Vijaya Lakshmi
Published on Dec 15 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?*వ్రాయని ప్రేమలేఖ*
రచన : శ్రీమతి.విజయశ్రీముఖి
ఉష పత్రిక వారి కీ.శే. శ్రీ వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీలో
ప్రోత్సాహక బహుమతి పొందిన నవల.
"మేడమ్ గారూ.."
టీవీలో వార్తలు వినే ఇందుమతి ఆ పిలుపు విని తలతిప్పి చూసింది. స్వేచ్ఛ.. "రా..కూర్చో"ఎదురుగా ఉన్న కుర్చీని చూపింది ఇందుమతి
"నిన్న మీ స్టూడెంట్ వచ్చారని..."
"అర్థమైంది" అంటూ టీవీ ఆపేసింది. స్వేచ్ఛవైపు తిరిగింది ఇందుమతి.
తను నాప్రియశిష్యురాలు. మంచి పిల్ల. ఐనా తనముందు నీవు అసౌకర్యంగా ఉండి మాట్లాడలేవనిపించి వెళ్తానంటే తలూపాను."
"నేనదే అనుకున్నానండీ"
"అందుకే.. స్వేచ్ఛా ఇప్పుడు చెప్పు, చావు అనేది సమస్యనుండి తప్పించు కోడానికి మాత్రమే పనికొస్తుంది కానీ, పరిష్కారం అది కాదుకదా? ఇంకెప్పుడలా చేయకు" చెప్పింది ఇందుమతి
కొద్దిక్షణాలలాగే తలవంచుకు కూర్చున్న స్వేచ్ఛ తలెత్తి చూస్తూ అడిగింది "మీరు మనసులో అసహ్యించుకుంటున్నారా మేడం నన్ను?"
"ఎందుకలా అనుకుంటున్నావు? నీవు మొన్న అన్నావ్ చూడు? ఎవరి జీవితం వాళ్ళది. ఈ మూడునాళ్ళ బతుకులో ఇష్టంలేని దొంగబతుకు బతకడం అవసరమా అని? అంత నిక్కచ్చిగా ప్రశ్నించినదానివి అంతే ధైర్యంగా ముందు కెళ్లాలి కదా?"
"................."
"ఎదుటివాళ్ళ మాటలను మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేనంత అపరిపక్వ వయసు కాదు, మనసూ కాదు నాది"
ఆమె మాటలకు స్వేచ్ఛ కళ్ళల్లో సన్నటి నీటిపొర కమ్మింది. చేతులెత్తి నమస్కారం చేసింది.
స్వేచ్ఛ తన భావోద్వేగాలనుండి బైటపడడానికి కొంతసేపు మౌనంగా ఉంది ఇందు మతి.
నెమ్మదిగా చెప్పసాగింది స్వేచ్ఛ...
"మేడం! నేను ఆరేడు తరగతుల వరకూ
మామూలుగానే ఉన్నాను. ఆ తర్వాత నుండే నాలోఏదో మార్పు మొదలైంది.. ఆడపిల్లగా పుట్టినా బాగుండేదనే ఊహ.. ఆరాటం, అమ్మాయిగా ఉండాలనే తపన నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేది. తొమ్మిది, పదవతరగతిలోకి వచ్చేసరికి ఆ కోరిక మరింత బాగా బలపడిపోయింది...
నేను ఆడపిల్లగా మారిపోయినట్లు, నాకు నచ్చిన కుర్రవాడిని పెళ్లిచేసుకుని భార్యగా అనుకూలవతిగా ఆనందంగా గడుపుతూ పిల్లలను కూడా కంటున్నట్లు ఏవేవోపిచ్చి ఆలోచనలు కోరికలు... ఇంట్లో ఎవరూ లేనప్పుడు పైటలసుకుని, బొట్టూ కాటుక దిద్దుకునీ తెగ మురిసిపోయేవాడిని. అమ్మ, అన్నకు దొరికిపోతే స్కూల్లో నాటకం వేస్తున్నామని, నాది అమ్మాయి పాత్రని నమ్మిస్తూ నెట్టుకొస్తూ ఉండేవాడిని. సినిమాల్లో, బైట రోడ్లమీద ఎవరైనా భార్యాభర్తలు, ప్రేయసి ప్రియులు కనిపిస్తే ఆభార్య లేదా ప్రియురాలి స్థానం లో నన్ను ఊహించుకునేవాడిని "
"................."
