నవరాత్రుల్లో మాత్రమే తెరుచుకునే దండు మారెమ్మ (దుర్గమ్మ) ఆలయం ఒరిస్సా, పర్లాకిమిడి | Most mysterious Durga temple Dandu Maremma odisha, parlakimidi

Vijaya Lakshmi

Published on Oct 01 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

మన దేశంలో ప్రసిద్ధి చెందిన దుర్గా ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని ఏడాది పొడుగునా తెరవబడి భక్తుల ఆరాధనలు అందుకునేవి కొన్నయితే. కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే తెరవబడి... పూజలు జరిపే ఆలయాలు కూడా ఉన్నాయి. అలాంటి ఓ ప్రత్యేకమైన దుర్గమ్మ ఆలయమే ఒరిస్సా లోని దండుమారెమ్మ ఆలయం. దీనినే దండుమా ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. నిజానికి ఈ దండు మా లేదా దండు మారెమ్మ ఆలయం చాల మందికి తెలియని రహస్య ఆలయమనే చెప్పాలి. ఆ రహస్య, ప్రత్యేక దుర్గా ఆలయం దండు మారెమ్మ ఆలయం గురించి తెలుసుకుందాం.



ఆలయ చరిత్ర

ఒడిశాలోని గజపతి జిల్లాలోని పర్లాఖేముండి లేదా పర్లాకిమిడి గ్రామం దోలబంధ వీధిలో ఉంది దండు మా ఆలయం. ఇది అత్యంత పురాతన ఆలయం. నవరాత్రి సమయంలో, దండు మా ఆశీర్వాదం పొందడానికి ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ నుండి భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. 



ఆలయ విశిష్టత

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సంవత్సరం పొడవునా ఈ ఆలయం మూసివేయబడి ఉంటుంది. కేవలం శరన్నవరాత్రులు గా చెప్పబడే దసరా నవరాత్రులలో 9 రోజులు మాత్రమె ఈ ఆలయం తెరుస్తారు. ఓడిశా సంప్రదాయం ప్రకారం వారి అశ్వని మాసం లో ఈ నవరాత్రులలో మాత్రమే ఈ ఆలయంలో పూజాదికాలు జరుగుతాయి. ఆలయం తెరిచినపుడు ఆలయంలో ఉన్న పెద్ద పుట్టాను కూడా అమ్మవారిగా భావించి పూజలు చేస్తారు. ఈ తొమ్మిది రోజులు ఆలయంలో హోమం చేస్తారు.



పర్లాఖేమిడి విశిష్టత

ఒడిషాలోని పురాతన మునిసిపాలిటీలలో ఒకటి. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఈ పర్లాకిమిడి విశిష్టత ఏంటంటే ఇది ఓడిశాలోని ప్రాంతమయినప్పటికీ ఇక్కడ తెలుగు, ఓడిశా రెండు భాషలు కూడా సమంగా మాట్లాడతారు. ఈ ప్రాంతం గుండా ప్రవహించే మహేంద్ర తనయ నది ఈ ప్రాంత అందాన్ని మరింత పెంచుతుంది. ఈ నగరం ఒడిషా సాంస్కృతిక కేంద్రంగా పరిగణించబడుతుంది, ఈ ప్రాంతం నుంచి చాలా మంది గొప్ప కవులు, రచయితలూ, చరిత్రకారులు ప్రసిద్ధి చెందారు.



