Vijaya Lakshmi
Published on Jul 29 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?గిరి ప్రదక్షిణ.... చాలా శక్తివంతమైన ఏంతో అర్థవంతమైన మాట. ఎన్నో శిఖరాలపై ఉన్న పుణ్య క్షేత్రాల్లో అత్యంత వైభవంగా వేలాది భక్తుల మధ్య జరిగే ఒక ఆధ్యాత్మిక ఉత్సవం. ఆ కొండను సాక్ష్టాత్తూ ఆ కొండమీద కొలువుతీరిన స్వామిగానే భావించి ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అదే గిరిప్రదక్షిణ. ఇలా గిరి ప్రదక్షిణలో పాల్గొంటే.. స్వామి కోరిన కోర్కెలు నెరవేరుస్తాడని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా.. స్వామిని మొక్కుకుని.. గిరి ప్రదక్షిణలో పాల్గొంటే.. ఆ కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.. మరి అలాంటి అద్భుతమైన గిరి ప్రదక్షిణ ఏయే క్షేత్రాలలో జరుగుతుంది ఎలా జరుగుతుంది… అసలు ప్రదక్షిణ అంటే అర్థమేంటి… ప్రదక్షిణలో ఎన్ని రకాలున్నాయి… ఆ ప్రదక్షిణాలు ఎలా చేస్తారు…
ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ చానల్ సబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ క్లిక్ చేసి ఆ వెంటనే ఆల్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.
గిరిప్రదక్షిణ ఎక్కడ చేస్తారు ఎందుకు చేస్తారు అన్న విషయం గురించి మాట్లాడుకునే ముందు అసలు ప్రదక్షిణ అంటే ఏంటో చూద్దాం, “ప్ర”అంటే తనలోని పాపాలను నాశనము కావాలని, “ద”అంటే కోరిన కోరికలు నెరవేరాలని, “క్షి” అంటే మరో జన్మలో అయినా మంచి బుద్దిని ప్రసాదించాలని, “ణ ” అంటే అజ్ఞానాన్ని పోగొట్టి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుంటూ చేసేదే ప్రదక్షిణ అని చెప్తారు పెద్దలు. అందుచేతనే ఆలయాల్లో తప్పనిసరిగా ప్రదక్షిణ చేయాలని చెపుతారు. అలాగే హిందూ సంస్కృతిలో ప్రక్రుతిని దైవానికి ప్రతిరూపముగా భావిస్తారు కాబట్టి చెట్టు పుట్ట కొండ కోనలకు ప్రదక్షిణ చేసే ఆచారం వచ్చిందని కూడా చెప్తారు. ఇంట్లో తులసి మొక్కకు ప్రదక్షిణం చేసినా, కొండ చుట్టూ ప్రదక్షిణ చేసినా ఆ భగవానుడిగా భావించి చేసేవే.
అసలు ప్రదక్షిణాలు ఐదు రకాలుగా చెప్తారు. 1.ఆత్మ ప్రదక్షిణ 2.పాద ప్రదక్షిణం 3.దండప్రదక్షిణం 4.అంగ ప్రదక్షిణం 5.గిరి ప్రదక్షిణం. ఆత్మ ప్రదక్షిణం అంటే తన చుట్టూ తాను తిరగడం. పూజానంతరం భగవంతునికి ఆత్మ ప్రదక్షిణం చేసి నమస్కరిస్తారు. ఇది ఇళ్ళలో పూజలు చేస్తున్నపుడు చేసే ప్రదక్షిణ ప్రక్రియ. పాదాలతో ముందుకు నడుస్తూ చేసే ప్రదక్షిణాన్ని పాద ప్రదక్షిణం అంటారు. ఇది ఆలయాలలో మనం సాధారణంగా ఆలయం చుట్టూ తిరుగుతూ చేసే ప్రదక్షిణ. దండ ప్రణామములు చేస్తూ ఆచరించే ప్రదక్షిణం దండ ప్రదక్షిణమవుతుంది.
శరీరంలోని అవయవాలు నేలకు తగులుతూ, గుడి చుట్టూతా తడి బట్టలతో దొర్లుతూ చేసే ప్రదక్షిణాలను అంగ ప్రదక్షిణం అంటారు. వీటినే ‘పొర్లు దండాలు’ అని కూడా అంటారు. కొండపైన పరమాత్ముడు కొలువుతీరి ఉంటే, ఆ కొండ చుట్టూతా చేసే ప్రదక్షిణమే గిరి ప్రదక్షిణమవుతుంది.