స్వేచ్ఛ చెప్పడంఆపి, ఇందుమతి ముఖం ఆరాగా చూసింది. తన మాటలకేమైనా ఏవగింపుగా ఉందేమోనని.
ఆమె శ్రద్ధగా సానుభూతిగా వినటం చూసి మళ్లీ చెప్పసాగింది....
"... టెన్త్ లోకి వచ్చాక స్కూల్లోమగపిల్లలు ఆడపిల్లల్ని దొంగచూపులుచూస్తూ వాళ్ళ గురించి చిలిపిగా మాట్లాడుతూ 'నీకెవరు నచ్చారురా?' అని నన్ను అడిగేవాళ్లు. నేను వాళ్ళంతా నాకుస్నేహితులేగా అని అమాయకంగా నా మనసులో ఊహలన్నీ వాళ్లకు చెప్పేవాడిని..అలా బయటపడి వాళ్లకు చెప్పుకోవడం ఎంతతప్పో నాకు ఆ తర్వాత తెలిసింది..."
"................."
"...అప్పటినుండి చాటుమాటుకు నన్ను తీసుకువెళ్లి.. వాళ్లు మగవాళ్లై.. నన్ను ఆడ పిల్లగా చేసి....."
"................."
"అలా ఒకరికొకరు చెప్పుకుంటూ ఒకరి తర్వాత ఒకరుగా...."
"ష్.." అసహనంగా అనుకుంది ఇందుమతి.
"...కాదంటే, వద్దంటే నీ బండారం అందరికీ చెప్తామనిబెదిరిస్తూ నా నోరునొక్కేవాళ్ళు"
ఇందుమతి భారంగా నిట్టూర్చింది
"ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మేథ్స్ సబ్జెక్ట్ నాకుచాలా కష్టంగా ఉండేది ప్రైవేట్ కని రిటైర్ అయిన పంతులుగారి దగ్గరకు నా క్లాస్మేట్స్ వెళుతుంటే నేనూ వెళ్ళాను. ఒక రెండునెలలు గడిచేసరికి నా ఫ్రెండ్స్ లో ఆ పంతులుకు ఎవరు ఉప్పందించారో తెలియదు. భార్య పోయి, అరవైఏళ్ళుదాటిన ఆ ముసలి పంతులు కూడా మా కోతిమూక లిస్ట్ లో చేరాడు. నాకు నరకమే కనపడేది. వినకపోతే మా అన్నకు కబురు పెట్టేవాడు. అన్న వస్తే 'సరిగా చదవడంలేదు మార్కులు రావడం లేదు. నువ్వూ, మీఅమ్మ ఎంత కష్టపడి చదివిస్తున్నారో నాకు తెలుసు. మీవాడిని ఇక్కడ రాత్రుళ్లు పడుకోమను. వేకువనే లేపి చదివిస్తానంటే వినడంలేదు ' అని చెప్పాడు.
'సార్ చెప్పినట్లు విను. ఆయనంత ఇదిగా చెబుతూంటే చదవటానికి నీకేం రోగం రా? ఇంట్లో తినేసి వెళ్లి అక్కడే పడుకో. పరీక్ష తప్పంటే తాటతీస్తా' అన్నాడు మాఅన్నయ్య, అమ్మకూడా అదేమాట..."
ఆ పంతులు ప్రవర్తన వింటుంటే వెగటుగా ఉండి ఇందుమతికి. అసహ్యమూవేస్తోంది.
