయాల్ని చూడాల్సిందే. ఆ దేవాలయాల్లో ఉండేది దేవుళ్ళు కాదు. దేవతలు కూడా కాదు. పోనీ రాక్షసులా అస్సలు కాదు. సెలబ్రిటీలు. ఎస్ ... సెలబ్రిటీలు. సో ఈ సెలెబ్రిటీ ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో... అ టెంపుల్స్ లో పూజలందుకుంటున్న సెలబ్రిటీలెవరో చూద్దాం....

మహాత్మ గాంధీ ఆలయం

 జాతిపిత మహాత్మ గాంధీ దేశానికి చేసిన సేవలకు గాను ఆలయాన్ని నిర్మించారు భారతీయులు. ఇక్కడ ఆయన విగ్రహానికి నిత్యం పూజలు జరుగుతాయి. ఒరిస్సా లోని సంబల్పూర్ పట్టణంలో భత్ర గ్రామంలో ఈ దేవాలయం కలదు.హైదరాబాద్ - విజయవాడ హై వే మీద కూడా గాంధీ ఆలయం కలదు.

youtube play button

సోనియా గాంధీ టెంపుల్

 AICC అధ్యక్షురాలు సోనియా గాంధీ కి తెలంగాణలో అభిమానులు కాస్త ఎక్కువనే చెప్పాలి. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ప్రకటించిందో అప్పుడే తమ ప్రత్యేక రాష్ట్ర కల సాకారం చేసిన సోనియాగాంధీకి  కరీంనగర్ లో ఆలయం వెలసింది. ఆలయం గోడలపై ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ మరియు రాహుల్ గాంధీ చిత్రాలు చూడవచ్చు. మార్బుల్ తో నిర్మించిన ఈ ఆలయం కరీంనగర్ లో కలదు.


రజినీకాంత్ టెంపుల్

తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్  ని తెలియని సినిమా అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒక సాధారణ బస్సు కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ స్థాయి వరకు ఎదిగిన రజనీకాంత్ ఆ స్థాయికి రావడానికి చాలా కృషి చేసాడు. దేశ,కాల,ప్రాంతీయ,భాషా బేధాలకతీతంగా రజనీకాంత్ కి అభిమానులున్నారు. సో....ఆ అభిమానంతోనే రజనీకాంత్ కి చెన్నై లో ఒక ఆలయం కట్టారు.

youtube play button


ఖుష్బూ

ప్రముఖ దక్షిణ నటి ఖుష్భూ కి సైతం అభిమానులు గుడి కట్టించి పూజలు చేస్తుంటారు. ఖుష్భూ పేరు మీద తిరుచిరాపల్లి లో ఒక ఆలయం కలదు. కానీ 2005 లో ఆమె మీద వచ్చిన ఒక వివాదం వలన ఆ సందర్భంలో ఆమె  చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల ఆలయం నేలమట్టం చేశారు.

అమితాబచ్చన్

బాలీవూడ్ బిగ్ బి గా పిలుచుకునే అమితాబ్ కు కూడా ఆలయముంది. కలకత్తాలో ఈయనకు ఆలయం కలదు. ఆలయం లోపల ఈయన నటించిన అగ్నిపథ్ చిత్రంలో వాడిన చెప్పుల జతను కుర్చీ మీద ఉంచారు.

ఎం జి రామచంద్రన్

ఎం జి రామచంద్రన్ దక్షిణ భారతదేశ చలనచిత్ర నటుడు. ఈయన తమిళనాడులో చిత్ర ప్రముఖుడిగా రాజకీయవేత్తగానే కాదు ముఖ్యమంత్రిగా కూడా పముఖుడు. తమిళనాడు లోని నాథమేడు లో ఈయనకు ఆలయం కలదు.

నమిత  

గుజరాత్ రాష్ట్రంలో పుట్టిన నమిత తమిళనాట అత్యంత ప్రజాదరణ కలిగిన సినిమా నటి. తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో చేసినా తమిళ సినీ రంగంలో ప్రసిద్ధి చెందింది. అందుకే ఖుష్బూ తర్వాత ప్రేక్షకులు నమితకు బ్రహ్మరథం పట్టారు. తిరునల్వేలి లో నమిత పేరు మీద దేవాలయాన్ని కూడా కట్టించారు.

మాయావతి

బీఎస్పి అధినేత్రి మాయావతి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు లక్నో కు 300 KM ల దూరంలో ఉన్న నాత్పురా గ్రామంలో మాయావతి ఆలయాన్ని కట్టించాలని ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆపేసారు.

సచిన్

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను సైతం అభినానులు వదలలేదు. ఆయనకు కూడా గుడిని కట్టించారు. బీహార్ లోని కైమూర్ జిల్లాలో గల ఆతర్వాలియా లోని తివారి గ్రామములో 5. 5 అడుగుల సచిన్ విగ్రహం కలదు.



ఇవి శపించబడిన ఆలయాలు. ఎందుకు శపించ బడ్డాయి? ఎవరు శపించారు?


youtube play button



youtube play button


Recent Posts