Vijaya Lakshmi
Published on Sep 07 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?అరే! ఇంత అందమైన ప్రదేశం ఎలా మిస్సయ్యాం!? ఈ ప్రదేశం చూస్త, మీరు ఖచ్చితంగా ఇలానే అనుకుంటారు.
నీలి కెరటాలు… బంగారు వన్నెల ఇసుకు తిన్నెలు….చల్లని గాలి… వీటి మద్య ఓ పురాతన ఆలయం. ప్రకృతి ప్రేమికులకు అదో స్వర్గం. ఆధ్యాత్మిక వాదులకు అపురూపమైన, అపూర్వమైన పుణ్య క్షేత్రం. ఇది ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన అతి పురాతన క్షేత్రమయినా, ప్రకృతి అందానికి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అద్భుత, అందాల లోకం అంటే అతిశయోక్తి కాదు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్నవారయితే అస్సలు ఈ ప్రదేశం మిస్సవకండి. చదువుతుంటే మీకు చూడాలనిపిస్తోంది కదూ! అయితే డిటైల్స్ లోకి వెల్లిపోదాం పదండి.
దక్షిణ భారతదేశంలో అతి పురాతన శైవ క్షేతాల్లో అప్పికొండ ఒకటి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెనుక సముద్ర తీరాన ఈ ఆలయం వెలిసింది. నిత్యం భక్తుల పూజలను అందుకునే ఈ ఆలయ ప్రాంగణలో అత్యంత పురాతన శివలింగాలు చూడొచ్చు. విశాఖపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలోను, గాజువాక కు 20 కిలోమీటర్ల దూరంలోను ఉన్న ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటన్నది ఓసారి చూద్దాం....
ఈ క్షేత్రానికి కపిల మహార్షి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఓసారి కపిల మహర్షి ఈ భూమినంతటిని ప్రదక్షిణగా చుట్టిరావాలని సంకల్పించాడు. ప్రదక్షిణలో భాగంగా ఈ సముద్ర తీరానికి వచ్చిన కపిల మహర్షి 101 శివలింగాలను ప్రతిష్టాంచాలని సంకల్పించి ఆదివారం రాత్రి తపస్సు మొదలుపెట్టారట. సోమవారం ఉదయానికి మహర్షి దీక్ష పూర్తయ్యే సరికి 100లింగాలు ఉద్భవించాయి. తాను సంకల్పించిన దానికి ఒక లింగం అప్పుగా మిగిలిపోయింది. దాంతో ఆ ప్రాంతం అప్పుకొండగా ప్రసిద్ధి చెందిందని ఓ కథనం.
ఆ అప్పుకొండే కాలక్రమంలో అప్పికొండగా మారిపోయిందని చెప్తారు. కపిలముని సంకల్పంతో శివలింగాలు సోమవారం వెలియడంతో సోమేశ్వరస్వామి ఆలయంగా నామకరణం చేశారని ఈ కొండకు కపిల కొండ అన్న పేరు స్తిర పడిపోయిందని స్థల పురాణం చెప్తోంది.
తరువాత కాలంలో సముద్ర అలల తాకిడితో చాలా కాలం ఈ ఆలయం ప్రాంగణం సముద్రపు ఇసుకలో కప్పబడిపోయిందట. రెండు దశాబ్ధాల క్రితం ఆర్కియాలజీ విభాగం పరిశోధనల్లో తవ్వకాల్లో అప్పికొండ బయటపడింది.