దండుమారెమ్మ చరిత్ర

దాదాపు 255 సంవత్సరాల క్రితం ఆనాటి పర్లాకిమిడి రాజులు పర్లాకిమిడి రాజమహల్ ఈ అమ్మవారి విగ్రహాన్ని పూజించేవారట. 1768లో బ్రిటిష్ సైన్యంతో విజయనగర పాలకుడు బవిజయ్‌రామ్ రాజుతో కలిసి పర్లాకిమిడి పాలకుడు జగన్నాథ్ గజపతి నారాయణ్ దేవ్ మధ్య జరిగిన యుద్ధం తర్వాత ఈ విగ్రహాన్ని దండుమల వీధికి తరలించారని చెబుతారు. ఆ యుద్ధంలో పర్లాకిమిడి పాలకుడు ఓడిపోయాడు. ఆ తర్వాత దండుమల వీధి నివాసితులను దండుమారమ్మ దేవిని పూజించమని ఆదేశించాడని అప్పటి నుంచి పర్లాకిమిడి దండుమల వీధిలో అమ్మవారి ఆరాధన జరుగుతుందని చెబుతారు. దండుమల వీధిలో నివసించే చాలా మందికి ఎన్నో సందర్భాలలో, అర్థరాత్రి సమయంలో దండుమారెమ్మ అందమైన కన్యగా దర్శనమిచ్చేదట. దండుమారమ్మ దేవి ఈ ప్రాంతంలో తిరిగేదని, అందుకే ఆలయ తలుపులు ఏడాది పొడవునా మూసివేసి, ఆ తర్వాత మూడు రోజులు తెరిచి ఉండేవని ప్రజలు చెబుతారు. దండుమల వీధిలో జరిగే వ్యాధులు, దొంగతనాలు, ప్రమాదాలు మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాల నుండి దేవత తమను రక్షిస్తుందని స్థానికులు నమ్ముతారు.



మారెమ్మ మిస్టరీ

ఇక ఈ ఆలయంలో ఇప్పటికీ ఎవ్వరికీ అంతుపట్టని ఒక రహస్యం ఉంది. నవరాత్రులు పూర్తయిన తరువాత దశమి రోజు పూజలు చేసి ఆలయం తలుపులు మూసివేసే ముందు, మారేమ్మకు అమ్మవారి ఘటంలో అంటే కుండలో కొబ్బరికాయను సమర్పించి తలుపులు మూసివేస్తారు. విచిత్రంగా మరుసటి సంవత్సరం తలుపు తెరిచే వరకు ఈ కొబ్బరికాయ కుళ్ళిపోకుండా, పాడవకుండా నైవేద్యంగా సమర్పించినపుడు ఎలా పెట్టారో అలాగే చెక్కుచెదరకుండా ఉంటుంది. ఈ కొబ్బరికాయను ఆ  తరువాతసంవత్సరం నవరాత్రి సమయంలో ఆలయాన్ని సందర్శించే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. 


దండు మా లేక దండుమారెమ్మ తల్లి భక్తితో వేడుకున్న వారిని రక్షించి, శ్రేయస్సునిస్తుందని, కోరిన ధర్మబద్ధమైన కోరికలను తప్పక నెరవేరుస్తుందని స్థానికులు గాధంగా నమ్ముతారు. కాల ప్రవాహంలో ఎన్ని మార్పులు వచ్చినా ఒరిస్సా లోని పర్లాకిమిడి దండు మారెమ్మ ఆలయంలో మాత్రం  నేటికీ అన్ని పూజలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించబడుతున్నాయి


ఎలా వెళ్ళాలి...

రోడ్డు మార్గం ద్వారా  

     బెర్హంపూర్, రాయగడ, శ్రీకాకుళం, విజయనగరం నుండి రోడ్డు మార్గం ద్వారా పర్లాకిమిడి చేరుకోవచ్చు.


రైలు మార్గం ద్వారా

    పర్లాకిమిడిలో రైల్వే స్టేషన్ ఉంది. పర్లాకిమిడి వరకు రైల్లో చేరుకొని ఆలయానికి వెళ్ళవచ్చు.


 సమీప విమానాశ్రయం విశాఖపట్నం విమానాశ్రయం. ఇక్కడినుంచి దాదాపు 190 కి.మీ దూరంలో ఉన్న పర్లాకిమిడికి బస్సు, లేదా కేబ్ ద్వారా చేరుకోవచ్చు.


ఇవి కూడా చదవండి

Recent Posts