"...నన్ను ఒక్కడ్ని మాత్రమే రాత్రుళ్లక్కడ పడుకోమనేవాడు. ఇంకా కొంతమంది
'మేమూ వచ్చి పడుకుంటాం సార్' అంటే 'నా ఆరోగ్యం బాగోదు, నిద్రలేకపోతే మరీ ఇబ్బంది పడతా. వాళ్ళన్నయ్య వచ్చి బ్రతిమాలబట్టి వాడ్ని ఉండమన్నాను' అనేవాడు.
ఆరాక్షసుడు నన్ను వేధించుకు తినేవాడు. చదవలేక పోయేవాడిని. నాతోటి కుర్రాళ్లు 'ముసలోడు తెల్లారి పోయేదాకా బాగా చెబుతున్నాడా పాఠాలు?' అని వెకిలి మాటలతో వెక్కిరించే వాళ్ళు..."
"................."
"...తిరగబడి ఏదైనా అంటే అన్నకు అసలు విషయాలు చెబుతారేమోనని భయం. చదువబుద్ధి కావడం లేదు.. అసలక్కడ ఉండాలనే లేదు. ప్రతినిమిషం భయం... పూటపూటకి ఒక గండంలా గడిచేది. ఇంటి దగ్గర నుంచి ప్రైవేట్ కని చెప్పివెళ్లి ఎక్కడెక్కడో తిరిగేవాడిని. 'నిన్న మీవాడు రాలేదేమని 'అన్నయ్యకి కబురు వెళ్ళేది. రెండవరోజు తప్పక వెళ్లాల్సివచ్చేది.
'నేనెందుకిలా అయ్యాను? అందరిలాగా ఎందుకు ఉండలేకపోతున్నాననేబాధతో అస్తమానం అదే ఆలోచన. వీళ్ళమధ్య ఇంక బతకలేను. ఎటైనా వెళ్లిపోదాం.. దూరంగా అనుకున్నాను. తప్పలేదు తప్పించుకోలేకపోయాను అందుకే చీటీరాసి ఇంట్లోపెట్టి ఊరుదాటి వెళ్లిపోయాను.
".............."వింటోంది ఇందుమతి.
"...ఇంట్లోంచైతే బైటపడ్డాను ఎటువెళ్లాలి? ఎక్కడుండాలి? ఏంచేయాలి? తెలియదు. తెలుసుకోకుండానే ఎటోవెళ్లే రైలెక్కేసాను ఎక్కి..ఎక్కడో దిగాను. దిక్కూమొక్కులేని తెగిన గాలిపటాన్నయ్యాను..."
"................."
"...ఆ తిరుగుడులోనే బజార్లెంట, కొట్లెంట అసహజమైన ఆడతనంతో చప్పట్లు కొడుతూ..తిరిగే వాళ్ళను చూశాను. వాళ్ల వెనకవెనకే తిరగడం మొదలెట్టాను. చూసి చూసి నా గురించి అడిగారు. నా స్థితిని పరిస్థితిని చెప్పి, నా కోరిక కూడా చెప్పు కున్నాను...అప్పుడు వాళ్ళే నాకు ఉన్న ఆత్మీయులు.."
"వద్దు, వెనక్కి వెళ్ళిపొమ్మని వాళ్లు నీకు చెప్పలేదా?" అడిగింది ఇందుమతి.
"అలా అనలేదుగానీ, 'మా లాగానే నువు తయారైతే నిన్నింక మీవాళ్లు ఇంట్లోకి రానివ్వరు' అన్నారు.
'నేనసలు వెనక్కివెళ్లను ' అని చెప్పాను.
