అన్వేషణ తెలుగు నవల పదవభాగం | ఇందూరమణ | Anveshana part 10 | investigative & most suspense novel

Vijaya Lakshmi

Published on Jul 01 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

  అన్వేషణ

ధారావాహిక నవల

పదవ భాగం

రచన : శ్రీ ఇందూరమణ

భగవంతుడా! నువ్వున్నాావయ్యాా!’ మనసులోనే సింహాద్రినాథునికి మొక్కుుకుని ఫోన్‌ రింగ్‌ చేసింది. చీర చెంగులోనే ఫోన్‌ దాచుకుని చెవిదగ్గర సెల్‌ ఆనించింది. ‘‘హలో!....’’ నెమ్మదిగా అంది ఆమె.

‘‘బాగున్నాావా తల్లి?...’’ అవతల్నుంండి ఖంగుమంది గొంతు.

‘‘చెప్పంండి అత్తమ్మ!....మీరు నా కోసం ఫోన్‌ చేసారంటే శుభ వార్తేగా?!’’ ఆనందంగా అంది ఆమె.  

‘‘అంత అదృష్టమా తల్లీ! లేదు. మనందరి అన్వేేషణ అదేగా తల్లీ!’’ అట్నుంంచి బాధగా అంది అత్తమ్మ.

‘భగవంతుడా!....’ అంటూ ఒక్కసారే మ్రాాన్పడి పోయింది.

‘‘మీరిప్పుడు ఏ ఆలయంలో ఉన్నాారు?’’ అడిగింది అత్తమ్మ.

‘‘సింహాచలంలో....’’ అందామె.

‘‘శుభం! జాగ్రత్త! నీ ఉనికి ఎవరికీ తెలీనీకు తల్లీ!’’

‘‘అలాగే అత్తమ్మాా!’’ అంది.

ఫోన్‌ తిరిగి బ్యాాగ్‌లో దాచేసింది. ఆలోచిస్తూనే బ్యాాగ్‌ భుజాన తగిలించుకుని నడుస్తూ కొండ బస్సుస్టాప్‌ దగ్గరకు వచ్చిందామె. బస్సు స్టాండ్ నిండా భక్తులు తండోపతండాలుగా ఉన్నాారు. ఒకో బస్సు వస్తోంది. జనాలతో కిక్కిిరిసిపోతోంది. ఒక దాని తర్వాాత ఒకటి వచ్చి వెళ్తున్నాాయి గానీ, క్యూలో ఉన్న భక్తులు తరగటం లేదు. ఎదురుగా ఉన్న అన్నదాన సత్రం కేసి చూసింది. దాని ప్రక్కనే ఊడల మర్రిచెట్టు దెయ్యంలా జడలు విరబోసుకుని ఉంది. ఆ ప్రాంతం అంతా చీకటి మింగేసింది.

ఐమ్యాాక్స్‌ లైట్ల కాంతి ఆ ప్రాంతమంతా అలుముకుని ఉంది. అన్నదానం ఎదురుగానే ఫేన్సీ దుకాణాలు, ఫోటో దుకాణాలు. శనగలు, ఖర్జూరం దుకాణాలు బారులు తీరి ఉన్నాాయి. క్యూ లైన్లో నిలబడ లేక ఒంటరిగా ఓ మూల నిలబడింది ఆమె. జనాలతో నిండుకుంటున్న బస్సుల కేసి చూస్తూ నిలబడింది. ‘నడిచి వెళ్ళిపోతేనో!’ మనసులోనే అనుకుంది. మళ్ళీ తనకి తనే ‘వద్దుులే! బస్సు ఎక్కేేయ్యడమే మేలు’ అనుకుంటూ టిక్కెట్లు బుకింగ్‌ కౌంటర్‌ దగ్గరకు వెళ్ళి టిక్కెట్టు తీసుకుంది. టిక్కెట్టు పట్టుకుని భక్తుుల వెనక క్యూలో నిలబడీ నిలబడనట్టు ఒక ప్రక్కగా నిలబడి మర్రిచెట్టు కేసి చూసింది. ఒక్క సారే ఉలిక్కిి పడింది ఆమె. గతరాత్రి జరిగిన సంఘటనలే వరుసగా కళ్లముందు కదలాడాయి. చేతిలో పుష్కలంగా డబ్బుు ఉన్నాా ఆ రాత్రి విశ్రమించడానికి ఒక గది అద్దెకు తీసుకోలేక పోయింది. నెల రోజులుగా ఇదే అవస్థ ఎక్కడడగిన ఇవ్వకూడదనే సమాధానం. చీకటి పడగానే ఒక గది కావాలని దేవస్థానం విశ్రాంతి మందిరంలో ఉన్న బుకింగ్‌ క్లర్క్‌ని ఎంతగా ప్రాాథేయపడింది! ఒక్కరికి గది అద్దెకు ఇవ్వడం కుదరదని కుండబద్దలు కొట్టినట్టుు చెప్పి బయటకు తగిలేసాడు. అంతేనా! తనని ఓ పిచ్చిదాన్ని చూసినట్టుు చూసాడు. దేవాలయం కదా ఇస్తారనుకుంది. అన్నిచోట్ల ఒకటేమాట. భగవంతుడా ఒంటరిగా వచ్చేేవాళ్ళ గతి ఏంకాను. మనసులోనే బాధ పడింది.