మరి ఈ గిరిప్రదక్షిణ అన్న మాట వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది కైలాసపర్వతం పరిక్రమణ. దేవభూమి హిమాలయాల్లో ఉన్న కైలాస పర్వతం హిందువులకు మాత్రమే కాదు బౌద్ధులకు, జైనులకు కూడా అత్యంత పవిత్రమైనది. ప్రపంచ దేశాల నుంచి ఏటా వేలమంది యాత్రికులు, పర్యాటకులు కైలాస యాత్రకు వచ్చి పర్వతానికి పరిక్రమణ లేదా ప్రదక్షిణ చేస్తారు. ఈ కైలాస పర్వతం సాక్షాత్తూ పరమేశ్వరుడే అని భావిస్తారు భక్తులు. నిరంతరం శివుడు ఆ పర్వతం పైనే ఉంటాడని కూడా భావిస్తారు. కేంద్ర ప్రభుత్వంలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏటా కైలాస యాత్ర జరుగుతుంది. అయితే ఈ కైలాస పర్వత పరిక్రమణ లేదా ప్రదక్షిణ అందరూ చెయ్యలేరు. ఈ కైలాస పర్వతం ప్రదక్షిణకు ఇటు శారీరక, మానసిక శక్తితో పాటు, ధన సంపత్తి కూడా ఎక్కువగా ఉన్నవారే ఈ యాత్ర చెయ్యగలరు.
ఇక గిరిప్రదక్షిణ కు అత్యంత ప్రసిద్ధి చెందిన మరో క్షేత్రం తమిళనాడులోని అరుణాచలం. అరుణాచలంలో గిరిప్రదక్షిణ ప్రసిద్ధి చెందిన మహిమాన్వితమైన వేడుక. పరమేశ్వరుడు ఇక్కడ ఈ గిరి రూపములో సాక్షాత్కరించిన సమయములో ముక్కోటి దేవతలు, మహర్షులు ఆనందముతో గిరి ప్రదక్షిణ చేశారని ఈ అరుణగిరి ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యాన్ని స్వయముగా పరమేశ్వరుడే గౌతమ మహర్షికి వివరించినట్లు స్కాంద పురాణము చెపుతుంది. సాధారనంగా సంవత్సరంలో ఒకసారి ఒక ప్రత్యేకమైన సమయంలో గిరి ప్రదక్షిణ జరుగుతుంది క్షేత్రాలలో. కాని ఈ అరుణాచలంలో గిరిప్రదక్షిణ మాత్రం సంవత్సరములో ఏ రోజుఅయిన చేయవచ్చని చెప్తారు. అయితే ఎక్కువగా పౌర్ణమి నాడు ఎక్కువగా ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అరుణాచలం కొండ చుట్టూ వున్న 18కి. మీ. ల మార్గాన్ని సవ్యదిశలో పాదరక్షలు లేకుండా నడవడమే గిరిప్రదక్షిణ. తిరువణ్నామలైగా ... అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో, పంచభూత లింగాలలో ఒకటైన తేజోలింగం అంటే అగ్నిలింగం కొలువుతీరి ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో గిరి ప్రదక్షిణా మార్గంలోని శివాలయాలను దర్శింస్తూ వెళ్ళడం అనిర్వచనీయమైన, అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.
గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా క్రమం తప్పకుండా జరిగే మరో క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం లో సింహాచలం వారాహ లక్ష్మీనరశింహస్వామి క్షేత్రం. ఆషాఢ మాసంలో శుద్ధ చతుర్దశి నాటి రాత్రి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. సింహగిరి మెట్ల వద్ద గిరి ప్రదక్షిణ ప్రారంభించి కాలి నడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి, కొండపైన స్వామిని దర్శించడమే ఈ గిరిప్రదక్షిణ. ఆషాఢ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమిగా, గిరి ప్రదక్షిణగా సింహాద్రి అప్పన్న ఉత్సవంగా చేస్తారు.
భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి సింహాచలం కొండ దిగువన వున్న తొలి పావంచా దగ్గర గిరి ప్రదక్షిణ మొదలు పెట్టి, 32 కిలోమీటర్ల దూరం నడిచి ప్రదక్షిణ పూర్తి చేసి మళ్ళీ సింహాచలం కొండ దిగువకు వచ్చి ప్రక్షిణ పూర్తీ చేసి ఉపవాస దీక్షను విరమిస్తారు. అంట దూరం నడవలేని వారు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ఆలయం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణ యాత్రలో లక్షలాది మంది భక్తులు అప్పన్న స్వామిని తలస్తూ కాలినడకన సింహాగిరి చూట్టూ ప్రదక్షిణ చేస్తారు. సింహగిరి చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ.. భూ ప్రదక్షిణతో సమానమని చెబుతారు. గిరిప్రదక్షిణ సందర్భంగా సింహాచల స్వామి నిజ, రూపం, అనునిత్యం మనం దర్శించే నిత్య రూపాలతో కూడిన పుష్పరథం కొండ చుట్టూ పయనించి భక్తులకు దర్శనం కల్పిస్తుంది.
గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగే మరో గిరి ఉత్తరప్రదేశ్ లోని గోవర్ధనగిరి. సాక్షాత్తూ శ్రీకృష్ణునికి మరో రూపంగా భావిస్తారు ఈ గిరిని. శ్రీకృష్ణుడు చిటికెన వేలితో ఎత్తిన పర్వతం గోవర్ధన పర్వతం. ఒక సందర్భంలో శ్రీకృష్ణుడు ఈ పర్వతాన్ని తన చిటికెన వేలితో ఎత్తి, ఇంద్రుడి కారణంగా వారం రోజుల పాటు కురిసిన వడగళ్ళతో కూడిన కుంభవృష్టి నుంచి గోకులవాసులందరినీ ఈ పర్వతం కిందికి చేర్చి రక్షించాదట. ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్ శ్రీ కృష్ణుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్లుగా భక్తులు భావిస్తారు.
ఇక్కడ చిన్న పెద్ద, ఆడ మగ అందరూ ప్రదక్షిణాలు చేస్తారు. కొంతమంది కుటుంబమంతా కలిసి చేస్తారు. అలా కుటుంబమంతా కలిసి చేసే గిరి ప్రదక్షిణ చాలా విచిత్రంగా ఉంటుంది. ఉదాహరణకు కుటుంబంలో నలుగురు బార్యా, భర్త, ఇద్దరు పిల్లలు ఉంటే, వాళ్ళు పడుకొని ఒకరి తరువాత ఒకరు సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రదక్షిణ చేస్తారు. అంటే ముందు ఇంటి పెద్ద అయిన భర్త సాష్టాంగ నమస్కారం చేస్తాడు. భర్త సాష్టాంగం పూర్తయిన దగ్గరనుంచి భార్య, ఆమె సాష్టాంగం పూర్తయిన దగ్గరనుంచి పెద్ద సంతానం, తరువాత చిన్న సంతానం ఇలా ఒకరి తరువాత ఒకరు సాష్టాంగం చేస్తూ ప్రదక్షిణ చేస్తారు. సాధువులు, పిల్లలు, పెద్దలు, కుటుంబాలు ఇలా అందరూ గిరి చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆశ్రమాలు, గుడులు, అన్నీ దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తారు.
గిరి ప్రదక్షిణ జరిగే మరో క్షేత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్నవరం సత్యనారాయణస్వామి క్షేత్రం. ఇక్కడ కార్తిక పౌర్ణమినాడు గిరి ప్రదక్షిణలు జరుగుతాయి. అన్నవరం కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం వలన కొండపై వెలసిన దేవతామూర్తుల శక్తిని పొందదమే కాకుండా కొండంతా నిండిన అనేక ఔషధ వృక్షాలు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయని చెప్తారు. అన్నవరం గిరి ప్రదక్షిణ అశ్వమేధ]యాగ ఫలాన్నిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. పంపాతీరాన సత్యదేవుని గిరి ప్రదక్షిణం త్రిమూర్తులకు చేసే ప్రదక్షిణగా చెబుతారు. సాక్షాత్తు ఆత్మ ప్రదక్షిణేనని భావిస్తారు.
గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగే మరో క్షేత్రం శ్రీశైలం. కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మాఘమాసంలోని పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేస్తారు.
అలాగే మాఘ పౌర్ణమి సందర్భంగా విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ కూడా గిరి ప్రదక్షణ చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో రామతీర్థంలో కూడా గిరిప్రదక్షిణ జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి సందర్బంగా రామతీర్థంలో ప్రతీ సంవత్సరం "గిరిప్రదక్షిణ"చేస్తారు. ఇవి గిరిప్రదక్షిణ ఎక్కడెక్కడ చేస్తారన్న విశేషాలు.
పండరీపురం పూర్తి చరిత్ర చదవండి