తినడం, తిరగడం ఉండటము ఇంక అన్నీ వాళ్ళతోనే కలిసి పోయాను.. కొన్నాళ్లతర్వాత వాళ్ళసాయంతోనే రాష్ట్ర సరిహద్దులు దాటి, ఒక మహానగరానికి చేరుకున్నాను..." సాలి తీర్చుకోడానికో.. ఊపిరి పీల్చుకోవ డానికో ఆగింది స్వేచ్ఛ.
ఇందుమతి లేచివెళ్ళి చల్లని మంచినీళ్ళు తెచ్చిఇచ్చింది. అవి తాగాక అలుపు తీరినట్లయి మళ్లీ చెబుతోంది స్వేచ్ఛ...
"ఏ గూటిపక్షులు ఆగూటికే చేరుతాయని అలాగే చేరాను. నేనెళ్ళిన చోటులో చూస్తే అక్కడందరూ హాయిగా ఎవరికి, దేనికీ భయపడకుండా.. జబర్దస్త్ గా బ్రతకటం చూస్తే నాకు భలేగుంది. ఇదేకదా స్వేచ్ఛ? అనుకున్నాను. వాళ్లు కూడా నన్ను వాళ్ల మనిషిలాగే ఆదరించారు..."
"...................."
తన మొహంలో ఎటువంటి భావాలను కనిపించ నివ్వకుండా జాగ్రత్తగా వింటుంది ఇందుమతి
"...అలా కొన్నాళ్లు వాళ్లతోపాటే తిరిగాను. చెప్పేదేముంది... ఇక్కడ నా తోటి పిల్లలు, ముసలి పంతులు చేసే పనులే అక్కడ మళ్లీ రిపీట్ అయ్యాయి. కాకపోతే ఇక్కడ భయంతో బిక్కచచ్చిపోయి చేసినపనులే అక్కడ ఇష్టంగా, స్వేచ్చగా జరిగేవి, పైగా చేతిలో డబ్బులూ పడుతుండేవి...
ఒక ఏడాదిన్నర తర్వాత నాకోరిక మీదే వాళ్ళు ఒక డాక్టర్ దగ్గర నాకు శస్త్రచికిత్స చేయించారు. నాదగ్గర డబ్బు కాక వాళ్లు కొంత సర్దుబాటు చేశారు.
'అమ్మాయిగా మారాక ఈ తిరుగుళ్ళును ఆపేస్తాను, ఎవరినైనా పెళ్లి చేసుకుని చక్కగా కాపురం చేసుకుందాం' అనేది నా ఆశ,నిర్ణయం కూడా. అందుకే నా నిరీక్షణ, ఈ సంపాదన!"
"................."
"ఇన్నాళ్ళు ఎలాగో తప్పదు కనుక నేనిలా తిరిగాను. ఇంకావసరం లేదనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక స్త్రీని! చక్కగా ఎవరినైనా పెళ్లిచేసుకుని కాపురం చేసుకోవచ్చని ఎంతో సంబరపడ్డాను.."
"................."
"... కొన్నిరోజులు విశ్రాంతి తర్వాత నేను మా వాళ్లను అడిగాను 'ఇప్పుడు నన్ను ఎవరైనా పెళ్లిచేసుకుంటారా? బజార్లలో తిరగడం మానేసి చక్కగా కాపురం చేసుకోవాలనుంది' అని. వాళ్ళు నవ్వారు 'చూద్దాం... ఎప్పటిలాగా నీపని నువు చేస్తూండు. సాధారణంగా ఏ మగాడైనా కోరేది పరిపూర్ణమైన స్త్రీయే భార్యగా ఉండాలి అని, తనతో పిల్లల్ని కనివ్వాలని." చెప్పారు మా వాళ్ళు.
"మరీ..మనదగ్గరకు రావడందేనికి?"
"బులపాటం తీర్చుకోడానికి"
"చేసుకున్న పెళ్లాలుంటారుగా?"