ఈ అప్పికొండ సోమేశ్వర ఆలయం క్రీస్తు పూర్వ 6,11వ శతాబ్ధాల్లో చోళులు, విజయనగర రాజులు ఆదరణతో ఎంతో అభివృద్ధి చెందిందని ఇక్కడ లభించిన శిలాశాసనాలు చెప్తున్నాయి. అప్పట్లో కపిలముని సంకల్పంతో వెలిసిన శివలింగాలన్నీ సముద్రంలో కలిసిపోగా కేవలం నాలుగు మాత్రం మిగిలాయని వాటికే ఇప్పుడు పూజలు జరుగుతున్నాయని పూజారులు చెప్తారు. ఆ నాలుగు శివలింగాల్లో ప్రధానమైనది ప్రధాన గర్భాలయంలో పూజలందుకుంటోంది. అదే ఇక్కడ మనం చూస్తున్న శివలింగం. ఇంకా ఇవే కాకుండా చాలా శివలింగాలు ఆలయ పరిసరాల్లో సముద్రపు ఇసుకలో ఉన్నట్టు అక్కడున్న మత్య్సకారులు చెబుతుంటారు.
గర్భాలయంలోని స్వామికి ఎదురుగా కొలువుదీరిన భారీ నందీశ్వరుడు. స్వామిని దర్శించి నందీశ్వరుని చెవిలో కోరిన కోర్కెలు చెబితే ఇట్టే తీరుతాయని భక్తుల నమ్మకం.
అప్పికొండ తీరంలో వెలిసిని సోమేశ్వరుడు వేలాది మంది భక్తులకు ఇలవేల్పు. ఈ పరిసర గ్రామాల ప్రజల్లో ప్రతీ కుటుంబానికి ఒక్కరు ఈ సోమేశ్వరుని పేరు పెట్టుకుంటారు. అలాగే ఇక్కడి మత్యకారుల్లో ఎక్కువగా అప్పికొండ అన్నపేరు కూడా వినబడుతుంది.
చారిత్రక ప్రాధాన్యత కలిగిన శైవ క్షేత్రాల్లో ఒక్కటైన ఈ అప్పికొండ సోమేశ్వర ఆలయం కార్తీక మాసంలో వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతుండి. శివరాత్రి కయితే అప్పికొండ స్వామిని దర్శించుకునే భక్తులకు లెక్కే లేదు. స్వామికి అభిషేకాలు పూజలు చేయించుకొని, ఆ పరిసరాల్లోనే జాగరణ కూడా చేసి చేరువనే ఉన్న సముద్రంలో స్నానం చేసి అప్పుడు ఇళ్ళకు చేరుకుంటారు. శివరాత్రి రెండు రోజులు పాటు గాజువాక, అప్పికొండ మధ్య ప్రత్యేక బస్సులు కూడా నడుపుతుంది ఆర్టీసీ. కార్తీకమాసంలో అయితే ఈ అప్పికొండ బీచ్ వన భోజనాలకు వచ్చేవల్లాతో సందడికి సరదాలకు మారుపేరు అయిపోతుంది. ఇక్కడి పచ్చని జీడిమామిడి, సరుగుడు, కొబ్బరితోటలు వనభోజనాలకు అనువుగా ఉంటాయి.
ఆ ప్రాంతవాసులకు అప్పికొండ సోమేశ్వరుడు కొంగుబంగారంగా నిలుస్తాడు. సోమేశ్వరుడిని దర్శించుకుంటే కష్టాలు తీరుతాయని, స్వామికి అభిషేకం చేయించుకొని మనసార కోరుకుంటే ఆ కోరిక తాప్పక నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.
ఇక్కడ కొండమీద కపిల మహర్షి తపస్సు చేసాడని చెప్తారు. ఈ కొండ కింద వినాయకుడి ఆలయం కొండపైన శివాలయం ఉన్నాయి. ఆ కొండ మీదికి చేరుకోడానికి మెట్ల మార్గం కూడా ఉంది.
విశాఖ ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి గాజువాకకు ప్రతి నిత్యం సిటీ బస్సులు ఉంటాయి. అక్కడ నుంచి అప్పికొండకు ప్రత్యేకసర్వీసులు నిరంతరాయంగా నడుస్తుంటాయి. అలాగే విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి నేరుగా అప్పికొండుకు సిటీ సదుపాయం కూడా ఉంది. స్వంత వాహనాల్లో వెళ్ళేవారు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ లో నుంచి నేరుగా అప్పికొండ చేరుకోవచ్చు.