Vijaya Lakshmi
Published on Aug 15 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?నవంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి దర్శన, గదుల, వివిధ సేవల టిక్కెట్లకు సంబంధించి ttd ప్రకటన విడుదల చేసింది. అలాగే టిటిడి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రకటించింది. రాను రాను తిరుమల కు వెళ్ళే భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో అలిపిరి దగ్గర నివారించలేని రద్దీ పెరుగుతోంది. ఆ కారణంగా వాహనదారులు, భక్తులు పలు ఇబ్బందులకు గురయ్యే పరిస్తితి. ఆ పరిస్తితిని నివారించడానికి టిటిడి ఈ రోజు నుంచి అంటే ఆగస్ట్ 15 నుంచి తిరుమలకు వెళ్ళే వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసింది. అలాగే తిరుమలలో వివిధ రకాలుగా ఆగడాలు మితిమీరుతున్నాయి. వాటిని నివారించే చర్యల్లో భాగంగా కొన్ని నియమాలు ప్రకటించింది. వాటిని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలుంటాయని కూడా ప్రకటించింది.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన నవంబర్ నెల కోటాను ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగస్టు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
ఈ టికెట్లు పొందిన వారు ఆగస్టు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్ ద్వారా టికెట్లు మంజూరు చేస్తారు.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఆగస్టు 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఆగస్టు 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆగస్టు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్ లైన్ కోటాను ఆగస్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఆగస్టు 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను ఆగస్టు 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
ఇక TTD మరో మరో బ్రేకింగ్ న్యూస్ అనౌన్స్ చేసింది. ఇకపై తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్ట్ టాగ్ తప్పనిసరి. ఈ పధ్ధతి ఆగస్టు 15 నుండి అంటే ఈ రోజు నుంచే విధిగా అమలు చేస్తామని చెబుతోంది
అలిపిరి చెక్ పోస్ట్ వద్ద వాహననాల రద్దీ కూడా పెరుగుతుంది. అయితే ఫాస్ట్ ట్యాగ్ లేనీ వాహనాలను మాన్యువల్‌గా టోల్ తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. దీని వల్ల టోల్‌గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలు అందించే ఉద్దేశ్యంతో, ఆగస్టు 15వ తారీకు నుండి తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్ట్ టాగ్ తప్పనిసరి చేయడం జరిగింది. ఇకపై ఫాస్ట్ టాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించడం జరగదని తెలిపింది టిటిడి.
ఫాస్ట్ టాగ్ లేని వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసిఐసిఐ బ్యాంకు వారి సహకారంతో ఫాస్ట్ టాగ్ జారీ కేంద్రం ఏర్పాటు చేయడం కూడా జరిగింది.
ఫాస్ట్ టాగ్ లేని వాహనదారులు ఇక్కడ అతి తక్కువ సమయంలో ఫాస్ట్ టాగ్ సౌకర్యాన్ని పొందిన తరువాత మాత్రమే వారి వాహనాలను తిరుమలకు అనుమతిస్తారని మరొకసారి టిటిడి చెబుతోంది. టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయంతో అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద వాహనాల రద్దీ తగ్గడంతో పాటు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. వచ్చిన వాహనాలు వచ్చినట్టే వెళ్లిపోవడంతో ట్రాఫిక్ జామ్ కూడా తగ్గుతుందని చెబుతోంది.
తిరుమలలో మరో అతి ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించింది టిటిడి. తిరుమల శ్రీవారి ఆలయం ముందు, మాడ వీధుల్లో ఇటీవల కొంతమంది వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు ప్రదర్శిస్తూ వీడియోలు (రీల్స్) చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చెయడం మనం చూస్తున్నాం. తిరుమలలాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర ,అసభ్యకర, వెకిలి పనులు అనుచితమని అందరూ మొత్తుకుంటున్నా విషయం కూడా తెలిసిందే.
భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయి. తిరుమల క్షేత్రం భక్తి, ఆరాధనలకు నిలయమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. తిరుమలలో కేవలం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకే పరిమితం కావాలి. శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాల పట్ల గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి తిరుమలలో ఇలాంటి అనుచిత ప్రవర్తనతో రీల్స్, వీడియోలు తీసేవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించింది టిటిడి.
టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఇలాంటి వీడియోలు చిత్రీకరించేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరిక జారీ చేసింది టిటిడి . ఎవరైనా తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా ఎలాంటి చర్యలు చేసినా ఉపేక్షించమని వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించింది.
తిరుమలలో అసభ్యకర వీడియోలు, వెకిలి చేష్టలతో రీల్స్ చేయకుండా తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం, పవిత్రతను కాపాడడంలో సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
ఇక తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు అనగానే వెంటనే మనకు వెంటనే జ్ఞాపకం వచ్చే ప్రధాన అంశాల్లో పదకవితా పితామహుడు అన్నమయ్య ఒకరు. తిరుమల పవిత్ర భూమి తిరుగాడుతూ, అలవోకగా చెవుల్లో పడుతున్న అన్నమయ్య పదకవితలు వింటూ తన్మయత్వంలో పడిపోని భక్తుడుండదు అంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. అలాంటి అన్నమయ్య సంకీర్తనలను మరింతగా జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లాలని, దానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు టిటిడి చైర్మన్. పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య కీర్తనలను యువతకు మరింతగా చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని కార్యనిర్వాణాధికారి ఛాంబర్ లో టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మంతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, అన్నమయ్య కీర్తనలపై ప్రాంతీయ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించి యువతను భాగస్వామ్యం చేయాలని, తద్వారా అన్నమయ్య కీర్తనలను మరింతగా జనబాహుళ్యంలోకి తీసుకెళ్లవచ్చని సూచించారు.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కీర్తిస్తూ వాగ్గేయ కారుడు అన్నమయ్య 14, 973 కీర్తనలను ఆలపించారని, ఇందులో 4,850 కీర్తనలను ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ రికార్డు చేసి 4,540 కీర్తనలను మాత్రమే అప్ లోడ్ చేశారని, మిగిలిన కీర్తనలను కూడా సకాలంలో రికార్డ్ చేసి భక్త ప్రపంచానికి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అన్నమయ్య కీర్తనలను మరింతగా యువతకు అందించి, ప్రాచుర్యంలోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ కు తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలని కూడా ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ సూచించారు. టిటిడి నిబంధనల మేరకు నవతరం గాయకులతో అన్నమయ్య కీర్తనలను రికార్డ్ చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. కాలానుగుణంగా సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా డిజిటల్ వ్యవస్థ ద్వారా అన్నమయ్య కీర్తనలను నవతరానికి అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇక నిన్నటి దర్శన వివరాలు చూస్తే నిన్న తిరుమలలో రద్దీ బాగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 20 నుంచి 24 గంటలు సమయం పడుతోంది. భక్తలు శిలాతోరణం వరకూ క్యూలైన్ లో ఉన్నారు. నిన్న 66,530 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 32,478 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. 4.66 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్టు టిటిడి ప్రకటించింది.