"మనదగ్గరేసే గంతులు పెళ్ళాల వద్ద వేస్తే చిత్తకార్తి ఎదవలని విలువివ్వరని భయం పైగా పెళ్లి చేసుకునే వరకు మనతో కాలక్షేపం చేసేవాళ్ళు మరికొందరు"
"నేను.. నాకిట్లా బాగోటంలేదు.. ఇది కాదు నేను కోరుకుంది.." అంటూ ఏడ్చేసాను.
'నీ అదృష్తంబాగుంటే నీకు వచ్చేవాళ్ళలో ఎవరైనా ఇష్టపడితే అట్టాగే చేసుకుందుగానిలే 'అని ఓదార్చారు..."ఆగింది స్వేచ్ఛ
ఇందుమతి లేచి ఫ్లాస్క్ లో ఉన్న టీ ని రెండు కప్పుల్లోకివంచి ఒక కప్పు స్వేచ్ఛకు ఇస్తుంటే "వద్దు మేడం" అంది స్వేచ్ఛ.
"పర్వాలేదు తీసుకో " అంటూ తను ఒక కప్పు తీసుకుంది ఇందుమతి.
కప్పు చేత్తో పట్టుకుని మళ్లీ చెప్పసాగింది. స్వేచ్ఛ....
"... కాలం గడిచిపోతుంది.. నాలోని ఆశ అంతకంతకు పెరుగుతుందే గాని తగ్గటం లేదు. నా దగ్గరకు వచ్చే యువకులను అడిగేదాన్ని అర్ధించేదాన్ని.. 'మీకు పెళ్లి కాకపోతే నన్ను చేసుకుంటారా జన్మంతా మీకు రుణపడిఉంటాను, మీరుచెప్పినట్టు వింటాను, మీతోనేఉంటా' నంటూ కొందరు 'చూద్దాం ఆలోచిద్దాం ' అని ఆశ పెట్టేవాళ్ళు. మరికొందరు నీతో పెళ్లేంటి?' అని వ్యంగ్యంగా వెక్కిరించేవాళ్ళు. అలాంటి సందర్భంలో రెండు మూడు రోజులు మనిషిని కాలేకపోయేదాన్ని. మా వాళ్లు ఏవో మాటలతో ఓదార్చేవాళ్ళు.."
ఇందుమతి ఖాళీ కప్పు ప్రక్కన పెట్టేస్తూ, "ముందవి తాగుస్వేచ్చా చల్లారిపోతూ ఉన్నాయి" అంది
స్వేచ్ఛ తాగి ఇందుమతి కప్పు తనది తీసుకువెళ్లి ఇందుమతి వద్దన్నా కడిగి అక్కడ పెట్టేసి వచ్చింది. మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది.
"...అదే సమయంలో మరొక సంఘటన జరిగింది. ట్రాన్స్ జెండర్స్ లో "జగదంబ" అనే ఒక పెద్దావిడ అక్కడ దగ్గర్లోనే మరో ఊర్లో ఉంటుందని ఈమధ్య ఆమెకసలు ఆరోగ్యం బాగాలేదని చూసి రావడానికి మావాళ్ళు కొందరు వెళుతుంటే నేనూ వాళ్లతో పాటువెళ్లాను..
ఆమెవయసు డెబ్భై సంవత్సరాలు పైనే.
వాళ్లతో మాట్లాడుతూ నన్ను చూసి నా వివరాలు అడిగి తెల్సుకుంది. నన్ను ఆత్మీయంగా దగ్గరకు తీసుకుంటూ, "నీ కళ్ళు నవ్వు చూస్తుంటే మా 'బంగారు పాప ' లాగే ఉన్నావ్!" అంటూ నన్ను ముద్దాడింది.
"ఎవరా బంగారు పాప?"అని నేను అడుగుతుంటే మా వాళ్ళు నన్ను వారించి సంభాషణ మార్చారు ఆమెతో.
తర్వాత మేము ఇంటికివచ్చాక తెలిసింది
****
సశేషం
మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో
ఇవి కూడా చదవండి