‘‘గాలిగోపురం దగ్గర సత్రం ఉంటుంది. నీలాంటి వాళ్లంతా అక్కడ పడుకుంటారు. అక్కడికి పోమ్మాా’’ అంటూ చీదరించుకున్నాాడు ఆ బుకింగ్‌ క్లర్క్‌.

అతనన్నట్టు సత్రంం వెదుక్కుంటూ వెళ్ళింది. అది ఓ పెద్ద రేకుషెడ్డు. అప్పటికే ఆ షెడ్డు నిండా ఈగల్లా భక్తుులు మూటా ముల్లెెలు ప్రక్కన పెట్టుకుని ఆక్రమించేసి ఉన్నాారు. తను ఒక్కర్తే విశ్రమించడానికి పిసరంత జాగా కూడా కానరాలేదు. లక్షల్లో వచ్చేే భక్తులకు ఒక్క రేకు షెడ్డు ఏం సరిపోతుంది. ఇక అక్కడ ఇమడలేక.... నిలబడ లేక తిరిగి వెనక్కిి వచ్చేేసింది. కన్నుమూస్తే తెల్లారిపోయే ఈ రాత్రి ఎక్కడో ఒక దగ్గర చేరగిలబడితే సరి అనుకుంటూ అన్నదానం భవ నం దగ్గరున్న మర్రిచెట్టు నీడని ఎంచుకుంది. తోడుగా ముసలమ్మ ఉందని ఎంతో ఆనంద పడింది. కానీ....?! అంత ఘోరం జరుగుతుందని ఊహించ లేక పోయింది.

కొండ బస్సు ముందుకు కదులుతూ చేసిన హారన్‌ శబ్దానికి ఉలిక్కిిపడింది ఆమె. భక్తులు పల్చబడ్డారు. ఒక్కరొక్కరుగా మరో బస్సు ఎక్కుతున్నాారు. క్యూలో లేకపోయినా అందరూ బస్సు ఎక్కుతుంటే ఆఖర్న నడుస్తూ ముందుకు వెళ్తోంది ఆమె. ఉన్నట్టుండి తన వెనుకే ఎవరో ఏదో మాట్లాాడుకోవడం చెవిన సోకేసరికి ఉలిక్కిిపడింది మహాశ్వేత. ఒక్కసారిగా వెనక్కిి తిరిగి చూసింది. ఇద్దరు యువకులు ఆమెనే చూస్తూ ఒకరికొకరు ఏదో చెప్పుకుంటున్నాారు. వాళ్లని చూస్తూనే అదిరి పడింది ఆమె.

‘‘అరేయ్‌ చూడరా! ముసుగేసుకుని బస్సు ఎక్కుతోందే! అదే లాగుంది కదా!’’ ఒకడంటున్నాాడు.

‘‘ఆ బస్సు ఎక్కుతున్న వాళ్లంతా చలికి ఒణుకుతూ ముసుగులేసుకుని బస్సుులెక్కుతున్నాారు చూడు’’ అన్నాాడు రెండో వాడు.

‘‘లేదురా! నాకెందుకో... రాత్రి మనల్ని గాయపరిచింది ఆమె అన్పిస్తోంది’’ మొదటి వాడు అంటున్నాాడు. ఆ మాటలు వింటూనే ఆమెకి అర్థమైపోయింది. ఆ యువకులిద్దరూ తన గురించే వెదుకుతున్నాారని గ్రహింంచింది.

ఆ యువకులకి అరడుగు దూరంలో మరో ఇద్దరు యువకులు ఆతృతగా వారినే గమనిస్తూ నిలబడ్డారు. సివిల్‌ డ్రస్‌లో ఉన్న పోలీసులు ఆ ఇద్దరూ. వాళ్ళ వాటం... వాలకం చూసి ఇట్టేే గ్రహింంచేసిందామె. ఆఖరున బస్సు ఎక్కుతూ ఒక సారి వెనక్కిి తిరిగి చూసింది ఆమె. తలనిండుగా కప్పుకున్న చీరకొంగు నున్నగా ఉన్న గుండుమీద నుండి సర్రున జారిపోయింది. బస్సు ఎక్కుతూ తమనే చూసిన ‘ఆమెని యువకులిద్దరూ చూసి ఉలిక్కిి పడ్డారు. అందంగా అప్సరసలా వున్న ఆమె’ తల నున్నగా గుండు చేయించుకుని కనిపించే సరికి ‘అయ్యో!’ అనుకున్నాారు. తమ వైపే చురుగ్గాా చూస్తున్న ఆమెని గుర్తుుపట్టి అయోమయంగా చూస్తూ నిలబడ్డారిద్దరూ.  

ఆ యువకులిద్దరూ తన కేసే పరీక్షగా చూడడం గమనించిన ఆమె గిర్రున తిరిగి బస్సులో కిక్కిిరిసి ఉన్న భక్తుల్ని చీల్చుకుంటూ లోపలకు చొరబడి ఆ యువకుల కంటపడకుండా దాక్కుంది. బస్సు కిక్కిిరిసి పోవడంతో క్రింద బస్సు డోర్‌ దగ్గర నిలబడి టిక్కెట్లు చెక్‌ చేసిన క్లీనర్‌ కుర్రాాడు చేత్తో దబ దబా రైట్‌ చెప్పాాడు. అప్పటికే బస్సుు స్టార్ట్‌ చేసి ముందుకు కదలడానికి సిద్ధంగా ఉన్న డ్రైవర్‌ ఒక్క సారే బస్సుని ముందుకు కదిలిస్తూ స్పీడు పెంచాడు. బస్సు ఎక్కుతూ వెనక్కిి తిరిగి తమ వైపే చూస్తూ నిలబడ్డ ఆమెనే గుర్తు చేసుకుంటూ తన్మయంగా నిలబడిపోయారు ఆ యువకులిద్దరూ.

అంత అందగత్తె....ఆ అందానికే అందాన్ని చేకూర్చేే ‘జుత్తు’ ను దేవుడికి కానుకగా సమర్పించి గుండు చేయించుకుందేమిటబ్బాా అనుకుంటూ నిలబడ్డ యువకుల్లో ఒకడు ఏదో గుర్తొచ్చిన వాడిలా అదిరి పడ్డాడు.

‘‘ఒరేయ్‌! రాత్రి మన మీద దాడి చేసింది ఆమేరా! ఆమె.... ఆ కళ్ళు.... చింతనిప్పుల్లా మెరుస్తూ మనమీద కసిగా కత్తిితో దాడి చేసిన ఆమె... ఆమె కళ్ళు... నాకింకా గుర్తేరా! అదే!... ఆ రాక్షసే!’’ అంటూ గట్టిగా అరిచాడు ఒక యువకుడు. అప్పటికే బస్సు కొండచరియల్లోనుండి పాములా మెలికలు తిరుగుతూ సరసరా పరిగెడుతున్న కొండ చిలువలా ముందుకు దూసుకుపోతోంది. ఆ యువకుడు అరవగానే వారి వెనుకే నిలబడ్డ పోలీసులు ఇద్దరూ పరుగున వారి దగ్గరకు వచ్చాారు.

నలుగురూ ఆందోళనగా కనుమరుగైన బస్సు కోసం కొండకేసి చూస్తూ స్థాణువులై నిలబడిపోయారు.

****************

ఏ.సి.పి. ఆఫీసులో రిపోర్ట్‌ చేసి బయటకు వచ్చాాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. కొండమీద ముసలమ్మ మరణం గురించి తన పరిశోధనలో తేలిన విషయమంతా ఏ.సి.పి., సి.ఐ కి రిపోర్ట్‌ చేసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. బుల్లెెట్‌ మీద గోపాలపట్నంకేసి బయల్దేరాడు. ఇంతలో సెల్‌ ఫోన్‌ రింగయింది. ‘ఎవరై ఉంటారబ్బాా’ అనుకుంటూ రోడ్డు ప్రక్కన బుల్లెట్‌ ఆపి సెల్‌ తీసి చూసాడు.

మధ్యాాహ్నం ఆ ఇద్దరు యువకుల వెంట సివిల్‌ డ్రస్‌ల్లో వెళ్లిన కానిస్టేబుల్స్‌లో ఒకడు. వెంటనే కాల్‌ రిసీవ్‌ చేసుకుని సెల్‌ చెవిదగ్గర పెట్టుకున్నాాడు.

‘‘చెప్పు టు నాట్‌ టు’’ హుందాగా అన్నాాడు ఎస్సై.

‘‘సార్‌!....ఆమె కనిపించింది.’’ అట్నుండి ఆతృతగా అన్నాాడు కానిస్టేేబుల్‌.

‘‘వెల్‌! వెంటనే ఆమెని పట్టుకుని స్టేేషన్‌కి తీసుకు రండి.’’ ఆనందంగా అన్నాాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.  

‘‘కనిపించింది సార్‌! కానీ...’’ నీళ్ళు నములుతూ అన్నాాడు అట్నుండి కానిస్టేబుల్‌. ‘ కానీ ’ మాట వినగానే ఎస్సై అక్బర్‌ ఖాన్‌కి చిర్రెత్తి పోయింది.

‘‘యూస్‌లెస్‌ ఫెలో! కానీ... ఏమిటీ! ఏమైందో చెప్పు.’’ అసహనంగా అన్నాాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘కొండబస్సులో క్రిందకు వెళ్లిపోతోంది సార్‌!’’ అన్నాాడు కానిస్టేేబుల్‌

‘‘షటప్‌! ముందు ఎవరిదైనా బైక్‌ తీసుకుని బస్సుని ఫాలో అవ్వండి. నేను క్రింద బస్సు స్టాండ్‌ దగ్గర ఆ బస్సుని కేచ్‌ చేస్తాను. హరియప్‌! ఆమె మిస్‌ కాకూడదు’’ కోపంగా అరుస్తూనే కాల్‌ కట్‌ చేసి సెల్‌ జేబులో పెట్టుకున్నాాడు.

‘ఎలాగైనా ఆమెని పట్టుుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెని వదిలి పెట్టకూడదు. కొండపై నుండి బస్సు కొండ దిగువ బస్సు స్టాండ్‌కు చేరేలోపు వెళ్ళాలి!’ అనుకుంటూనే బుల్లెట్‌ స్టార్ట్‌ చేసాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

*************

ఎస్సై ఫోన్‌ లోనే తిట్టేసరికి కానిస్టేబుల్స్‌ ఇద్దరికీ ముచ్చెెమటలు పోసాయి. ఇప్పుడు ‘ఆమె’ని పట్టుకోలేకపోతే తమ ఉద్యోోగాలకే ముప్పు ఏర్పడుతుందని భయంతో ఆందోళన చెందారు ఇద్దరూ.

**********************************

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో


మహాశ్వేత పోలీసులకందినట్టేనా? అసలామె అన్వేషణ దేనికోసం?? ఫలించేనా...?


ఇవి కూడా చదవండి

Recent Posts
గ్రహ దోషాలు పోగొట్టే నవ తిరుపతులు ఎక్కడున్నాయో తెలుసా?  | Nava Tirupati - Nine Abodes of Lord Vishnu
గ్రహ దోషాలు పోగొట్టే నవ తిరుపతులు ఎక్కడున్నాయో...
1000 ఏళ్ల హంపి విరూపాక్ష ఆలయం  |  అంతుచిక్కని రహస్యాలు  | hampi Karnataka temples
1000 ఏళ్ల హంపి విరూపాక్ష ఆలయం ...
హంపి వెళితే ఈ ప్రదేశాలు చూడడం మిస్సవకండి  |  హంపిలో చూడవలసిన 10 ప్రదేశాలు  | Hampi visiting places & temples
హంపి వెళితే ఈ ప్రదేశాలు చూడడం మిస్సవకండి...
పైడితల్లి అమ్మవారు ఎవరు? సిరిమాను వెనుక ఉన్న అసలు కథ! | Vijayanagaram pydimamba temple history  |   sirimanu festival
పైడితల్లి అమ్మవారు ఎవరు? సిరిమాను వెనుక ఉన్న...
2026 విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు | 2026 Vijayanagaram pydimamba sirimanu dates
2026 విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు...